Ragi Recipes : రాగి పిండితో అనేక రకాల వంటలు తయారు చేసుకోవచ్చు.. ఇప్పుడు రాగి పిండితో 4 రకాల హెల్తీ రెసిపీలు రాగి సంకటి, రాగి పిండి చపాతి, రాగి పిండితో గుంత పొంగనాలు, దోశలు తయారు చేసుకోవచ్చు. రాగితో చేసిన వంటకాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందులో నీరసం, బలహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. ఎముకలు దృఢంగా తయారవుతాయి. రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. బరువు కూడా సులభంగా తగ్గవచ్చు. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. షుగర్ స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. రాగిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కండరాలు దృఢంగా తయారవుతాయి, ఒంటిలో వేడి తగ్గుతుంది.
రాగి అంబలి కావలసిన పదార్థాలు..
ఒక గిన్నె ఒక గ్లాస్ రాగి పిండి తీసుకోవాలి. అదే గ్లాస్ తో ఆరు గ్లాసులు నీళ్లు పోయాలి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒకటి ఇప్పుడు బాగా కలపాలి. రుచికి సరిపడంత ఉప్పు వేసి.. గ్యాస్ మీద పెట్టి సన్నని మంటపై ఉండలు లేకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అంబలి చిక్కబడేంత వరకు ఉడికించాలి. రాగి జావా ,అంబలి చల్లారిన తర్వాత పెరుగు లేదా చిక్కటి మజ్జిగ వేసి బాగా కలపాలి.. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసి కలపాలి.. అంతే ఎంతో రుచికరమైన అంబలి రెడీ..
రాగి సంగటి తయారీ విధానం…
ఒక బౌల్లో హాఫ్ కప్పు బియ్యం తీసుకోవాలి. బియ్యాన్ని శుభ్రంగా కడగాలి. అరగంట సేపు నానబెట్టాలి. ఒక కప్పు రాగి పిండి ఆఫ్ కప్పు బియ్యం తీసుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెను తీసుకోవాలి. ఎందుకంటే అడుగు మాడకుండా ఉంటుంది. ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల నీళ్లు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పెట్టి బాగా మరగనివ్వాలి.. ఇప్పుడు ముందుగా నానబెట్టిన బియ్యాన్ని వెయ్యాలి. అన్నం బాగా మెత్తగా ఉడికించాలి. ఒక టీ స్పూన్ ఉప్పు వేయాలి. ఇప్పుడు రాగి పిండి వేసుకోవాలి. సన్నని మంటతో ఉడికించాలి. మరోవైపు ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకుని గ్యాస్ పై పెట్టి వేడి చేయాలి.
పది నిమిషాల తర్వాత అన్నం, రాగి పిండి నీ పొడి పిండి, ఉండలు లేకుండా బాగా కలపాలి. కలిపేటప్పుడు గట్టిగా అనిపిస్తే ముందుగా వేడి చేసుకున్న నీళ్లు కొంచెం కొంచెం పోస్తూ కలపాలి. సాఫ్ట్ గా వచ్చేవరకు రాగిసంకటిని అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. కొన్ని నీళ్లు పోసి రెండు నిమిషాలు ఉడికించాలి స్టవ్ ఆఫ్ చేసి రాగి సంకటిని వేడిగా ఉంటుంది కనుక చేతులను నీళ్లు ముంచి రాగి ముద్దలా తయారు చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన రాగి సంకటి రెడీ.. చికెన్ తో మటన్ , చేపలు కూరలతో ఎంతో రుచిగా ఉంటుంది.
రాగి పిండి చపాతి తయారీ విధానం…
రాగి చపాతి ఈజీగా సాఫ్ట్ గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కప్పు రాగి పిండి ని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో రాగి పిండి తీసుకున్న కప్పుతో ఒక కప్పు నీళ్లు తీసుకుని కొంచెం ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి అందులో రాగి పిండి పోసి ఉండలు బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఐదు నిమిషాలు తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చపాతి పిండిలా సాఫ్ట్ గా కలుపుకోవాలి. కొంచెం నూనె వేసి కలిపితే చేతులకు పిండి అంటకుండా ఉంటుంది.
ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసి పలుచగా, మందంగా, ఉండకుండా కొంచెం మీడియంలో చపాతీలను తయారు చేసుకోవాలి. ఇప్పుడు పెనం బాగా వేడెక్కిన తర్వాత చపాతీలు వేసి రెండువైపులా కాల్చుకోవాలి.. అంతే ఎంతో రుచికరమైన రాగి చపాతి రెడీ.. పప్పు, చికెన్, అన్ని రకాల కూరలతో తింటే ఎంతో రుచిగా ఉంటాయి.
రాగి పిండితో గుంత పొంగనాలు, దోశలు తయారీ విధానం..
ఒక గిన్నెలో దోశ పిండి తీసుకొని ఒక కప్పు రాగి పిండి పోసి బాగా కలపాలి. చిన్న కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేయాలి, ఒక టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొంచెం, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి రెండు, సన్నగా కట్ చేసిన కొంచెం అల్లం ముక్కలు, రుచికి సరిపడంతా ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు పిండిని పునుగులు వేసే విధంగా తయారు చేసుకోవాలి. గుంత పెనాన్ని స్టవ్ పై పెట్టాలి.. ఆ గుంతల్లో కొంచెం ఆయిల్ వేసుకొని పెనం వేడి అయిన తర్వాత పిండి గుంతలలో వెయ్యాలి. మీడియం ఫ్లేమ్ లో రెండువైపులా పొంగనాలను ఉడికించాలి.. అంతే ఎంతో రుచికరమైన గుంతపొంగనాలు రెడీ…
Read Also : Jonna Ambali : జొన్న అంబలి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో తెలుసా? ఎలాంటి రోగాలైనా దరిచేరవు..!