Jonna Ambali : జొన్నలతో అంబలి తయారు చేసుకొని తాగడం వల్ల నీరసం, బలహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. ఎముకలు దృఢంగా తయారవుతాయి. రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఈ అంబలి తాగడం వల్ల జీర్ణ శక్తి మెరుగు పడుతుంది. మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునే ఈ అంబలి తాగడం వల్ల చక్కటి ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు. అలాగే ఈ అంబలి తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది. షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా ఈ అంబలి తాగడం వల్ల కండరాలు దృఢంగా తయారవుతాయి, శరీరంలో వేడి తగ్గుతుంది.
ఇప్పుడు జొన్న అంబలి తయారీ విధానం.. ముందుగా స్టవ్ వెలిగించి, ఒక గిన్నె రైస్ కప్పుతో ఐదు కప్పుల నీళ్లు పోయాలి బాగా మరిగే వరకు ఉంచాలి. మరొక గిన్నె తీసుకొని ఒక కప్పు జొన్న పిండి పోయాలి అందులో ఒక కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండిని పలచగా కలుపుకోవడం కోసం మరొక కప్పు నీళ్లు పోసి బాగా కలపాలి. మరిగే నీళ్లలో కలిపి పెట్టుకున్న జొన్న పిండిని పోయాలి. ఇప్పుడు అడుగు అంటకుండా, ఉండలు కట్టకుండా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి.. కొద్దిసేపు తర్వాత చిక్కబడుతుంది. ఈ అంబలి జొన్న పిండితో కాకుండా జొన్న రవ్వతో కూడా చేసుకోవచ్చు.. రాగి పిండితో కూడా చేసుకోవచ్చు.. చిరుధాన్యాల పిండితో కూడా చేసుకోవచ్చు..
ఈ అంబానీ ఉదయాన్నే తాగాలి అంటే రాత్రి ఉడికించి పెట్టుకోవాలి. సాయంత్రం తాగాలంటే దాన్ని ఉడికించి పెట్టుకోవాలి.. అంబలి ఐదు నిమిషాలు ఉడికించుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసి రెండు నిమిషాలు కలపాలి.. అంతే ఎంతో రుచికరమైన అంబలి తయారీ.. ఇప్పుడు ఈ అంబలిని మట్టి పాత్రలో పోయాలి.. రాత్రంతా పులవనిచ్చిన తర్వాత మరుసటి రోజు అంబలి కొంచెం గట్టిగా, జున్నుల తయారవుతుంది.
అంబలిని బాగా కలపాలి. ఇప్పుడు అందులో ఆఫ్ లీటర్ మజ్జిగ పోయాలి. ఇప్పుడు ఉండలు లేకుండా బాగా కలపాలి.. రుచికి సరిపడా అంత ఉప్పు వేసి కలపాలి. జొన్న అంబలి రెడీ.. వేసవికాలం వచ్చింది కదా.. ఆలస్యం ఎందుకు జొన్న అంబలి చేసుకొని తాగుదామా మరి.. మధ్య మధ్యలో ఉల్లిపాయ పచ్చిమిర్చి చాలా రుచికరంగా ఉంటుంది. శరీరానికి ఈ అంబలి చాలా చలవ చేస్తుంది. మట్టి పాత్రలో అంబలిని పోసి 8 గంటల వరకు నానబెట్టిన తర్వాత తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.