Hyderabadi Mutton Dum Biryani : హైదరాబాద్ మటన్ దమ్ బిర్యాని.. ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీలానే మటన్ బిర్యానీకి కూడా ఇష్టంగా తినేవాళ్లు చాలామంది ఉన్నారు. హైదరాబాద్ వచ్చారంటే చాలు.. ఎవరైనా నాన్ విజ్ తినేవారు తప్పకుండా హైదరాబాదీ దమ్ బిర్యానీ టేస్టు చేయకుండా వెళ్లరనే చెప్పాలి. అంతగా టేస్టీగా ఉంటుంది. ఇంతకీ హైదరాబాదీ బిర్యానీని ఇంట్లోనే తయారుచేసుకోలేమా? అంటే ఈజీగా తయారుచేసుకోవచ్చు. అసలు హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ లేదా మటన్ దమ్ బిర్యానీ ఎలా తయారుచేయాలో ఇప్పుడు చూద్దాం.. హైదరాబాద్ మటన్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
కావలసిన పదార్థాలు :
ఒక్క ఆఫ్ కేజీ బాస్మతి రైస్, శుభ్రంగా కడిగి అరగంటసేపు నానబెట్టాలి. మటన్ కేజీ, ఆఫ్ కేజీ సన్నగా తరిగిన ఉల్లిపాయలు, బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేగించాలి. నూనె పావు కేజీ, పెరుగు ఆఫ్ కేజీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు, కారం మూడు టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, పసుపు ఒక స్పూను, ధనియాల పొడి ఒక స్పూను, మూడు నిమ్మకాయ రసం తీసుకోవాలి. పచ్చిమిర్చి మెత్తగా గ్రైండ్ చేసి నాలుగు టేబుల్ స్పూన్ తీసుకోవాలి. గరం మసాలా ఒక టేబుల్ స్పూన్, కొత్తిమీర, పుదీనా కట్ చేసి తీసుకోవాలి.. బిర్యానీ ఆకులు, దాసించక్క ఒక ఇంచు, లవంగాలు మూడు, యాలకులు రెండు, సాజీర ఒక స్పూను తీసుకోవాలి..

తయారీ విధానం ఇలా :
పెద్ద గిన్నెలో మటన్, పచ్చిమిర్చి పేస్ట్, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు పసుపు, గరం మసాల పొడి, కారం, ఫ్రై చేసిన ఉల్లిపాయలు , కొంచెం కొత్తిమీర, పుదీనా, సగం పెరుగు వేసి బాగా కలపాలి.. కొంచెం నూనె వేయాలి. కొద్దిసేపు నానబెట్టాలి. ఇప్పుడు ఒక బౌల్లో నీళ్లు తీసుకొని వేడి అయిన తర్వాత బిరియాని దినుసులు వెయ్యాలి. కొద్దిగా ఉప్పు వేసి, బాస్మతి రైస్ వెయ్యాలి. ఒక స్పూన్ నూనె వేయాలి. రైస్ సగం ఉడికించి తర్వాత నీళ్లన్నీ పోయేలా వడకట్టాలి. మటన్ గిన్నెలో రైస్ వేసి పైన నూనె వెయ్యాలి. పుదీనా, కొత్తిమీర, ఫ్రై చేసిన ఉల్లిపాయలు వేసి ఇప్పుడు దమ్ పెట్టాలి. స్టవ్ పై 45 నిమిషాలు ఉడికించాలి.
రైస్ మాడిపోకుండా రొట్టెల పెనం పెట్టి దాని మీద ఈ గిన్నె పెట్టాలి. అప్పుడు రైస్ మాడకుండా ఉంటుంది. ప్లేటుపై బరువైన వస్తువు పెట్టాలి. పొగ బయటకి పోకుండా.. 45 నిమిషాలు తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. పది నిమిషాల తర్వాత ప్లేట్ ప్లేట్ తీయాలి. అంతే హైదరాబాద్ మటన్ దమ్ బిర్యాని రెడీ.. ఎంతో రుచికరంగా ఉంటుంది.
చట్నీ తయారీ కోసం..
పెరుగులో ఉప్పు, ఒక కీర దోసకాయ సన్నగా తరగాలి.. ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి అందులో కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఐదు నిమిషాలు బాగా కలపాలి. అంతే పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోనట్టే..
Read Also : Natu Kodi Pulusu Recipe : నాటుకోడి పులుసును ఇలా వండి చూడండి.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఓసారి ట్రై చేయండి..!