Pesala Kura Recipe : పచ్చ పెసలతో కమ్మనైన కూర, రైస్, చపాతీలో తిన్నారంటే టేస్ట్ అదిరిపోద్ది..!

Pesala Kura Recipe : పచ్చ పెసలతో ఇలా కూర ఎప్పుడైనా చేశారా? పూరి, చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది. మంచి హెల్తీ కూడా. పెసలు తినని వాళ్లకు ఒక్కసారి ఇలా కూర చేసి పెడితే చక్కగా తినేస్తారు. పెసలతో కూర ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.. పచ్చ పెసలను ఒక టీ గ్లాస్ తీసుకొని రాత్రి మొత్తం నానబెట్టండి. నానబెట్టుకున్న ఈ పెసల్లో ఉన్న నీళ్ళని పారబోసేసి మరో 2 సార్లు శుభ్రంగా వేరే నీళ్లతోటి కడగాలి. కడిగేసిన తర్వాత ఇలా ఒక కుక్కర్ తీసుకొని ఈ పెసలు మొత్తాన్ని కుక్కర్లో వేసుకోండి. ఇప్పుడు, మీరు ఏ గ్లాస్‌తో పెసలు తీసుకుంటారో అదే గ్లాస్‌తో కొలుచుకొని 3  గ్లాసులు నీళ్లు పోసుకోండి. ఈ టీ గ్లాస్‌తో ఒక గ్లాసు పెసలు తీసుకున్నాను.

Pesala Kura Recipe in Telugu
Pesala Kura Recipe in telugu

అదే గ్లాస్ తోటి 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు కూడా పోసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి కుక్కర్‌కి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టుకోవాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి పప్పు బాగా ఉడికింది లేదో చూడాలి. పప్పు మెత్తగా  ఉడికిన తర్వాత ఎనపొద్దు. లేదంటే.. ముద్దగా అయిపోయి టేస్ట్ అంతా బాగుండదు. బాగా కలిపేసి గంట పెట్టేసుకోండి. పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్ని కలిపి వేసుకోవాలి.

ఈ ఆవాలనేవి చిటపటలాడిందాక వేగనివ్వాలి. ఆవాలు వేగిన తర్వాత 5 వెల్లుల్లి రెమ్మలు కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. ఒక 2 ఎండు మిరపకాయలు కూడా తుంచుకొని వేసుకోవాలి. 5 పచ్చిమిరపకాయలను కూడా పొడవుగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పోపు దినుసులు వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారేంతవరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కాస్త కలర్ మారేంతవరకు వేగిన తర్వాత మీడియం సైజు 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటా ముక్కలు మెత్తబడేంతవరకు వేయించాలి. ఇందులో ఒక టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి వేయించుకోవాలి.

Pesala Kura Recipe : పచ్చ పెసలతో రెసిపీ ఇలా చేశారంటే.. 

టమాట ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోవాలి. టమాటా ముక్కలు బాగా వేగిన తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ పెసరపప్పు మొత్తాన్ని వేసుకొని ఒకసారి కలపుకోవాలి. హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. గ్రేవీ కాస్త పల్చగా ఉంటేనే ఉడికేటప్పటికీ చిక్కబడుతుంది. లేదంటే మరీ గట్టిగా అయిపోతుంది.

నీళ్లు పోసుకుని కలుపుకొని ఈ ఫ్యాన్‌కి మూత పెట్టేసి ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడకనివ్వండి. 3 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీయాలి. ఎక్కువ సేపు ఉడికితే నీళ్లు మొత్తం ఇంకిపోయి గట్టిగా ముద్దలాగా అయిపోతుంది. కర్రీ కాస్త పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. అప్పుడే చిక్కటి గ్రేవీ వచ్చేస్తుంది. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలిపేసుకుంటే చాలు.. పచ్చ పెసలతో కమ్మనైన పప్పు కూర కర్రీ రెడీ.. చపాతీలో లేదా పూరిలో కలిపి తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది.

Read Also : Multigrain Dosa : సిరిధాన్యాలతో బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండా మల్టీ గ్రైన్ ప్రోటీన్ దోస.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..!

Leave a Comment