Perugu Vada Recipe : ఇంట్లో ఇలా పెరుగు వడలు చేస్తే ఎంతో ఇష్టంగా తినేస్తారు… పెరుగు వడలు బ్రేక్ ఫాస్ట్ కైనా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చాలా ఈజీగా చాలా సులభంగా కమ్మగా తినవచ్చు. సమ్మర్ లో బ్రేక్ ఫాస్ట్ గా చెయ్యవచ్చు పిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా ఇష్టపడతారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పెరుగు వడ రుచిగా సాఫ్టుగా పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం…
పెరుగు వడలు కావలసిన పదార్థాలు..
మినప గుండ్లు-ఒక కప్పు,ఉప్పు,పెరుగు-నాలుగు కప్పులు, పచ్చిశనగపప్పు-ఒక టీ స్పూన్, మినపపప్పు-ఒక టీ స్పూన్, జీలకర్ర-ఒక టీ స్పూన్, ఆవాలు-ఒక టీ స్పూన్, పచ్చిమిర్చి-నాలుగు,అల్లం ముక్కలు- ఒక టీ స్పూన్, ఎండుమిర్చి -మూడు,ఇంగువ పొడి-పావు టీ స్పూన్, కరివేపాకు-రెండు రెమ్మల, కొత్తిమీర, పసుపు, నూనె..

పెరుగు వడలు తయారీ విధానం..
ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు మినప గుండ్లు రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. పప్పులో నీళ్లు పోసి 5,6 గంటలు నానబెట్టుకోవాలి. మినప్పప్పు నానిన తర్వాత మిక్సీ జార్ లో వేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు పిండిని ఒక బౌల్లోకి తీసుకొని రుచికి తగినంత ఉప్పు వేసి రెండు లేదా మూడు నిమిషాలు బాగా కలపాలి. పిండి ప్లంబిగా వరకు కలుపుకోవాలి.. ఒక బౌల్ లో కొన్ని వాటర్ తీసుకుని పిండిని కొంచెం వేస్తే పైకి తేలుతుంది. అలా వచ్చేవరకు కలుపుకోవాలి. ఇప్పుడు పెరుగు చట్నీ కోసం ఒక బౌల్లో నాలుగు కప్పుల పెరుగు వేసుకోవాలి. పెరుగులో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసి చిక్కటి మజ్జిగ లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు పోపు..
స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టీ స్పూన్ మినపపప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ఆవాలు దోరగా వేయించుకోవాలి సన్నగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఒక టీ స్పూన్, మూడు ఎండుమిర్చి వేగిన తర్వాత పావు టీ స్పూన్ ఇంగువ పొడి, రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత చివరగా చిటికెడు పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి..
పోపు చల్లారిన తర్వాత పెరుగు లోకి తీసుకోవాలి సన్నగా కట్ చేసిన కొత్తిమీర రెండు స్పూన్లు వేసుకొని బాగా కలపాలి. అంతే పెరుగు చట్నీ రెడీ.. ఇప్పుడు వడలు తయారు చేయడానికి ఆన్ చేసి ఒక కళాయి పెట్టి డీప్ ఫ్రై సరిపోయేంత నూనె వెయ్యాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసిన పిండిని చేతులు తడి చేసుకుంటూ పిండిని రౌండ్ వడల్లా అనుకోని నూనె లో వేయాలి మీడియం ఫ్లేమ్ లో ఉంచి వడలు బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో మూడు గ్లాసుల నీళ్లు, కొంచెం ఉప్పు వేసి కలపాలి వడలను వేడిగా ఉన్నప్పుడే సాల్ట్ వాటర్ లో వేసి రెండు నిమిషాలు ఉంచాలి. ఇలా చేయడం వల్ల సాఫ్ట్ గా క్రిస్పీగా ఉంటాయి నీళ్లలో వేసిన వడలను తీసి పెరుగు చట్నీలో వేసుకోవాలి.. అంతే ఎంతో రుచికరమైన పెరుగు వడలు రెడీ..