Nellore Chepala Pulusu : చేపలను తినే అలవాటు ఉందా? అయితే వారంలో కనీసం రెండు సార్లు అయినా చేపలను ఆహారంగా చేర్చుకోండి. ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు చేపల కూర పులుసు అద్భుతమైన రుచి కలిగి ఉంటుంది. చేపలలో శరీరానికి మేలు చేసే అనేక విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. చేపలలో ఒమేగా 3 అనే పోషకాలు ఉంటాయి. తద్వారా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. చేపలను ఇష్టంగా తినేవారిలో గుండెసంబంధిత అనారోగ్య సమస్యలు రావు. చేపలు అనగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది చేపల పులుసు.. చేపల పులుసు అందరూ చేస్తారు. అందులో చేపల పులుసును రుచిగా చేయడం కూడా తెలిసి ఉండాలి. చేపల కూర రుచిగా చేయాలంటే కొన్ని పదార్థాలు కావాలి. ఆయా పదార్థాలను తగినంతగా చేర్చడం ద్వారా అద్భుతమైన రుచిగా చేపల పులుసును తయారు చేసుకోవచ్చు.
చేపలు పులుసు కావలసిన పదార్థాలు.. చేప ముక్కలను నిమ్మకాయ, ఉప్పు, నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి.. చేపలు రెండు కేజీలు, టమాట, ఉల్లిపాయ మసాలా, తీసుకొని గ్రైండ్ చేయాలి. మూడు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు టేబుల్ స్పూన్ పసుపు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి, కారం 6 టేబుల్ స్పూన్, రుచికి సరిపడంత ఉప్పు, నూనె 300 గ్రామ్స్, సన్నగా కట్ చేసిన ఒక మామిడికాయ, చింతపండు 100 గ్రాములు, కరేపాకు రెమ్మ, నాలుగు పచ్చిమిర్చి, కట్ చేసిన కొత్తిమీర ఒక కట్ట, పండు టమాటాలు 3 తీసుకొని కలపాలి, మెంతు పొడి ఒక టేబుల్ స్పూన్,
నెల్లూరు చేపల పులుసు తయారీ విధానం.. ముందుగా ఒక వెడల్పు గిన్నె తీసుకొని అందులో ఉల్లిపాయ టమాటా పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, మామిడికాయ ముక్కలు, కరివేపాకు, టమాటా గుజ్జు, నూనె, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. ఇప్పుడు చింతపండు గుజ్జును పోయాలి. ఆ తర్వాత చేప ముక్కలను వెయ్యాలి ఇప్పుడు గ్యాస్ మీద పెట్టాలి. చేపల పులుసును పది నుంచి 15 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత మెంతి పొడి వేయాలి. వన్ అవర్ ఉడికించాలి. అంతే ఎంతో రుచికరమైన నెల్లూరు చేపల పులుసు రెడీ.. అన్నంలో, రాగిసంకటి తో తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు..