Fish Curry Recipe : చేపలను తినే అలవాటు ఉందా? అయితే వారంలో కనీసం రెండు సార్లు అయినా చేపలను ఆహారంగా చేర్చుకోండి. ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు చేపల కూర పులుసు అద్భుతమైన రుచి కలిగి ఉంటుంది. చేపలలో శరీరానికి మేలు చేసే అనేక విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. చేపలలో ఒమేగా 3 అనే పోషకాలు ఉంటాయి. తద్వారా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. చేపలను ఇష్టంగా తినేవారిలో గుండెసంబంధిత అనారోగ్య సమస్యలు రావు. చేపలు అనగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది చేపల పులుసు.. చేపల పులుసు అందరూ చేస్తారు. అందులో చేపల పులుసును రుచిగా చేయడం కూడా తెలిసి ఉండాలి. చేపల కూర రుచిగా చేయాలంటే కొన్ని పదార్థాలు కావాలి. ఆయా పదార్థాలను తగినంతగా చేర్చడం ద్వారా అద్భుతమైన రుచిగా చేపల పులుసును తయారు చేసుకోవచ్చు.
చేపల పులుసు తయారీ పదార్థాలు ఇవే :
కిలో చేపలు, పది గ్రామలు చింతపడు, 5 టీ స్పూన్ల నూనె, అర టీ స్పూన్ జీలకర్ర, రెండు ఉల్లిపాయలను కచ్చా పచ్చగా దంచుకోవాలి, ఐదు పచ్చిమిర్చి తరగాలి, టీ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ కారం, ఉప్పు, అర టీ స్పూన్ మెంతి పొడి, టీ స్పూన్ జీలకర్ర పొడి, రెండు టీ స్పూన్ల ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా పొడి, కొత్తిమీర తీసుకోవాలి.
చేపల పులుసు తయారీ ఇలా :
గట్టి చేపలను తీసుకోండి. చేపను మీడియం ముక్కలుగా కోయాలి. ఆ తరువాత చేప ముక్కలను బాగా కడగాలి. చేప ముక్కలకు నిమ్మరసం, టీ స్పూన్ ఉప్పు కలపాలి. కొద్దిగా నీళ్లు పోసి చేప ముక్కలను 10 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు చేప ముక్కలను నీళ్లు లేకుండా తీసేయాలి. కళాయిలో నూనెను వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్రను వేయించాలి. వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ కూడా అందులోనే వేయించాలి. అల్లం పేస్ట్‌ను పచ్చి వాసన పోయేంతవరకు వేయించాలి. పసుపు, కారం కూడా వేయాలి. నిమిషం వరకు వేయించాలి. చేప ముక్కలను వేయించాలి. బాగా వేయించిన తర్వాత చింతపండు పులుసు కలుపుకోవాలి.
చింతపండు పులుసుకు తగినంతగా నీళ్లు కలపాలి. పులుసు పొంగు వచ్చేంత వరకు మరిగించాలి. జీలకర్ర పొడి, మెంతి పొడి, ధనియాల పొడి, ఉప్పు కూడా కలపాలి. కొద్ది నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా గరం మసాలా పొడి వేయాలి. చివరిగా కొత్తిమీరను చల్లాలి. అంతే. రుచికరమైన చేపల పులుసు రెడీ అయినట్టే.. చేపల పులుసు వేడిగా ఉన్నప్పుడు కన్నా చల్లగా ఉన్నప్పుడే చాలా రుచిగా ఉంటుంది. ఎంతో రుచికరమైన ఈ చేపల పులుసును వదిలిపెట్టకుండా తినేస్తారు.
Read Also : Ullipaya Bondalu : పిండి నానబెట్టకుండానే.. కొద్ది నిమిషాల్లోనే ఉల్లిపాయ బొండాలను వేసుకోవచ్చు..!