Mutton keema Roast : మటన్ కీమా రోస్ట్.. మటన్ కీమా వేపుడు తయారీ విధానం ఎంతో ఈజీగా రుచికరంగా సింపుల్ గా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. మనకు కావలసిన విధంగా ఫ్రై చేసుకోవచ్చు. వేడి వేడి అన్నం, చపాతీ పరోటా జొన్న రొట్టె రాగిసంకటి తో కలుపుకొని తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది.
కావలసిన పదార్థాలు.. మటన్ 1కేజీ, టమాటాలు 2, పచ్చిమిర్చి, ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 11/2టేబుల్ స్పూన్స్, కరివేపాకు 2 రెమ్మలు, స్ప్రింగ్ ఆనియన్స్ 1/2 కట్ట, చిన్న మెంతికూర 1 కట్ట, పసుపు 2 టీ స్పూన్, కారం 3 టేబుల్ స్పూన్, ఉప్పు (రుచికి తగినంత) నూనె, ధనియాల జీలకర్ర పొడి1 టీ స్పూన్, గరం మసాల పొడి 1 టీ స్పూన్,
తయారీ విధానం.. ముందుగా మటన్ శుభ్రంగా కడుక్కున్న ఒక బౌల్లో మటన్ కీమా తీసుకొని అందులో మీడియం సైజ్ రెండు టమాట కట్ చేసి వెయ్యాలి ఆ తర్వాత ఒక టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం,ఉప్పు వేసుకొని ఇవన్నీ కీమాకి పట్టేలా బాగా కలుపుకోవాలి. వీటిని కుక్కర్ లో వేసుకొని స్టవ్ వెలిగించి 7 నుండి 8 విజిల్స్ వచ్చేవరకు మటన్ లో ఉన్న వాటర్ తోటే ఉడుకుతుంది.
![Mutton Keema Roast : రెస్టారెంట్ స్టయిల్లో మటన్ కీమా రోస్ట్... మటన్ కీమా వేపుడు.. సూపర్ టేస్టీగా ఉంటుంది.. కొంచెం కూడా మిగల్చరు..! Mutton keema Roast in telugu](https://mearogyam.com/wp-content/uploads/2023/04/Mutton-keema-Roast-in-telugu-1.jpg)
Mutton Keema Roast : మటన్ కీమా రోస్ట్ టేస్టీగా రావాలంటే..
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి నూనె వేడి అయిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్, చిన్న మెంతికూర, కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ఉప్పు, ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
ఇప్పుడు ఉడికిన మటన్ కీమా కుక్కర్ విజిల్ తీసి అందులో ఉన్న వాటర్ తో సహా వేసుకోవాలి. ఉడికించిన మటన్ కీమా ఉండలుగా ఉంటుంది కాబట్టి పప్పు గుత్తితో మ్యాక్స్ చేయాలి. ఆ తర్వాత హై ఫ్లేమ్ లో ఉంచి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి, పుదీనా ఆకులు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు కారం ఉందో లేదో చూసుకొని కొంచెం యాడ్ చేసుకోండి. ఐదు నిమిషాలు తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఒక నిమ్మకాయ రసం వేసి కలపాలి అంతే ఎంతో రుచికరమైన మటన్ కీమా రెడీ…