Mutton Recipes : మటన్ ఆరోగ్యానికి కూడా చాలామంచిది అంటారు.. మటన్ లో శరీరానికి అవసరమయ్యే చాలా పోషక విలువలు ఉంటాయి. మటన్ లోఐరన్, మినరల్స్, ప్రోటీన్ విలువలు కలిగి ఉంటుంది. ప్లాట్ తక్కువగా ఉంటుంది. ఇది మంచి పౌష్టిక ఆహారం.. నొప్పుల సమస్యలతో బాధపడేవాళ్లు మటన్ ఎక్కువగా తీసుకుంటే తొందరగా ఉపశమనం పొందుతారట.. ఇంతకీ మటన్ కూర ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
కావలసిన పదార్థాలు.. మటన్ 1/2కేజీ, ఆయిల్ 4 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 1, యాలకులు 2, దాల్చిన చెక్క 2 ఇంచుల, సాజీర 1/2 టీ స్పూన్ ,వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చిమిర్చి 4, పసుపు 1/2 టీ స్పూన్, కారం 3 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్.

మటన్ కూర తయారీ విధానం… ముందుగా స్టవ్ వెలిగించి మందంగా ఉన్న కళాయి తీసుకోవాలి దానిలో నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, సాజీర, వేసి బాగా కలపాలి. వెల్లుల్లి రెబ్బలు, నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేయించాలి. ఇప్పుడు సన్నగా తరిమిన ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు మటన్ వేసి బాగా కలపాలి. రుచికి సరిపడా ఉప్పు వేసితర్వాత పసుపు వేసి బాగా కలపాలి స్టవ్ ను ఫ్లేమ్ మీడియం ఉంచి 15 నిమిషాలు ఉడికించాలి. మూత పెట్టుకోవాలి మటన్ లో ఉన్న నీళ్ల పోయేంతవరకు ఉడికించాలి. కర్రీపై నూనె తేలేంతవరకు ఉడికించాలి.
ఇప్పుడు కారం వేసితర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. మటన్ మగ్గేంతవరకు బాగా వేయించుకోవాలి. ఒక నిమిషం తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి మటన్ మెత్తగా ఉడకడానికి 20 నిమిషాలు ఉడికించాలి. మటన్ కూర అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అందులో గరం మసాలా వేసితర్వాత సన్నగా తరిమిన కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్… వేడివేడి అన్నంలో కానీ, ఏదైరా రోటీలో కలుపుకుని తింటే రుచి అదిరిపోతుంది. మీరూ కూడా ఈ విలేజ్ స్టయిల్ మటన్ కూర ఓసారి ట్రై చేయండి.. అంతే ఎంతో రుచికరమైన మటన్ కూర రెడీ…