Hyderabadi Chicken Korma : హైదారాబాద్ చికెన్ కుర్మా ఎప్పుడైనా తిన్నారా? అయితే ఈసారి తప్పకుండా తిని చూడండి.. ఆ తర్వాత మీరే వావ్ ఎంత టేస్టీ అంటారు. అంత రుచిగా ఉంటుంది. సాధారణంగా రెస్టారెంట్లలో మాత్రమే దొరికే హైదరాబాద్ చికెన్ కుర్మాను ఇంట్లో కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు చేయాల్సిందిల్లా.. ఎలా తయారు చేయాలో తెలిస్తే చాలు.. రెస్టారెంట్ స్టయిల్‌లో అంత రుచి రావడానికి అందులో వాడే ఇంగ్రేడియంట్స్ ఏంటి? వాటిని ఎలా తయారుచేసుకోవాలి? చికెన్ కుర్మా తయారీలో ఎలా వాడాలి ఇప్పుడు తెలుసుకుందాం..
హైదరాబాద్ చికెన్ కుర్మా తయారీకి కావలసిన పదార్థాలు..
చికెన్ ఒక కిలో మీడియం సైజ్ ముక్కలు తీసుకోవాలి, పావు కిలో ఆలుగడ్డ, కట్ చేసి వాటర్ లో వేసి పెట్టుకోవాలి, ఒక ఎండు కొబ్బరి కాల్చిన కట్ చేసిన ముక్కలు తీసుకోవాలి,100 గ్రాముల పల్లీలు ఎంచుకోవాలి ,100 గ్రాముల నువ్వులు ఎంచుకోవాలి, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, ఒక కప్పు పెరుగు, ఒక కట్ట కొత్తిమీర, పుదీనా కట్ చేసి తీసుకోవాలి, 5 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకోవాలి, ఒక నిమ్మకాయ రసం తీసుకోవాలి, మూడు టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఆప్ స్పూన్ పసుపు, ఆప్ టేబుల్ స్పూన్ గరం మసాలా, రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 150 గ్రాముల నూనె.. పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి మిక్సీలో ఆఫ్ క్లాస్ వాటర్ పోసి గ్రైండ్ చేయాలి..
తయారీ విధానం.. :
స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని ఆలు ముక్కల్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఆలుగడ్డ ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే వద్దు.. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి గ్రైండ్ చేసిన పేస్ట్ ను వేయాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. పచ్చివాసన పోయేంతవరకు స్లో మీడియంలో స్టౌ పై పది నిమిషాలు ఉంచాలి నూనె పైకి తేలిన తర్వాత చికెన్ వేసి బాగా మసాలా అంతా పట్టే వరకు కలపాలి.
చికెన్ లోని వాటర్ వస్తుంది కాబట్టి పది నిమిషాలు చికెన్ ఉడికిన మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. తర్వాత పెరుగు వెయ్యాలి బాగా కలిపి రెండు నిమిషాలు ఉడికించాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి ట్రై చేసిన ఆలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు పది నిమిషాలు ఉడికిన తర్వాత అందులో పచ్చిమిర్చి , కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, నిమ్మరసం వేసి కలిపిన తర్వాత పది నిమిషాలు ఉడికించాలి. అంతే వేడి వేడి చికెన్ కూర్మా రెడీ… చికెన్ కూర్మా వేడి వేడి బగారా రైస్, పలావ్, అన్నంలో, చపాతీలో పుల్కా రోటి, చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి…