Mulakkada jeedipappu curry : ములక్కాయ జీడిపప్పు కూర చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ కర్రీ మనకు అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది చేసుకోవటం కూడా చాలా ఈజీ ముందుగా కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు రెండు నుంచి ఎండు కొబ్బరి ముక్కలు రెండు యాలుకలు ఒక ఇంచ్ దాల్చిన చెక్క మూడు లవంగాలు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో దోరగా ఫ్రై చేసుకోవాలి. దినుసులన్నీ ఈ విధంగా దోరగా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్ లోకి వేసుకోవాలి దినుసులన్నీ వేసుకున్నాక అర టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో పావు గ్లాస్ నీళ్లు పోసుకుని మెత్తటి పేస్ట్ లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ ను ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ ను ఒక బౌల్ లోకి తీసుకొని ఇదే మిక్సీ జార్ లో రెండు మీడియం సైజ్ టమాటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసి మెత్తటి ప్యూరీలా మిక్సీ వేసుకోవాలి. టమాటా ప్యూరిని ఈ విధంగా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి
ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో కలర్ మారేంతవరకు ఫ్రై చేసుకోవాలి . జీడిపప్పు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు వేగిన తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో రెండు ములక్కాయలను కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి.

ఇప్పుడు టేస్ట్ కు తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ ములక్కాయను మగ్గనివ్వాలి ములక్కాయ ఈ విధంగా మగ్గిన తర్వాత అందులో ముందుగా మిక్సీ వేసుకున్న టమాటో ప్యూరీ అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు , ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఆయిల్ అంతా సైడ్స్ కి వచ్చేంత వరకు కలుపుకోవాలి ఆయిల్ ఎంత ఈ విధంగా సైట్స్ కి వచ్చినప్పుడు ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని మరో రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత మసాలా అంతా మనకు ఈ విధంగా వేగిపోతుంది
ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు ఒక గ్లాసు నీళ్లు రెండు మూడు రెబ్బల చింతపండును రసం తీసుకుని వేసుకోవాలి ఇప్పుడు కర్రీని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి 15 నిమిషాల తర్వాత కర్రీ మనకు ఈ విధంగా ఉడికిపోతుంది . ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కర్రీని మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి ఒక నిమిషం తర్వాత జీడిపప్పు ములక్కాయ కర్రీ ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీ తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ జీడిపప్పు కూర రెడీ.





