Mango Pesara Pappu : మామిడికాయ- పచ్చి కొబ్బెరతో పెసరపప్పు.. ఈ కూర తినే వాళ్ళు వావ్ అనాల్సిందే.. పెసరపప్పుతో మామిడికాయ ఒకసారి చేసి చూడండి ఆహా ఓహో అంటారు. పెసరపప్పు ఒంటికి చాలా చలువ.. పెసరపప్పులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. వేడివేడి అన్నం పెసరపప్పు దీని కాంబినేషన్ గా ఆమ్లెట్ వేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది. సూపర్ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం…
కావలసిన పదార్థాలు : పెసరపప్పు-100 grams , పచ్చి కొబ్బెర తురుము – , మామిడికాయ ముక్క ఒక కప్పు , పచ్చిమిర్చి, కరివేపాకు రెమ్మలు, నూనె, పసుపు టీ స్పూన్, ఉప్పు( రుచికి తగినంత) జిలకర టీ స్పూన్, ఆవాలు టీ స్పూన్, ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు,
తయారీ విధానం.. ముందుగా ఒక కప్పు పెసరపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి పుల్లటి మామిడికాయ ముక్కలు, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. ఆఫ్ గ్లాస్ వాటర్ పోసి తర్వాత నాలుగు పచ్చిమిర్చి వేసి గా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
![Mango Pesara Pappu : మామిడికాయ పచ్చి కొబ్బెరతో పెసరపప్పు రెసిపీ.. ఇలా చేశారంటే మిగల్చకుండా తినేస్తారు.. చాలా టేస్టీగా ఉంటుంది! Mamidikaya Pesarapappu Recipe in telugu](https://mearogyam.com/wp-content/uploads/2023/04/Mango-Pesure-Pappu-1.jpg)
మరోవైపు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని నానబెట్టిన పెసరపప్పు పావు లీటర్ నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టుకొని నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో సగం చిప్ప పచ్చి కొబ్బరి ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి, కొత్తిమీర కాడలు, కరివేపాకు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
మూకుడు పెట్టుకొని ఒక టీ స్పూన్ పల్లీల నూనె, ఒక టీ స్పూన్ నెయ్యి వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర చిటపట అన్న తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్క, సన్నగా కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు, ఐదు లవంగాలు, ఎండుమిర్చి నాలుగు, పావు టీ స్పూన్ మెంతుపొడి, పావు టీ స్పూన్ ఇంగువ, రెమ్మల కరివేపాకు కొంచెం కస్తూరి మేతి వేసి కలపాలి.
ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ను వేసి పచ్చివాసన పోయేంతవరకు కలపాలి ఉడికించిన మామిడి ముక్కలు, ఉడికించిన పెసరపప్పు వేసి పప్పులోకి తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి (పెసరపప్పు తొందరగా చిక్కబడుతుంది) రుచికి తగినంత కారం ఉప్పు ఉడికించాలి కొంచెం కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎంతో రుచికరమైన మామిడికాయ కొబ్బరి పెసరపప్పు రెడీ..