Mamidikaya Drumstick Egg Curry : పచ్చి మామిడికాయ, కోడిగుడ్డు, ములక్కాయ కూర (Egg Drumstick curry) ఎప్పుడైనా తిన్నారా? మామిడికాయ (Raw Mango Curry) ములక్కాయతో (Drumstick) ఎన్నో రకరకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం. అయితే, ఒకసారి కోడిగుడ్డుతో కాంబినేషన్ చేసి చూడండి.. చాలా టేస్టీగా ఉంటుంది. సాధారణంగా తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు ఈ రెసిపీ.. ఒక్కసారి చేస్తే ఈ కూరను మళ్లీ మళ్లీ చేయాలి అనుకుంటారు. ఈ కూర పుల్లపుల్లగా తీయతీయగా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..
కావలసిన పదార్థాలు.. మామిడికాయ-, ములక్కాడ-, కోడిగుడ్లు-3, ఉల్లిపాయ-1, పచ్చిమిర్చి-1, నూనె, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్-1 టేబుల్ స్పూన్, కరివేపాకు ఒకరెమ్మ, (జిలకర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు) పోపు గింజలు1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1టీ స్పూన్, ఎండుమిర్చి-2,
తయారీ విధానం.. ముందుగా మూడు కోడిగుడ్లు ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు ములక్కాడను ముక్కలుగా కట్ చేసి ఆ తర్వాత బంగినపల్లి మామిడికాయ తీసుకొని పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడి అయిన తర్వాత పోపు గింజలు, జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి మగ్గనివ్వాలి.
Mamidikaya Drumstick Egg Curry : ములక్కాడ పచ్చి మామిడికాయ కోడిగుడ్డు కూర..

తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి ఒక టీ స్పూన్ పసుపు వేసి ఉడికించిన కోడిగుడ్లను మధ్య మధ్యలో గాట్లు పెట్టి ఆ తాలింపులో వేసి వేయించుకోవాలి. తర్వాత ములక్కాడ వేసి మూత పెట్టి కలర్ మారేంతవరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు (Munagakaya mamidikaya curry) వేసి కలపాలి. ఈ ముక్కలు మగ్గిన తర్వాత రుచికి తగినంత కారం ఉప్పు వేసి కలపాలి
మీడియం ఫ్లేమ్ లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ నూనె పైకి తేలిన తర్వాత ఒక గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి కూర చిక్కటి గ్రేవీ వచ్చి నూనె పైకి తేలేంతవరకు ఉడికించాలి. టేస్ట్ కోసం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలపాలి. సన్నగా తరిమిన కొత్తిమీర పుదీనా కూర పై చల్లి కలిపి ఒక్క నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. కోడిగుడ్డులోకి ఉప్పు కారం పులుపు పోయి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎంతో రుచికరమైన మామిడికాయ గుడ్డు ములక్కాయ కూర రెడీ…