Kuska Biryani Recipe : ఈ వీకెండు మీరు కొత్తగా టేస్టీగా బిర్యానీ తినాలనుకుంటే ఈ ఎగ్ కుస్కా ఒక్కసారి ట్రై చేయండి. ఎగ్ బిర్యానీ ఇది చేసుకోవడం చాలా ఈజీ ఇంట్లో ఉన్న వాటితోటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ బిరియాని (రైతాకు), పెరుగు చెట్ని లేదా ప్లేన్ గా కూడా తినవచ్చు. గోంగూర, మసాలా వంకాయ, చికెన్, మటన్, వీటితో సూపరగా ఉంటుంది. బిర్యానీ ప్లేట్ లో పెట్టుకొని కొంచెం నిమ్మరసం చల్లుకొని ఉల్లిపాయ ముక్కలు తో కలిపి తిని చూడండి ఎంతో అద్భుతంగా ఉంటుంది.
కావలసిన పదార్థాలు…. బాస్మతి బియ్యం -1/2 కేజీ, నెయ్యి-2 టేబుల్ స్పూన్, కోడిగుడ్లు-6, బిర్యానీ ఆకు-2, లవంగాలు-4, దాల్చిన చెక్క-2 ఇంచులు, యాలకులు-2, జాపత్రి, సాజీర-1 టీ స్పూన్, నూనె, ఉల్లిపాయ-3, టమాట-3, పచ్చిమిర్చి-4, కొత్తిమీర( గుప్పెడంత), పుదీనా( గుప్పెడంత), అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు-13, గరం మసాలా పొడి-1 టీ స్పూన్, ధనియాల పొడి -1 టీ స్పూన్, పెరుగు -3 టేబుల్ స్పూన్, ఉప్పు, కారం…
తయారీ విధానం…. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంటసేపు నానబెట్టుకోవాలి. (బియ్యం నానడం వలన రైసు పొడిపొడిగా వస్తుంది). మీడియం సైజు ఉల్లిపాయలను, టమాటాలను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుష్క బిరియాని కి ఒక మసాలాను పేస్టు తయారు చేయాలి. ఆ పేస్టు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.. ముందుగా స్టవ్ వెలిగించి ఒక మూకుడు పెట్టుకొని మసాలా కోసం రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడి అయిన తర్వాత దాల్చిన చెక్క ఒక ఇంచు, కొంచెం జాపత్రి, నాలుగు లవంగాలు, రెండు అంగుళాల అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు 12 లేదా 13 పొట్టు తీసి వేసుకోవాలి వీటన్నిటిని లో ఫ్లేమ్ లో పెట్టి కలర్ మారేంతవరకు వేయించుకోవాలి. ఆ తర్వాత నాలుగు పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా మగ్గిన తర్వాత
సగం ఉల్లిపాయ ముక్కలు లైట్ గా కలర్ మారేంతవరకు వేయించుకోవాలి. (ఉల్లిపాయ ముక్కలు మాడకుండా చూసుకోండి)! తర్వాత సగం టమాట ముక్కలు ఒక టీ స్పూన్ ఉప్పు వేసి మెత్తగా బేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వీటన్నిటిని తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి. (మసాలా పేస్ట్ లో నీళ్లు పోయకూడదు)..ఈ మసాలా పేస్ట్ వల్ల బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని టేబుల్ స్పూన్లు నూనె వేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వెయ్యాలి నెయ్యి కరిగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ సాజీర, బిర్యానీ ఆకులు, లైట్ గా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి.

ఆ తర్వాత ముందుగా తయారు చేసిన మసాలా పేస్ట్ వేసి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి అడుగు మాడకుండా పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంతవరకు కలుపుతూ వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యేంతవరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి లో ఫ్లేమ్ లో ఉంచి ఈ పొడిలు మాడకుండా బాగా కలిసి పోయేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు నాన పెట్టుకున్న రైస్ వేసి ఒక గ్లాస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ చొప్పున నీళ్లు పోసుకోవాలి అంటే మూడు గ్లాసులు వేసుకొని ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసి కలపాలి. ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి.
ఈలోపు కోడిగుడ్లు వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడైన తర్వాత పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ మిరియాల పొడి లైట్ గా వేగిన తర్వాత ఆరు ఉడకబెట్టిన కోడిగుడ్లు గాట్లు పెట్టి వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత మూడు పచ్చిమిరపకాయలు నిలువ కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని కోడిగుడ్లకు అన్ని ఫ్లేవర్స్ పట్టి తినేటప్పుడు చాలా రుచికరంగా ఉంటాయి.
కోడిగుడ్లు లైట్ కలర్ మారేంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లి కలపాలి స్టవ్ ఆఫ్ చేసి గుడ్లను పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల రైస్ కూడా ఉడికింది. రెండు విజిల్స్ వచ్చి కుక్కరు ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి బిర్యానీ నెమ్మదిగా కలపాలి. ఆ తర్వాత బిర్యానీ పై వేయించిన కోడిగుడ్లను వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర చల్లి కుక్కర్ మూత పెట్టి మూడు లేదా నాలుగు నిమిషాల కుక్కర్ మూత తీస్తే రైస్ అనేది పొడిపొడిగా చాలా బాగా వస్తుంది. అలాగే గుడ్ల లో ఉన్న మసాలా రైస్ కు పట్టి టేస్ట్ బాగుంటుంది. ఎంతో రుచికరమైన బిర్యానీ రెడీ…