kothimeera pachadi : రుబ్బే పనిలేకుండా ఎంతోఈజీగా లంచ్ బాక్స్/ బ్రేక్ ఫాస్ట్ తో తినడానికి సంవత్సరం ఉండే……..

kothimeera pachadi :  .ఇప్పుడు దీన్ని వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ పచ్చడిని  గ్రైండ్ చేయకుండా చేస్తాం కాబట్టి చాలా చాలా సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత దీన్ని పొడి బట్ట మీద వేసి ఏడు ఎనిమిది గంటల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి.

రాత్రిపూట ఆరబెట్టి మర్నాటి ఉదయం  ఆరిన తర్వాత వీటిలో పెద్దపెద్ద ఆకులు, కాడలు ఉన్నట్లయితే మరోసారి సన్నగా కట్  ఆరిన ఈ ఆకు   కప్పుతో కొలత తీసుకోవాలి.  నాలుగు కప్పులు  తర్వాత స్టవ్ మీద కడాయిలో రెండు స్పూన్లు వేరుసెనగ నూనె వేసి సన్నగా కట్ చేసుకున్న ఈ ఆరిన కొత్తిమీరని వేసి మంట లో ఫ్లేమ్ లో ఉంచి కలుపుతూ వేయించాలి. అయితే అంత ఒకేసారి వేస్తే సరిగా వేగదు కాబట్టి కొంచెం కొంచెంగా వేయించుకోవాలి ఇది వేయించేటప్పుడు మాడిపోకుండా అలాగే పచ్చితనం కూడా లేకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి తర్వాత స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకుని పావు స్పూన్ మెంతులు వేసి ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత రెండు స్పూన్లు ఆవాలు వేసి ఒకసారి కలిపి ఇవి 90% వేగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ మిగిలిన 10% కడాయిలో ఉండే వేడికి వెళ్ళిపోతాయి అయితే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మాడిపోకుండా మరి కొంచెం సేపు కలుపుతూ ఉండాలి.

kothimeera pachadi
kothimeera pachadi

పూర్తిగా చల్లారని వీటిని చాలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి . ఇప్పుడు చింతపండు 50 గ్రాముల వరకు తీసుకోవాలి అంటే మనం కొత్తిమీర కొలిచిన కప్పుతో అరకప్పు వరకు ఉంటుంది దీన్ని నీళ్లలో ఒకసారి బాగా కడిగి నీళ్లు పోసి బాగా నాన్నని ఇవ్వాలి చక్కగా నానని దీన్ని బాగా పిసికి రసం తీసుకుని కడాయిలో వేసుకోవాలి. అయితే ఇది మరీ గట్టిగా కాకుండా చక్కగా ఉడికేలా సరిపడినన్ని నీళ్లు పోసి గుచ్చు కాస్త పల్చగా ఉండేలా తీసుకోవాలి. మంట లో ఫ్లేమ్ లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఇది చిక్కబడే వరకు ఉడికించాలి దగ్గర పడిన తర్వాత అర స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి దీని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ గుజ్జు మరీ గట్టిగా ఉన్నట్లయితే పచ్చడి కూడా గట్టిగా ఉండి అన్నంలో కలుపుకోవడానికి బాగుండదు అలాగే ఇది మరీ జారిపోయిన గాని పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో వేయించి పెట్టుకున్న కొత్తిమీర అంతా వేసుకోవాలి అయితే పచ్చడి కొంచెం మెత్తగా ఉంటే ఇష్టపడే వాళ్ళు ఈ వేయించి పెట్టుకున్న కొత్తిమీరని పల్సిస్తూ కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో పావుకప్పు వరకు ఉప్పు వేసుకుంటే సరిగ్గా సరిపోతుంది మీరు మాత్రం ఒకేసారి వేసేయకుండా కొంచెం తగ్గించి వేసుకొని తర్వాత కావాలంటే కలుపుకోవచ్చు.

తర్వాత తినే కారాన్ని బట్టి అరకప్పు వరకు పచ్చడి కరం వేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు పొడి 1/4 కప్పు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి కూడా వేసి అన్ని బాగా కలపాలి ఇప్పుడు ఉడికించి చల్లారబెట్టుకున్న చింతపండును కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలాంటి పచ్చడలో ఏది తక్కువైనా గానీ తర్వాత కలుపుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు కాస్త తగ్గించి వేసుకొని పచ్చడి ఒకరోజు ఊరిన తర్వాత మీరు రుచికి తగ్గట్టు ఏది కావాలంటే వాటిని మళ్లీ కలుపుకోవచ్చు తర్వాత తాలింపు కోసం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకుని పావు కప్పు వరకు వేరుసెనగ నూనె వేసి కాగిన తర్వాత రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు, రెండు స్పూన్ల మినప్పప్పు రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి వేగిన తర్వాత దీన్ని కొంచెం చల్లా తాలింపు ఇదంతా చక్కగా కలిపి గ్లాస్చర్ లో కానీ జాడీలో గాని పెట్టి ఒకరోజు ఊరిన తర్వాత వేడి వేడి అన్నంతో కానీ టిఫిన్స్ తో గాని సర్వ్ చేసుకోవడమే క్లాస్ లేదా ప్లాస్టిక్ జార్లో వేసి ఫ్రిజ్లో స్టోర్ చేసుకున్నట్లయితే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది బయట అయితే మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది కానీ ఉప్పు నూనె తక్కువ కాకుండా సరిపడినంత వేసుకోవాలి. ఈజీగా చేసుకోగలిగే ఈ టేస్టీ పచ్చడి..

Read Also :  Munagaku Kobbari Pachadi : మునగాకు కొబ్బరి పచ్చడి.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినేస్తారు.. అంత టేస్టీగా ఉంటుంది.. కంటిచూపుకు మంచిది!

Leave a Comment