Kobbari Mamidikaya Pachadi : కొబ్బరితో మామిడికాయ రోటి పచ్చడి ఎప్పుడైనా తిన్నారా? కోనసీమ పచ్చి మామిడికాయలతో కొబ్బరికాయ ముక్కలను కలిపి రోటి పచ్చడి చేస్తారు. పచ్చి మామిడికాయకు కొబ్బరి ముక్కుల తురుమును కలిపి రోటిలో దంచితే భలే ఉంటుంది. ఆ రోటి పచ్చడిని తింటుంటే నోరూరిపోవాల్సిందే.. కొబ్బరి, మామిడికాయ రోటి పచ్చడిని వేడివేడి అన్నంలో గానీ, ఇడ్లీ, దోశ, ఊతప్ప, గారెలు, వడలు, ఎలాంటి అల్పాహారంలోనైనా వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ తినాలనిపించేలా ఉంటుంది. ఇంతకీ ఈ రోటి పచ్చడిని ఎలా తయారుచేయాలో ఇప్పుడు చూద్దాం..
కావలసిన పదార్థాలు.. పచ్చి కొబ్బెర- 2, మామిడి- 1, ఎండు మిర్చి , పచ్చిమిర్చి , ఇంగువ , జీలకర్ర 1టీ స్పూన్, మినప్పప్పు 1టీ స్పూన్ ఆవాలు 1టీ స్పూన్
ముందుగా రెండు కొబ్బరి కాయలు తీసుకొని పగలగొట్టి చిన్న చిన్న కొబ్బరిను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక మామిడికాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇంగువ కొంచెం వేసి ఎండుమిర్చి వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో కొంచెం నూనె వేసి పచ్చిమిర్చి కారానికి తగినంత వేయించుకోవాలి.

పచ్చళ్ళకి పోపు.. ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మెంతులు, హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు, రెండు ఎండుమిర్చి వేగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి. వేయించుకున్న ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి మిక్సీ గ్రైండ్ పట్టాలి. ఇప్పుడు అందులో పచ్చి కొబ్బరి ముక్కలు, మామిడి ముక్కలు వేసి కొన్ని నీళ్లు పోసుకుంటూ గ్రైండ్ చేయాలి. మనం ముందుగా పోపు వేసిన దాంట్లో వేసి కలపాలి. ఈ పచ్చడను రోట్లో చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎంతో రుచికరమైన కొబ్బరితో మామిడికాయ కలిపిన పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుంది.