Khara Boondi Recipe : కరకరలాడే బూందిని ఎప్పుడైనా తిన్నారా? నోరూరించే కారం బూందిని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ ఇష్టంగా తినవచ్చు. కారం బూందిని ఇలా చేస్తే మాత్రం.. తినడానికి ఎంతో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. కారం బూందిని ఇప్పుడు తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయిలో డీప్ ఫ్రై కి సరిపోయేంత నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఆఫ్ కేజీ పచ్చిశనగ పిండి జల్లించి తీసుకొని బియ్యం పిండి రెండు టేబుల్ స్పూన్, ఇప్పుడు పిండి లో కొంచెం కొంచెం వాటర్ పోస్తూ ఉండల్లేకుండా కలుపుకోవాలి. మనం శనగపిండిలో బియ్యప్పిండి యాడ్ చేసాం కనుక బూంది కరకరలాడుతుంది నూనె పీల్చుకోకుండా ఉంటుంది. అందుకే బియ్యప్పిండి ని యాడ్ చేస్తారు..

ఇప్పుడు వేడి చేసుకున్న నూనెలో బూందీ గరిట పిండి పోసుకుంటూ బూంది చేసుకోవాలి.. సగం అయిన బూంది తీసి పక్కన పెట్టుకోవాలి పిండి మొత్తం బూందీల తయారైన తర్వాత తీసి పెట్టుకున్న బూందీని మొత్తం వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. ఇలా రెండుసార్లు బూందీ వేయించడం వల్ల క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు అదే కళాయిలో ఒక కప్పు శనగలు, గుప్పెడు కరివేపాకు వేసి వేయించుకొని బూందీ లో వేయాలి ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచాలి వెల్లుల్లిపాయ ఒకటి, రుచికి తగినంత ఉప్పు,కారం వీటన్నిటిని వేసుకొని బూంది ని బాగా కలపాలి.. వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి అప్పుడు పచ్చి వాసన రాదు.. అంతే ఎంతో రుచికరమైన కారం బూంది రెడీ…