Jonna Pindi Vada : జొన్న పిండితో ఆరోగ్యకరమైన జొన్న వడలు చేసుకోవచ్చు. మిల్లెట్ ఆరోగ్యానికి చాలా మంచిది. జొన్నపిండితో అనేక రకాల పిండి వంటలను తయారుచేసుకోవచ్చు. ఇలా చేశారంటే మాత్రం చాలా టేస్టీగా వస్తాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా నోరూరించే ఈ జొన్న పిండితో వడలను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. ఇప్పుడే ట్రై చేయండి..
కావలసిన పదార్థాలు.. జొన్న పిండి 1కప్పు, నూనె, ఉల్లికాడ 1/2కప్పు , ఉల్లిపాయ 2, కరివేపాకు 2 రెమ్మ, నూనె, ఉప్పు , అల్లం వెల్లుల్లి పేస్ట్ 1టీ స్పూన్, జిలకర 1 టీ స్పూన్, గరం మసాలా 1/2టీ స్పూన్, కారం 1/2టీ స్పూన్, పసుపు1/2 టీ స్పూన్, పచ్చి శనగ పప్పు లేదా స్వీట్ కార్న్ 1/2కప్పు
తయారీ విధానం.. ఒక బౌల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన ఉల్లికాడలు లేకపోతే స్కిప్ చేయండి. సన్నగా కట్ చేసిన కరివేపాకు ,కట్ చేసిన పచ్చిమిర్చి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారంపొడి, రుచికి తగినంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా ఈ మిశ్రమంలో తడి వచ్చేలా బాగా కలుపుకోవాలి.

హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, శనగపప్పు లేదా స్వీట్ కార్న్, తీసుకోవచ్చు అరకప్పు ముందుగా అరగంటసేపు నానబెట్టు పప్పును అందులో వేసి కలపాలి. ఆ తర్వాత ఒక కప్పు జొన్న పిండి వేసి ఒక స్పూన్ ఆయిల్ వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి. కొన్ని కొన్ని వాటర్ పోస్తూ పిండిని చేతిలో తీసుకొని వడల వస్తుందా లేదా చూసుకొని కలుపుకోవాలి.
స్టెప్ వెలిగించి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపోయేంత ఆయిల్ పోసి ఆయిల్ వేడి అయిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకొని అరచేతుల్లో ఒత్తుకుంటూ వడల్లా వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి వేసుకోవాలి.. జొన్న పిండి కాబట్టి ఫ్రై అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. జొన్న వడలు రెండువైపులా కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన మసాలా జొన్న వడలు రెడీ…
Read Also : Jonna Ambali : జొన్న అంబలి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో తెలుసా? ఎలాంటి రోగాలైనా దరిచేరవు..!