Sambar Premix Powder : పప్పు ఉడకబెట్టే పని లేకుండా చింతపండు అవసరం లేకుండా 5 నిమిషాలలో కమ్మనైన సాంబార్ కాంబినేషన్ వేడి వేడి అన్నం, ఇడ్లీ, దోశ చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్ సాంబారు పొడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
కావలసిన పదార్థాలు… కందిపప్పు- 1 కప్పు, పెసరపప్పు -1/2కప్పు, పచ్చిశనగపప్పు- 1/3 కప్పు, మినప్పప్పు- 1/2 కప్పు, బియ్యం-1/2 కప్పు, ఎండుమిర్చి-30(1 కప్పు), ధనియాలు- 1 కప్పు, మిరియాలు -1 స్పూన్, మెంతులు -1 స్పూన్, జిలకర_1 స్పూన్, కరివేపాకు- 1 కప్పు, చింతపండు-1 కప్పు, కొబ్బెర పొడి-1 కప్పు, ఇంగువ-1 స్పూన్, దాల్చిన చెక్క లవంగాలు పొడి-1 టేబుల్ స్పూన్, ఉప్పు-11/2 స్పూన్…
సాంబారు పొడి తయారీ విధానం… ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి లో ఫ్లేమ్ లో ఉంచి ఒక కప్పు కందిపప్పును వేసుకొని దోరగా వేయించుకోవాలి ఆ తర్వాత పెసరపప్పు హాఫ్ కప్పు, బియ్యం హాఫ్ కప్పు వేసి కలర్ మారేంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిశనగపప్పు ముప్పావు కప్పు వేసుకొని మంచి సువాసన వచ్చేంతవరకు వేయించుకోవాలి. మినప్పప్పు హాఫ్ కప్పు వేసి లైట్ గా కలర్ మారేంతవరకు వేయించుకొని (పప్పులన్నీ వేయించుకోవడం వల్ల సాంబారు చిక్కగా వస్తుంది).. పప్పులు అన్నిటిని చల్లారే ఇంతవరకు పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక కప్పు ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ మెంతులు, ఒక స్పూన్ మిరియాలు లైట్ గా కలర్ మారేంతవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మిరపకాయలు ఒక కప్పు( మీరు తినే కారాన్ని బట్టి..) దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు కరివేపాకు తీసుకొని తుంచితే తునిగేంతవరకు వేయించుకోవాలి ( సాంబార్ పొడిని నిల్వ ఉంటుంది కాబట్టి ఇలా చేసుకోవాలి). రెండు గంటల తర్వాత అన్ని బాగా చల్లారిన తర్వాత.. ఇప్పుడు మిక్సీ జార్ లో పప్పులన్నీ వేసి బాగా మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మసాలా దినుసులు, ఒక టేబుల్ స్పూన్ లవంగాలు దాల్చిన చెక్క పొడి ఒక టీ స్పూన్, ఇంగువ ,ఒక కప్పు చింతపండు, ఒక కప్పు కొబ్బరి పొడి, ఒకటిన్న టీ స్పూన్ ఉప్పు కూడా వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక టీ స్పూన్ పంచదార లేదా కొంచెం బెల్లం వేసుకుంటే సాంబార్ టేస్టీగా ఉంటుంది. మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ( ఉప్పును ఎక్కువగా వేసుకోకూడదు ఎందుకంటే సాంబార్లో వేసుకుంటాం కాబట్టి) సాంబార్ మసాలా పొడి చల్లారిన తర్వాత పప్పుల పొడి బాగా కలిపి ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. (సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది) ఇలా పొడిని తయారు చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు ఇన్స్టెంట్ సాంబార్ తయారు చేసుకోవచ్చు…

Sambar Premix Powder : ఇన్‌స్టంట్ సాంబారు పొడి సాంబారు తయారీ విధానం :
ఎంతో తో ఈజీగా ఇన్స్టెంట్ ఇప్పుడు సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం… ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గ్లాస్ నీళ్లు పోసి ములక్కాడలను కుక్కర్లో వేసి కొంచెం ఉప్పు ఒక విజిల్ వచ్చేంతవరకు ఉడికించాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో మీడియం సైజ్ టమాటాలు మూడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనె వేడి అయిన తర్వాత ఒక టీ స్పూన్ పోపు గింజలు, మూడు ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి.
ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు వేసి కలపాలి. ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసిన టమాటా పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్ లో ఉంచి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇన్స్టెంట్ సాంబార్ పొడి ఒక కప్పు బాగా కలపాలి. ఒక నిమిషం తర్వాత కొద్దికొద్దిగా వాటర్ ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ములక్కాయలు వేసి ఆ తర్వాత ఎంత క్వాలిటీ లో సాంబార్ చేస్తారో అన్ని వాటర్ వేసుకొని ఐదు నిమిషాలు బాగా ఉడికించాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి
ఇన్స్టెంట్ సాంబార్ పొడి లోకి రకరకాల కూరగాయ ముక్కలు సొరకాయ, దోసకాయ, క్యారెట్, టమాట, ములక్కాడ.. కుక్కర్లో ఒక విజిల్స్ వచ్చేవరకు ఉడికించి. లేదా పోపులో వేసి బాగా కూరగాయ ముక్కలు మగ్గిన తర్వాత ఇన్స్టెంట్ సాంబార్ పొడి వేసుకొని చేస్తే రుచికరంగా ఎంతో టేస్టీగా ఉంటుంది…