Idli Premix Telugu : ఇడ్లీ పౌడర్ చేసుకుని.. పప్పు నానబెట్టి రుబ్బే పని లేకుండా చాలా సింపుల్ మెత్తటి ఇడ్లీలు చేసేకోవచ్చు. దూది లాంటి ఇడ్లీ మెత్తగా సాఫ్ట్‌గా ఉండాలి అనుకుంటే.. ఈ ఇడ్లీ రీమిక్స్ ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే చాలు.. మెత్తటి దూదిలాంటి ఇడ్లీలు చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఇడ్లీ రీమిక్స్ పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. ఇడ్లీ రవ్వ ఒక గ్లాస్ తీసుకోవాలి. మినప పప్పు హాఫ్ గ్లాస్ తీసుకోవాలి. 1/2 గ్లాసు లావు అటుకులు తీసుకోండి. సన్నగా ఇడ్లీ రవ్వ తీసుకోండి. సన్నగా ఇడ్లీ రవ్వ అయితే మెత్తగా దూదుల్లాగా ఇడ్లీలు వస్తాయి.
మినప గుండ్లు దొరుకుతాయి. మినప పప్పు కూడా క్వాలిటీ పప్పు తీసుకోవాలి. అప్పుడే ఇడ్లీలు మెత్తగా వస్తాయి. లావు అటుకులు లేదా దొడ్డు అటుకులు తీసుకోవాలి. రవ్వని కొలుచుకున్న గ్లాస్ తోటే మినప పప్పు, అటుకులు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పొడి చేసుకోవాలి. స్టవ్‌పై పాన్ వేడిక్కిన తర్వాత ఒక్క 2 నిమిషాలు ఇడ్లీ పొడిని దోరగా వేయించుకోవాలి. ఈ మినప పప్పు అనేవి కాస్త వేడెక్కితే సరిపోతుంది. ఈ మినపప్పుతో పాటు కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి. రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది.

మరి ఎక్కువ వేగనివ్వకూడదు. కొద్దిగా వేగిన తర్వాత అన్నింటిని ఏదైనా ప్లేట్లోకి తీసుకొని ఆరనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత జల్లెడ పట్టుకోవాలి. మెత్తటి పౌడర్ మాత్రమే తీసుకోండి. ఈ పౌడర్ తీసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఇదే మిక్సీ జార్‌లో అటుకులను కూడా వేసుకొని మరీ మెత్తటి పౌడర్ లాగా కాకుండా రవ్వ లాగా మిక్సీలో పట్టండి. ఇడ్లీ రవ్వలా చేసుకోవాలి. మరీ మెత్తటి పౌడర్ అవసరం లేదు. ఈ అటుకుల పొడిని ఒక బౌల్ లోకి వేసుకోండి.
ముందుగా జల్లించి పెట్టుకున్న మినప పిండిని కూడా వేసుకోవాలి. ముందుగా తీసి పెట్టుకున్న గ్లాసు ఇడ్లీ రవ్వని కూడా వేసుకొని 1 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం ఈ పిండి బాగా కలిసి పోయేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండితో ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూద్దాం.. ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ ఇడ్లీ పిండిని పోసుకోవాలి. మీకు ఎన్ని ఇడ్లీ కావాలి అనేది చూసుకొని ఇడ్లీ పిండి తీసుకోవాలి.
Idli Premix Telugu : మొత్తగా ఇడ్లీలు రావాలంటే ఇలా చేయండి..
ఇప్పుడు ఈ పిండిలో ఒక గ్లాస్ పిండికి వన్ అండ్ ఆఫ్ గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత పిండి మొత్తం బాగా కలిసేటట్టు ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక నైట్ మొత్తం పులియ పెట్టుకొని ఇడ్లీలు చేసుకోవాలి. అప్పటికప్పుడు ఇడ్లీలు కావాలి అనుకుంటే.. ఒక కప్పు ఇడ్లీ పొడికి హాఫ్ కప్పు పులిసిన పెరుగు వేసుకోవాలి. ఒక కప్పు నీళ్లు పోసుకుని బాగా కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా వంట సోడా వేసుకుంటే ఇడ్లీలు మెత్తగా వస్తాయి.
మామూలుగా పులియ బెట్టిన పిండితో చేసుకుంటే ఇడ్లీలు చాలా టేస్ట్ ఉంటాయి. ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత బౌల్ మూత పెట్టేసి నైట్ మొత్తం పులియబెట్టుకోవాలి. పిండి బాగా పులిస్తే ఇడ్లీలు చాలా మెత్తగా సాఫ్ట్‌గా వస్తాయి. పిండి పులియకపోతే ఇడ్లీ రుచి ఉండదు. పిండిలో ఉప్పు సరిపోకపోతే చూసుకొని ఉప్పు వేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత మీకు ఎన్ని ఇడ్లీ కావాలో చూసుకొని ఇడ్లీ ప్లేట్లలో పిండిని వేసుకోవాలి.
ఇడ్లీ ప్లాట్ ఇడ్లీ పాత్రలో పెట్టుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించండి. అంతకంటే ఎక్కువ సమయం ఉడికించవద్దు. ఎక్కువ సేపు ఉడికిస్తే ఇడ్లీలు గట్టి పడిపోతాయి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇడ్లీలను బయటకు తీయండి. పప్పు నానబెట్టి రుబ్బే పని లేకుండా ఇడ్లీ పొడి చేసి పెట్టుకుంటే.. ఇడ్లీలు చాలా టేస్టీగా, మెత్తగా దూదిలా వస్తాయి. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ఇడ్లీలను తయారుచేసుకోండి.
Read Also : Egg Bajji Recipe : బండి మీద దొరికే ఎగ్ బజ్జి ఇంట్లోనే ఇలా చేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు..!