Garlic Chutney Recipe : పచ్చడి అనగానే చాలామంది చాలా ఇష్టంగా తింటుంటారు. అందులోనూ రోటి పచ్చడి అంటే ఆ టేస్టే వేరబ్బా.. అనేక పచ్చళ్లలో ఉల్లి వెల్లుల్లితో చేసే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఉల్లి, వెల్లులి చట్నీ ఎప్పుడైనా తిన్నారా? ఇలా చేశారంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి.
కావలసిన పదార్థాలు : వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ 3, పచ్చిమిర్చి(10,12), ధనియాలు 2 స్పూన్, పచ్చిపప్పు 11/2 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, మినప గుళ్ళు 11/2స్పూన్లు, పల్లీలు 1 స్పూన్, అల్లం, ఉప్పు, ఎండుమిర్చి, చింతపండు,కొత్తిమీర, కరివేపాకు..
తయారీ విధానం : ముందుగా ఈ చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. ఇందులో ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త వేడి అయిన తర్వాత ఒకటన్న స్పూన్ దాకా ధనియాలు ఒక 2 స్పూన్ల దాకా మినప గుళ్ళు , ఒకటి అర స్పూన్ దాకా పచ్చిపప్పు వేసుకోవాలి. ఇదంతా ఆయిల్ లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి. ఇలా పప్పులు, ధనియాలు అన్ని ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక 10 నుంచి 12 దాకా పచ్చిమిర్చి తీసుకోవాలి. ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని కట్ చేసుకోవాలి. వీటన్నింటినీ ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్‌గా అయ్యేంతవరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.
ఇలా, ఉల్లిపాయ ముక్కలు కాస్త సాఫ్ట్‌గా అయిపోయి పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో పొట్టు వలుచుకున్న వెల్లుల్లి ఒక పాయ వెల్లుల్లి తీసుకొని ఇందులో వేసుకోండి. చిన్న చిన్న పాయలు తీసుకున్నట్లయితే రెండు పాయలు వేసుకోండి. వెల్లుల్లిపాయలు ఇంకా కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. రెండు కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకునే పనిలేదు. ఇలా కాస్త సాఫ్ట్‌గా అయ్యి మెత్తగా అయితే సరిపోతుంది. ఇప్పుడు, స్టవ్ ఆఫ్ చేసి ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారినంత వరకు చల్లార్చుకుని చింతపండు కూడా ఇందులోనే వేసుకోవాలి.

ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయాక.. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 4 స్పూన్ల దాకా ముందుగానే వేయించుకున్న పల్లీలు, ఒక స్పూన్ జీలకర్ర, చింతపండును మిక్సీ జార్‌లో వేసుకోవాలి. మీరు కావాలంటే ముక్కలు ఫ్రై చేసుకునేటప్పుడు అందులో అయినా పెట్టేసుకోవచ్చు. ఇక వీటన్నింటిని ఫైన్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా చింతపండును కూడా మిక్సీ జార్‌లో వేశాం. కాబట్టి మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. ఆ తర్వాత వీటిలో ముందుగా మనం చల్లార్చుకుని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వీటన్నింటిని ఇందులో వేసుకొని వీటిని కూడా గ్రైండ్ చేసుకోండి. కాస్త పలుకుగా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ మాత్రం వేయకండి. ఇలా నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసుకున్నాను.
Garlic Chutney Recipe : ఉల్లి వెల్లుల్లితో టేస్టీ చట్నీ…
ఇందులో ఇంతవరకు మనం ఉప్పు వేసుకోలేదు. ఇప్పుడు పచ్చడి మొత్తం సరిపడా రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకోండి. పచ్చడి అయితే, ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాను. ఇక ఉప్పు వేసుకొని సరిపడినంత మరలా ఒక్కసారి కాస్త పైన్‌గా అయ్యేంతవరకు గ్రైండ్ చేసుకొని తీసుకున్నారంటే ఉల్లి చట్నీ రెడీ అయిపోతుంది. ఇందులో అల్లం వెయ్యలేదు. అల్లం వేసే పడలేదు. వెల్లుల్లి ఫ్లేవర్ ఉల్లి ఫ్లేవర్ బాగా తెలియాలంటే అల్లం వెయ్యకుండా ఇలా రుబ్బుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీ సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఈ చట్నీకి పోపు పెట్టుకోవాలి. పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఇందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను.
ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఎండు మిరపకాయలు ఆవాలు, జీలకర్ర పప్పులు వేసుకొని పోపు కాస్త క్రిస్పీగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి. మీకు ఇష్టమైతే పోపులో కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసి చిటపటలాడిన తర్వాత ఈ పోపుని రెడీ చేసుకున్న పచ్చడిలో వేసుకోవాలి. పచ్చడి మొత్తం బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి. వేడి వేడి దోసలతో తీసుకున్న లేదా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ చట్నీతో కలుపుకొని ఒక్కొక్క ముద్ద తిన్న సరే అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. కోరన్నంగానే కాదు.. పెరుగులో కూడా నంచుకుని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ చట్నీ ఈజీగా చేసుకొని తినొచ్చు.