Fish Curry : చేపల కూర ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? తింంటుంటే చాలా టేస్టీగా ఉంటుంది.. చేపల కూరను చాలామంది రకరకాల పద్ధతుల్లో చేస్తుంటారు. టమాటా లేకుండా చేపల కూరను కమ్మటి రుచి కొంచెం కారంగా, పుల్లగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా తాజాగా కట్ చేసి క్లీన్ చేసుకున్న కిలో చాప ముక్కల్ని తీసుకోండి. చాప ముక్కల లోపల ఉండే నల్లటి పదార్థాన్ని తీసేయకుండా అలానే కడిగేస్తారు. అలా చేస్తే.. కూర నీచు వాసన వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో ఒక స్పూన్ ఉప్పు, రెండు స్పూన్ల కారం పావు స్పూన్ పసుపు వేసి ముక్కలకి బాగా పట్టించాలి. ఫిష్ లేదా చికెన్ అయినా మటన్ అయినా ఇలా ఉప్పు కారం పట్టించేటప్పుడు తడి లేకుండా వడకట్టుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. బాగా ముదిరి పాలు ఎక్కువ ఉండే కొబ్బరికాయను తీసుకోవాలి. కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక కప్పు వరకు మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత కొన్ని వేడి నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు గిన్నెలో ఫిల్టర్ పెట్టుకుని గట్టిగా ఒత్తాలి. అలా వచ్చిన పాలన్నీ పూర్తిగా వడకట్టి తీసుకోవాలి. ఆ తర్వాత పక్కన పెట్టుకొని పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని కడిగి వేడి నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మసాలా తయారీకి స్టవ్ మీద పాన్‌లో 10 నుంచి 15 వరకు మెంతి గింజలు వేసి కొంచెం వేగిన తర్వాత రెండు స్పూన్ల ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసి మంట లో ఫ్లేమ్ ఉంచి వేగనివ్వాలి. ఓవర్‌గా ఫ్రై చేసేయకుండా గ్రైండ్ చేసినప్పుడు ఈజీగా నలిగేలా వేస్తే సరిపోతుంది. పూర్తిగా చల్లారని మిక్సీ జార్‌లో వేసి అసలు పలుకులు లేకుండా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అయితే, ఇందులో ఉండే వాసన పోకుండా ఒక గిన్నెలో వేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఇదే చారులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసిన మొక్కలు ఒక అంగుళం అల్లాన్ని కట్ చేసిన మొక్కలు 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత స్టవ్ మీద కూర వండడానికి అనుకూలంగా ఉండే వెడల్పాటి కడాయి పెట్టుకుని 6 నుంచి 7 స్పూన్ల వేరుశనగ నూనె వేసి కాగిన తర్వాత పావు స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలిపి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి ఇందులో ఉండే పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేయించాలి. నాన్ వెజ్ కూరల్లో నూనె కాస్త ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. చక్కగా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 3 స్పూన్ల వరకు కారం, పావు స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి నానబెట్టుకున్న చింతపండుని పిసికి రసం తీసి వేసుకోవాలి.
Fish Curry : చేపలతో కూర వండితే.. ఇలానే వండాలి..
ఈ కూరలో కొబ్బరి పాలు పోయడం వల్ల చేపల కూర రంగు డార్క్ కలర్‌లో ఉంటుంది. అందుకే పాత చింతపండు వాడొద్దు. లేదంటే కూర కలర్ మారుతుంది. కొత్తది అయితే మంచి కలర్ వస్తుంది. ఇందులో కొబ్బరి పాలు కూడా పోసుకొని కావాల్సిన గ్రేవిని బట్టి నీళ్లు పోసుకోవాలి. చేప ముక్కల్లో నుంచి నీళ్లు వస్తాయి. ఆ పులుసు పల్చగా అయిపోకుండా జాగ్రత్తగా నీళ్ళు పోసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్ లో ఉంచి పులుసును ఉడకనివ్వాలి. ఇలా ఉడకడం స్టార్ట్ అవ్వగానే చాప ముక్కల్ని వేసి 6 నుంచి 7 పచ్చిమిర్చిలను కట్ చేసిన ముక్కలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసి ముక్కలు పులుసులో చక్కగా మునిగేలా కడాయిని గుండ్రంగా ఒకసారి తిప్పాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి పావుగంట పాటు మంటలు ఫ్లేమ్ లో ఉంచి ఉడకనివ్వాలి.
చేప ముక్కలు పులుసులో నెమ్మదిగా ఉడికిన తర్వాత మూత తీసి మసాలా పొడి అంతా వేయాలి. పులుసులో చక్కగా కలిసేలా కడాయిని గుండ్రంగా తిప్పాలి. టేస్ట్ చెక్ చేసుకుని అవసరమైతే ఉప్పు కారం లాంటివన్ని వేసుకోవచ్చు. మళ్ళీ మూత పెట్టి 10 నిమిషాల పాటు మంట లో ఫ్లేమ్ లోనే ఉంచి ఉడకనివ్వాలి. కూర బాగా ఉడికి ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే సర్వ్ చేయకుండా అలానే ఒక గంట పాటు ఉంచాలి. చేప ముక్క పులుసులో ఊరిన తర్వాత వేడి వేడి అన్నంతో వడ్డించుకోవడమే..