Chicken Tomato Curry : చికెన్ టమాటా కర్రీ.. ఇలా చేస్తే.. సూపర్ టేస్టీగా ఉంటుంది..

Chicken Tomato Curry :  చికెన్ టమాట కర్రీ ఎప్పుడైనా తిన్నారా? అయితే ఈసారి తప్పకుండా తిని చూడండి.. ఆ తర్వాత మీరే వావ్ ఎంత టేస్టీ అంటారు. అంత రుచిగా ఉంటుంది. చికెన్ టమాట కర్రీ ఇంట్లో కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు చేయాల్సిందిల్లా.. ఎలా తయారు చేయాలో తెలిస్తే చాలు.. రెస్టారెంట్ స్టయిల్‌లో అంత రుచి రావడానికి అందులో వాడే ఇంగ్రేడియంట్స్ ఏంటి? వాటిని ఎలా తయారుచేసుకోవాలి? చికెన్ టమాట కర్రీ తయారీలో ఎలా వాడాలి ఇప్పుడు తెలుసుకుందాం..

 చికెన్ టమాటా కర్రీ కి కావలసిన పదార్థాలు..
చికెన్ 2 కేజీలు, పెరుగు పావు కేజీ, టమాట వన్ కేజీ , సన్నగా తరిమిన ఉల్లిపాయలు రెండు, నూనె 200 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్టు నాలుగు టేబుల్ స్పూన్, పసుపు రెండు టేబుల్ స్పూన్, కారం 5 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్, గరం మసాలా ఒక టేబుల్ స్పూన్, చికెన్ మసాలా రెండు టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి ఆరు పొడవుగా కట్ చేసుకోవాలి, కొత్తిమీర ఒక కట్ట, ముందుగా ఒక బౌల్లో చికెన్ తీసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కారం, పెరుగు అన్ని వేసి బాగా కలుపుకోవాలి.. ఇప్పుడు మిక్సింగ్ చేసిన చికెన్ పది నిమిషాలు ఫ్రిజ్లో పెట్టుకోవాలి..

Chicken Tomato Curry in Telugu
Chicken Tomato Curry in Telugu

Chicken Tomato Curry : చికెన్ టమాట కర్రీ తయారీ విధానం…

స్టవ్ వెలిగించి ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి. నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో ఉన్న చికెన్ తీసి అందులో వేసి బాగా కలపాలి మూత పెట్టుకోవాలి చికెన్ లో ఉన్న నీళ్ల పోయేంతవరకు ఉడికించాలి.

పది నిమిషాల తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలు వేయాలి బాగా కలిపి మూత పెట్టి స్టవ్ ఫుల్ గా పెట్టుకొని పది నిమిషాలు ఉంచిన తర్వాత టమాటాలు ఉడికిన తర్వాత ఇప్పుడు కారం, ఉప్పు సరిపోయే లేవు చూసుకోవాలి ఏమన్నా తక్కువ అయితే ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా, చికెన్ మసాలా వేసి బాగా కలపాలి.

ఒక బౌల్లో ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని మరిగించాలి చికెన్ గ్రేవీ కోసం వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మూత పెట్టి స్టవ్ స్లోగా ఉంచి పది నిమిషాలు ఉడికించాలి.. అంతే ఎంతో రుచికరమైన చికెన్ టమాటా కూర రెడీ.. పలావ్, బజార్ అన్నం, బిర్యానీ, చపాతి, రోటి పుల్కా వాటితో తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. సూపర్ సూపర్ యమ్మీ యమ్మీ చికెన్ టమాటా కర్రీ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో రెడీ చేసుకోవచ్చు.

Read Also : Garlic Chicken Fry : గార్లిక్ చికెన్ ఫ్రై.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో గార్లిక్ చికెన్ టేస్టీగా రావాలంటే ఇలా చేయాల్సిందే..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Leave a Comment