Chicken Pickle Recipe : చికెన్ నిలవ పచ్చడి… ఆంధ్ర స్టైల్ చికెన్ పచ్చడి చాలా ఈజీ, సింపుల్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.. ఈ పచ్చడి కనీసం మూడు, నాలుగు నెలలు నిలవ ఉంటుంది. ఈ పచ్చడితో అన్నం తింటే కంచాలు కంచాలు లాగించేస్తారు అంత బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చికెన్ నిలవ పచ్చడిని చపాతీలో గానీ, పరోటా లేదా పూరిలో కలుపుకుని తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు.. వేడి వేడి అన్నంతో పాటు జొన్న రొట్టెలు, రాగి సంకటితో కలిపి ఈ చికెన్ పచ్చడిని తిన్నారంటే ఆహా ఏమి రుచి అనకుండా ఉండలేరు..
కావలసిన పదార్థాలు… చికెన్ 1 కేజీ, అల్లం వెల్లుల్లి పేస్టు 60 గ్రాములు, నూనె ఆఫ్ కేజీ, కారం 50గ్రాములు, ఉప్పు 50గ్రాములు, మెంతుపొడి 1టేబుల్ స్పూన్, పసుపు 1టేబుల్ స్పూన్, ధనియాల పొడి, నిమ్మరసం 1/3 కప్పు
తయారీ విధానం... ముందుగా శుభ్రం చేసుకున్న ఒక కేజీ చికెన్ నాన్ స్టిక్ కళాయి పెట్టి చికెన్ వేసి ఒక టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఫ్లేమ్ లో ఉంచి చికెన్ లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. చికెన్ అడుగంటుతుంది నాన్ స్టిక్ కళాయి అయితే మంచిది. మరోవైపు మందంగా ఉన్న కళాయి పెట్టుకుని నూనె ఆఫ్ కేజీ డీప్ ఫ్రైకి సరిపోయేంత నూనె పోసి వేడి అయిన తర్వాత ఉడికించిన చికెన్ ముక్కలను నూనెలో వేసి ముక్కలు గలగల అని అంతవరకు ఫ్రై చేసుకోండి. చికెన్ ముక్కలు అస్సలు వాటర్ ఉండకూడదు.
క్రిస్పీగా ఉండాలి. ఆ తర్వాత బాగా ఫ్రై అయిన చికెన్ ముక్కలను పక్కన పెట్టుకోవాలి. అందులో అరకప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం పచ్చివాసన పోకపోతే పచ్చడి నిలవ ఉండదు రుచిగా ఉండదు.. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు అందులో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో ఉంచి చికెన్ ని ఫ్రై చేయాలి. ఒక టేబుల్ స్పూన్ మెంతుపొడి, ధనియాల పొడి ఆప్షనల్..రుచికి తగినంత ఉప్పు వేసి మూడు నిమిషాలు బాగా వేయించుకోవాలి. కనీసం 50 గ్రాములు ఉప్పు పడుతుంది.50 గ్రాముల కారం వేసి బాగా కలపాలి.
నూనె పైకి తేలినంతవరకు ఉడికించండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చికెన్ పూర్తిగా చల్లారిన తర్వాత ముప్పావు కప్పు నిమ్మరసం వేసి బాగా కలపాలి. కానీ ఒక గాజు సీసాలో నిలువ చేసుకోండి. ఈ పచ్చడి రెండు రోజుల తర్వాత చాలా రుచికరంగా ఉంటుంది. ఈ పచ్చడి తిన్న రోజున బాగా వేడి చేస్తుంది. కాబట్టి ఒక గ్లాసు మజ్జిగ తాగండి. హెల్దిగా ఉండండి.. అంతే అండి ఎంతో రుచికరమైన చికెన్ పచ్చడి రెడీ..