Chicken Sherva Recipe : చికెన్ రెసిపీస్… చికెన్ షేర్వాను కర్రీని దోశ, పరోట, పూరీ, వడ, చపాతి, గారెలు, ఇడ్లీలతో వేడివేడి అన్నం, బిర్యానీ, పులావ్, బగారా, జొన్న రొట్టెలు, రాగిసంకటితో కలుపుకొని తింటే చాలా టేస్టీగా, సూపర్‌గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈజీగా ఎలా తయారుచేయాలో చూద్దాం..
కావలసిన పదార్థాలు : చికెన్ ఆఫ్ కేజీ, పసుపు 1టీ స్పూన్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు 2టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి 1టీ స్పూన్, కొబ్బరి పొడి 2టేబుల్ స్పూన్స్, ఉల్లిపాయ 2, పచ్చిమిర్చి 3, టమాట1, దాచిన చెక్క 1ఇంచు, సాజీర హాఫ్ టీ స్పూన్, బిరియాని ఆకు1, లవంగాలు2, యాలకులు2, మిరియాలు హాఫ్ టీ స్పూన్,…

తయారీ విధానం.. ఒక బౌల్లో శుభ్రంగా కడిగిన చికెన్ తీసుకొని పసుపు ఒక టీ స్పూన్,కారం ఒక టీ స్పూన్, ఉప్పు ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసి బాగా కలపాలి. మూత పెట్టి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, మీడియం సైజు ఒక ఉల్లిపాయ, టమాట ముక్కలు వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ వెలిగించి కచ్చితంగా మందపాటి కళాయి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత సాజీర, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, కచ్చాపచ్చాగా దంచిన మిరియాలు వేసి వేగించాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి.

మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి గ్రైండ్ చేసిన టమాటా పేస్ట్, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయి నూనె పైకి తేలే అంతవరకు వేయించుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు,రుచికి తగినంత ఉప్పు ,కారం, వేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ చికెన్ మసాలా, ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని గ్రేవీ మాడకుండా కలుపుకోవాలి.
ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ను వేసి చికెన్ లో ఉన్న వాటర్ పోయి చికెన్ ఎర్రగా మగ్గే వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఇప్పుడు చికెన్ షేర్వ కాబట్టి వాటర్ ఎక్కువగా పడతాయి అయితే మూడు గ్లాస్ నీళ్లు పోసి కలపాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా ఒక రెమ్మ కరేపాకు వేసి మూత పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో ఉంచి నీళ్లు సగం ఇనికిపోయి వరకు ఉంచి..తర్వాత నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే ఎంతో రుచికరమైన చికెన్ షేర్వా రెడీ…