Chepala iguru Recipe : చేపలు పులుసు.. చాలామంది ఇష్టంగా తింటుంటారు. కానీ, చేపల పులుసు కొంచెం డిఫరెంట్‌గా చిక్కటి గ్రేవీతో కమ్మగా చేపల ఇగురు పెట్టుకోవచ్చు. ముందుగా కిలో ఫ్రెష్ చేపలని తీసుకోవాలి. నీట్‌గా క్లీన్ చేసి కడిగి పెట్టుకోవాలి. ఇందులో ఒక స్పూన్ ఉప్పు, పసుపు, రెండు స్పూన్ల కారం, ఒక స్పూన్ నూనె వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. చేప ముక్కల లోపల ఉండే నల్లటి పదార్థాన్ని తీసేసి నీటిగా క్లీన్ చేసుకోవాలి. లేదంటే కూర నీచు వాసన వస్తుంది. ఆ తర్వాత స్టవ్ మీద పాన్‌లో రెండు స్పూన్ల ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసి మంట లో ఫ్లేమ్‌లో ఉంచాలి. మిక్సీలో వేసి గ్రైండ్ చేసినప్పుడు ఈజీగా నలిగేలా కొద్దిసేపు వేయించుకోవాలి.
పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చాలా చిన్న అల్లం ముక్క 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు, 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ముక్కలుగా చేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయిలో స్కూల్లో నూనె కాగిన తర్వాత 15 వరకు మెంతి గింజలు కొద్దిగా కరివేపాకు, ఐదారు పచ్చిమిర్చి ముక్కలు వేసి చిటపటలాడిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి మంట లో ఫ్లేమ్‌లో ఉంచి కలుపుతూ వేయించాలి.

ఈ ఇగురు కూరలో మెంతుల మసాలా పొడిలో కాకుండా తాలింపులో మాత్రమే వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీలకు నూనె సరిపడినంత వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. తక్కువ కాకుండా నూనే కొంచె సరిపడా ఉండేలా చూసుకోవాలి. ఈ పేస్ట్‌లో పచ్చి వాసన పోయేలా కొద్దిసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత 2 పెద్ద సైజు టమాటాలని చాలా సన్నగా కట్ చేసిన ముక్కలను వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి టమాటాలు మెత్తగా మగ్గే వరకు మంటలు ఫ్లేమ్‌లో ఉంచి ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి ఒకసారి కలిపి 1/4 స్పూను పసుపు వేసుకోవాలి. కారాన్ని రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసిన మసాలా పొడి వేసి బాగా కలుపుకోవాలి.
Chepala iguru Recipe : చేపల ఇగురు పులుసు తయారీవిధానం..
ఇందులో గ్రేవీకి తగ్గట్టు పావు లీటర్ వరకు నీళ్లు పోసుకోవాలి. గ్రేవీని కొద్దిసేపు ఉడకనివ్వాలి. చేపల ముక్కల్లో నీళ్లు వస్తాయి. ఎక్కువ తక్కువ కాకుండా సరిపోయేంతగా గ్రేవీకి తగ్గట్టు నీళ్లు వేసుకోవాలి. గ్రేవీ ఉడకగానే.. మసాలా పట్టించిన చేప ముక్కల్ని వేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ముక్కలను జాగ్రత్తగా రెండోవైపు తిరగేయాలి. మళ్లీ మూత పెట్టి మరో 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చేపల కూర ఉడికించేటప్పుడు మధ్యలో కడాయిని గుండ్రంగా తిప్పుతూ ఉడికించుకోవాలి. నూనె పైకి తేలి కూర చక్కగా ఉడికించుకోవాలి. చివరిలో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసి వేడి వేడి అన్నంతో తింటే చాలా కమ్మగా ఉంటుంది. చేపల ఇగురు రెసిపీ రెడీ అయినట్టే..
Read Also : Chepala Pulusu : ఏ చేప అయినా సరే పులుసు అదిరిపోవాలంటే ఇలా చేసి చూడండి.. గిన్నె ఖాళీ చేసేస్తారు..!