Cauliflower Peas Masala Curry : మీ ఇంట్లో ఎప్పుడైనా క్యాలీఫ్లవర్ పచ్చిబఠాణీతో మసాలా కర్రీని చేశారా? లేకపోతే ఓసారి ట్రై చేయండి.. చాలా టేస్టుగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు. అసలు ఈ క్యాలీఫ్లవర్ బఠాణీతో మసాలా కర్రీని ఎలా రుచిగా వండుకోవాలో తెలుసా? అది ఇప్పుడు చూద్దాం.. ఈ కింది విధంగా ట్రై చేసి చూడండి.. మీ ఇంట్లో లొట్టలేసుకుంటూ తినేస్తారు..
అవసరమైన పదార్థాలు ఇవే :
ఉడికించిన క్యాలీప్లవర్, ఉడికించిన పచ్చి బఠాణీ – అర కప్పు, ఒక ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చి, రెండు టమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, తగినంత ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల నూనె, ఒక టేబుల్ స్పూన్ కారం, పసుపు అర టీ స్పీన్ తీసుకోవాలి, కొత్తిమీర, రెమ్మ కరివేపాకు కూడా వేయాలి. ఒక టేబుల్ స్పూన్ ధనియాలు పొడి, టేబుల్ స్పూన్ కసూరి మెంతి, యాలకులు,లవంగాలు రెండు, బిర్యానీ ఆకులు రెండు, గరం మసాలా అర టీ స్పూన్, జీలకర్ర పొడి, సాజీరా టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి మిక్సీలో వేసి మొత్తని పట్టుకోవాలి.. టమాటాలను కొన్ని నీళ్లు పోసుకుని మొత్తాన్ని పేస్టులా తయారు చేసుకోవాలి.

తయారీ విధానం ఇలా :
కళాయిలో నూనె వేసి వేడి చేసుకోవాలి మసాలా దినుసులు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగించాలి. అల్లం పేస్ట్ మెత్తగా నూరి పచ్చి వాసన లేకుండా వేయించుకోవాలి. మిక్సీలో కొత్తిమీర మెత్తగాపేస్ట్ చేసుకోవాలి. ఆ రెండింటిని నూనె పైకి వచ్చేంతగా దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత టమాట పేస్టు వేసి బాగా కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తర్వాత ఉడికించిన క్యాలీప్లవర్, బఠాణీ వేసి బాగా కలపాలి.
ఇప్పుడు ముప్పావు గ్లాస్ నీళ్లు పోసి కలపాలి . సన్నని మంటపై కాసేపు ఉడికించాలి.. కొద్దిసేపటి తర్వాత కసూరి మెంతి, గరం మసాలా, పచ్చిమిర్చి వేసి కలపాలి. రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. క్యాలీప్లవర్ బఠాణీ మసాలా కర్రీ రెడీ అయినట్టే.. వేడివేడిగా అన్నంలో,చపాతీ, రోటీ, పుల్కా ఈ కూరను కలిపి తింటుంటే ఎంతో రుచిగా నోరూరించేలా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ కూడా ఇంట్లోనే ఈ క్యాలీప్లవర్ బఠాణీ మసాలా కర్రీ నీ తయారుచేసుకోండి.