Brinjal Masala Recipe : వంకాయ.. ఈ పేరు వింటే చాలు.. ఎవరికైనా నోరు ఊరిపోతుంది. వంకాయ కూర అంత రుచిగా ఉంటుంది. పెళ్లి శుభాకార్యాల్లోనూ వంకాయ మసాలా కర్రీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వంకాయ కూర రుచితో పాటు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే.. వంకాయలో చాలా ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. వంకాయ కర్రీని చాలా ఇష్టంగా తినేస్తుంటారు. వంటల్లో వంకాయలను వండేటప్పుడు అద్భుతమైన రుచిగా ఉంటాయి. ఫంక్షన్లలో మాదిరిగా వంకాయ మసాలా కర్రీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంతకీ వంకాయ కూర తయారీకి అవసరమైన పదార్థాలు ఏంటో తెలుసా? అవేంటో ఇప్పుడు చూద్దాం..
వంకాయ మసాలా కర్రీకి అవసరమైన పదార్థాలు ఇవే :
పావు కిలో వంకాయలు, ఒక ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చి, ఒక టమాట, చిన్న అల్లం ముక్క, ఐదు వెల్లుల్లి రెబ్బులు, అర టీ స్పూన్ తాళింపు గింజలు, ఒక ఎండుమిర్చి, తగినంత ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల నూనె, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పీన్ పసుపు, కొద్దిగా కొత్తిమీర, ఒక రెమ్మ కరివేపాకు తీసుకోవాలి. అలాగే.. టేబుల్ స్పూన్ ధనియాలు, టేబుల్ స్పూన్ నువ్వులు, ఎండుకొబ్బరి ముక్కలు, పల్లీలు రెండు టేబుల్ స్పూన్లు, సాజీరా టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క టీ స్పూన్, నాలుగు లవంగాలు, రెండు యాలకులు తీసుకుని ముందుగా కళాయిలో దొరగా వేయించుకోవాలి. మిక్సీలో వేసి మొత్తని పొడిగా చేసుకోవాలి. కొన్ని నీళ్లు పోసుకుని మొత్తాన్ని పేస్టులా తయారు చేసుకోవాలి.
Brinjal Masala Recipe : తయారీ విధానం ఇలా :
పుచ్చులు లేకుండా మంచి వంకాయలను తీసుకోండి. వంకాయలను బాగా శుబ్రంగా కడిగేయండి. ఆ తర్వాత వంకాయలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. అయితే వంకాయలను కట్ చేసేటప్పుడు ఉప్పు నీళ్లలో వేసుకోవాలి. కళాయిలో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత తాళింపు గింజలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఎండుమిర్చి తాళింపుగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగించాలి. ఆ తరువాత టమాట ముక్కలను మెత్తగా వేయించాలి. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయలను తాళింపులో వేసి ఐదు నిమిషాల వరకు వేయించుకోవాలి. వంకాయ ముక్కలు బాగా వేగించిన తర్వాత అప్పటికే తయారు చేసుకున్న పేస్టును అందులో వేసి బాగా కలపాలి.
ఇప్పుడు కారం, పసుపు, ఉప్పను తగినంతగా కలిపాలి. సన్నని మంటపై కాసేపు వేడి చేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత కరివేపాకు, గ్లాసు నీళ్లను పోయాలి. పది నుంచి పదిహేన్ నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కొత్తిమీరను కట్ చేసి కూరపై చల్లుకోవాలి. అంతే.. వంకాయ మసాలా కర్రీ రెడీ అయినట్టే.. వేడివేడిగా అన్నంలో ఈ కూరను కలుపుకుని తింటుంటే ఎంతో రుచిగా నోరూరించేలా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ కూడా ఇంట్లోనే ఈ వంకాయ మసాలా కర్రీనీ తయారుచేసుకోండి.