Bellam Rava Laddu : రవ్వ లడ్డులు చేయడం తెలుసా? బెల్లంతో టేస్టీగా రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి. ముందుగా బాండిలో ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని కాస్త కరగనివ్వండి. నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు, బాదంపప్పు ముందుగా వేయించుకోవాలి. ఈ జీడిపప్పు, బాదంపప్పు కొంచెం వేగిన తర్వాత ఎండు ద్రాక్ష వేసుకొని వేయించుకోవాలి. బాదం పప్పు, జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఎండు ద్రాక్షని వేసుకొని కలిపి వేయించుకోవాలి.
జీడిపప్పు, బాదంపప్పు బాగా వేగేసరికి ఎండు ద్రాక్ష కూడా వేగిపోతుంది. డ్రై ఫ్రూట్స్ మొత్తం వేగిన తర్వాత అన్నింటిని తీసేసి ఏదైనా గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. మిగిలిన నెయ్యిలో కప్పు ఉప్మా రవ్వ వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టి వేయించండి. ఒక కప్పు రవ్వకి పావు కప్పు నెయ్యి కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ రవ్వ లో ఫ్లేమ్‌లోనే పెట్టి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. కలర్ మారిన తర్వాత పావు కప్పు ఎండు కొబ్బరి పొడి లేదా డెసికేటెడ్ కొబ్బరిపొడి వేసి లో ఫ్లేమ్‌లోనే పెట్టి మరో 3 నిమిషాలు బాగా వేగనివ్వాలి. మంచి స్మెల్ వచ్చిందంటే బాగా వేగిందని గుర్తు పెట్టుకోవాలి.

ఇంట్లో ఎండు కొబ్బరిని తురుముకొని ఆ ఎండు కొబ్బరి పొడైనా వేసుకోవచ్చు. రవ్వ అనేది కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వస్తుంది. అలా వచ్చిన వెంటనే ఈ రవ్వని బాండిలో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఏదైనా గిన్నె పెట్టుకొని ఒక కప్పు బెల్లం తురుము వేసుకోండి. ఒక కప్పు రవ్వకి ఒక కప్పు బెల్లం తురుము కరెక్ట్‌గా సరిపోతుంది. ఒక కప్పు బెల్లానికి ఒక పావు కప్పు నీళ్లు పోసేసి కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి. మీరు ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకుంటారో అదే కప్పుతో బెల్లం కొలుచుకొని తీసుకోవాలి. అప్పుడే రవ్వ లడ్డులు పర్ఫెక్ట్‌గా వస్తాయి.
Bellam Rava Laddu : టేస్టీ రవ్వ లడ్డులు తయారీ ఇలా..
ఇలా కరిగిన తర్వాత గిన్నెను తీసేసి ఇదే స్టవ్ పైన బాండిని పెట్టండి. బాండిల్ నుంచి ఈ బెల్లం వాటర్‌ని వడగట్టేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టి పాకం చేసుకోవాలి. పాకాన్ని పట్టుకుని చూస్తే రెండు వేళ్ళకి బాగా జిగురుగా తగలాలి. అలా జిగురుగా వస్తే పాకం రెడీ అయినట్టే. ఇలా వచ్చిన వెంటనే లో ఫ్లేమ్ లో పెట్టి ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేకాదు.. యాలకుల పొడి కూడా కలిసిపోయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ మొత్తాన్ని వేసుకోవాలి.
ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసే లో ఫ్లేమ్ లోనే ఉంచి మొత్తం బాగా కలిసేటట్టు కలపుకోవాలి. రవ్వ పూర్తిగా కలిసిపోయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎక్కువ సేపు ఉంచితే రవ్వ లడ్లు గట్టి పడిపోతాయి. రవ్వ పూర్తిగా కలిసిపోయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి బాండిల్‌కి మూత పెట్టేసి గోరువెచ్చగా అయ్యేంతవరకు వదిలేసేయండి. ఆరిన తర్వాత రవ్వ లడ్డు గట్టిపడుతుంది. చేతిలో తాకగలిగినంత వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చేసుకోవాలి. మీకు ఏ సైజులో లడ్డూలు కావాలో ఆ సైజులో చేసుకోవచ్చు.
Read Also : Bellam Appalu Recipe : హనుమాన్ జయంతి స్పెషల్ బెల్లం అప్పాలు.. ఇంట్లో చాలా టేస్టీగా సింపుల్ చేసుకోవచ్చు..!