Bellam Appalu Recipe : హనుమాన్ జయంతి స్పెషల్ బెల్లం అప్పాలు ఎలా చేస్తారో తెలుసా? హనుమంతునికి ఎంతీ ప్రీతిపాత్రమైన నైవేద్యంగా అప్పాలు పెడుతూ ఉంటారు. ఈ ప్రసాదంలో 108 అప్పాలను మాల (దండగ) కూర్చి హనుమంతుడికి అలంకరిస్తారు. హనుమాన్‌కి ఈ అప్పాలు అంటే ఎంతో ప్రీతికరం.. ప్రతి మంగళవారం, శని వారాల్లో అప్పలను హనుమంతుని గుడిలో నైవేద్యంగా చేస్తారు.. ఈ స్వామివారి ప్రసాదమైన ఈ అప్పాలను ఇంట్లో ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు.. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు.. బియ్యం పిండి- ఒక కప్పు, గోధుమపిండి- ఒక కప్పు, బొంబాయి రవ్వ- ఒక కప్పు, బెల్లం- రెండు కప్పులు, నూనె-( డీప్ ఫ్రై కి సరిపోయినంత), యాలకుల పొడి- ఒక టీ స్పూన్, కొబ్బరి తురుము- ముప్పావు కప్పు, నెయ్యి- ఒక కప్పు తీసుకోవాలి.
తయారీ విధానం… ముందుగా ఒక బౌల్లో బియ్యప్పిండి ఒక కప్పు తీసుకొని అందులో ఒక కప్పు గోధుమపిండి ఒక కప్పు బొంబాయి రవ్వ మూడిటిని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగు అందంగా ఉన్న గిన్నె పెట్టుకొని రెండు కప్పులు తురిమిన బెల్లం మూడు కప్పులు వాటర్ పోసి బెల్లం కరిగేంతవరకు కలుపుతూ ఉండాలి. బెల్లం నీళ్లు మరుగుతున్నప్పుడు టీ స్పూన్ యాలకుల పొడి పావు కప్పు ఎండు కొబ్బరి పొడి లేదా పచ్చి కొబ్బరి తురుము మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి.

Bellam Appalu Recipe : హనుమాన్‌కి ఇష్టమైన బెల్లం అప్పాలు..
ఇప్పుడు లో ఫ్లేమ్‌లో ఉంచి కలిపి పెట్టుకున్న పిండిని నెమ్మదిగా పోస్తూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి…ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చెయ్యాలి ఇప్పుడు మరోసారి కలుపుకోవాలి. (బొంబాయి రవ్వ, గోధుమ పిండి, బియ్యం పిండి ఎంతైతే క్వాలిటీతో తీసుకుంటాం. అన్ని నీళ్లు బెల్లంలో పోసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తాయి). పిండి బాగా వేడిగా ఉన్నప్పుడే ముద్దలా కలుపుకోవాలి. పిండిపై కొంచెం నెయ్యి వేసుకుని పిండి కొంచెం చల్లారిన (పిండి గోరువెచ్చగా ఉండాలి) ఇప్పుడు పిండిని బాగా కలుపుకోవాలి. చపాతి ముద్దలా తయారు చేసుకోవాలి.
ఆ తర్వాత చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి మనకు ఏ సైజు అప్పాలు కావాలంటే అంత సైజులో చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం నెయ్యి రాసుకుంటూ అప్పాలు మరి మందంగా ఉండకూడదు.. మరీ పల్చగా ఉండకూడదు అప్పాలు ఒత్తుకోవాలి… స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపోయినంత నూనె పోసుకొని నూనె వేడైన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి అప్పాలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. పిండిని బాగా కలుపుకోవాలి… నూనె బాగా వేడి కావాలి అప్పుడు అప్పాలు బూరెల్లా పొంగుతూ వస్తాయి. ఎంతో రుచికరమైన బెల్లం అప్పాలు రెడీ..