Aloo Paratha Recipe : ఆలు పరోట ఎప్పుడైనా తిన్నారా? చాలా టేస్టీగా ఉంటుంది. బయటి హోటల్లో కన్నా ఇంట్లోనే చాలా రుచిగా చేసుకోవచ్చు. ఒకసారి మీ ఇంట్లో ఆలు పరోటా చేశారంటే చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటాయి. ఆలు పరోటను టేస్టీగా చేయాలంటే ఏం చేయాలో తెలుసా? అందులో కొన్ని రకాల పదార్థాలను మిక్స్ చేయడం ద్వారా ఆలు పరాటకు రుచి వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఇప్పుడే మీ ఇంట్లో ఆలు పరోటాను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..
కావలసిన పదార్థాలు.. :
గోధుమపిండి, నూనె, ఉప్పు, ఉడికించిన ఆలుగడ్డ 2, నిమ్మరసం, చాట్ మసాలా పొడి, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కారం….
తయారీ విధానం.. :
ముందుగా ఒక బౌల్లో గోధుమపిండి వేసి ఒక స్పూన్ నూనె, కొంచెం ఉప్పు, గోరువెచ్చని నీళ్లు పోసి పిండి మృదువుగా ఎంతసేపు కలిపితే అంత మంచిగా ఉంటాయి. చపాతి పిండిలా.. పిండిని తడి క్లాత్ కప్పి 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. స్టఫింగ్ కోసం ఉడికించిన ఆలుగడ్డలను మెత్తగా చేసుకోవాలి.
ఆ తర్వాత, అర టీ స్పూన్ చాట్ మసాలా, అర చెంచా జిలకర పొడి, ఒక పచ్చిమిర్చి తరుగు, రుచికి తగినంత ఉప్పు, అర చెంచా కారం, అర చెంచా నిమ్మకాయ రసం, రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర, రెండు టేబుల్ స్పూన్ల పుదీనా, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలపాలి. ఉడకబెట్టిన ఆలును ఆరిన తర్వాత తీసుకోవాలి లేకపోతే వాటర్ వాటర్ గా ఉంటుంది.
ముందుగా నానబెట్టిన పిండిని తీసుకొని ఉండలు అరచేతిలో ఒత్తుకొని స్టఫింగ్ చేసిన ఆలు ముద్దను మధ్యలో పెట్టుకొని బొటనవేలుతో ఆలు మిక్చర్ని లోపటికి అనుకుంటూ చపాతి ఉండలా చేసుకోవాలి. ఇప్పుడు పరాటాన్ని నెమ్మదిగా చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో ఉంచి చపాతి పెనంపై రెండు వైపులా ఆలు పరోటా ను కాల్చుకోవాలి. ఈ పరాటాలను బటర్ తో కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. లేకపోతే తో నూనెతో అయినా పరోటాలు కాల్చుకోండి. అంతే అండి ఎంతో రుచికరమైన ఆలు పరోటా రెడీ…