Uttareni Plant Uses : ఆయుర్వేద ఉత్తరేణి మొక్క గురించి ఎప్పుడైనా విన్నారా? పోనూ చూశారా? ఈ ఉత్తరేణికి ఆయుర్వేద వైద్యంలో మంచి పేరుంది. ఉత్తరేణి మొక్కలో అన్ని భాగాలు వ్యాధులను నివారించగల ఔషధ గుణాలు చాలానే ఉన్నాయి. చాలా వ్యాధులకు ఈ ఔషధ మొక్క అద్భుతంగా పనిచేస్తుంది.
తేలు, పాము లాంటి విషపూరితమైనవి కుడితే ప్రాధమిక చికిత్స కోసం ఉత్తరేణి మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఉత్తరేణికి అపామార్గ , ఖరమంజరి అనే పేర్లు కూడా ఉన్నాయి. అదే తెలుగులో అయితే ఉత్తరేణి, దుచ్చెన చెట్టుగా పిలుస్తారు. ఇంతకీ ఉత్తరేణి చెట్లతో మరింత ప్రయోజనాలేంటో చూద్దాం..
ఉత్తరేణి మొక్క నుంచి తీసిన కషాయం కిడ్నీలను శుభ్రం చేసుకోవచ్చు. మూత్రం సాఫీగా నడుస్తుంది. ఉత్తరేణి రసంతో చర్మంపై ఉబ్బు, గజ్జి, కుష్టు, కఫము, నొప్పులను నివారించవచ్చు. ఉత్తరేణిని కాయసిద్ధి ఔషధంగా వాడుతారు. వయసు మీరినట్టుగా కనిపించకుండా ఉండే మెడిసిన్స్‌లో ఈ ఉత్తరేణిని వినియోగిస్తారు.
అజీర్ణ సమస్యలకు దివ్యాషధం :
ఇక ఉత్తరేణి విత్తనాలను పాలతో వండి తినొచ్చు.. ఇలా చేస్తే కడుపు నొప్పి క్షణాల్లో తగ్గిపోతుంది. ఉత్తరేణి భస్మం అజీర్ణ సమస్యలకు దివ్యాషధంగా పనిచేస్తుంది. ఉత్తరేణి చెట్ట వేర్లతో సహా పీకి బాగా ఎండబెట్టాలి.. కాల్చి బూడిద చేయాలి.. ఆ భస్మాన్ని గంజి నీటితో కాచాలి.. శొంటి కషాయంతో రెండు పూటలా ఆహారంలో తీసుకోవాలి.
పిచ్చి కుక్క కరిచినా ఈ ఉత్తరేణి విత్తనాల చూర్ణాన్ని వాడొచ్చు. విత్తనాల చూర్ణం నీళ్లతో నూరి కుక్క కరిస్తే వచ్చే హైడ్రోఫోబియా వెంటనే తగ్గిపోతుంది. తేలు, పాము, జెర్రి వంటి విషపూరితమైనవి కరిస్తే ఉత్తరేణి ఆకులు నూరి కరిచిన చోట పట్టిస్తే బాధ, మంట తగ్గిపోతుంది. అందులోని విషాన్ని లాగేస్తుంది. భస్మం గ్రాము తేనెలో కలిపి తీసుకుంటే ఉబ్బస సమస్య తగ్గుతుంది. ఉత్తరేణి రసంలో దూది తడిపి పిప్పి పన్నుపై పెడితే నొప్పి వెంటనే తగ్గిపోతుంది.
జ్వరంతో బాధపడేవారంతా ఉత్తరేణి పచ్చి ఆకు నూరి కొద్దిగా మిరియాలు, కొద్దిగా వెల్లుల్లిపాయలు చేర్చాలి. వాటిని నూరి మాత్రలుగా తీసుకోవాలి. ఇలా చేస్తే చలిజ్వరం వెంటనే తగ్గిపోతుంది. కందిరీగ, తెనెటీగ కుట్టిన చోట ఈ ఆకుని నీళ్లతో నూరి రాస్తే మంట తగ్గిపోతుంది. ఉత్తరేణి ఆకురసంలో ముల్లంగి గింజలు కలిపి నూరి సొరియాసిస్ మచ్చలపై 40 రోజుల పాటు రాస్తే మచ్చలు తగ్గుముఖం పడతాయి.
ఉత్తరేణి మొక్కతో అనేక ప్రయోజనాలెన్నో :
ఉత్తరేణి మొక్కతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందులో ఔషధ గుణాల గురించి తెలిస్తే తప్పకుండా వినియోగించుకుంటారు. అనేక అనారోగ్య సమస్యలకు ఉత్తరేణి మొక్క అధ్భుత ఔషధంగా పనిచేస్తుందనడంలో సందేహం అక్కర్లేదు. ఎలాంటి క్రీమికీటకాలు కుట్టినచోట ఈ ఉత్తరేణి మొక్క ఆకుల రసాన్ని బాగా పిండి ఆ మిశ్రమాన్ని కుట్టిన చోట రాయడం ద్వారా నొప్పి నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు. వాపు కూడా వెంటనే తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణుల మాట..
చర్మ సమస్యలతో బాధపడేవారు ఈ ఉత్తరేణి మొక్క రసాన్ని రాసుకోవడం ద్వారా తొందరగా ఉపశమనం పొందవచ్చు. సొరియాసిస్ వంటి అనేక చర్మ సంబంధిత సమస్యలను తగ్గించగల గుణాలు పుష్కలంగా ఉన్నాయి.
ఉత్తరేణి మొక్క దాని అద్భుతమైన గుణాల గురించి ఎంతచెప్పినా తక్కువే.. ఈ మొక్కలోని ఔషధ గుణాలు సర్వ రోగాలకు చెక్ పెట్టొచ్చు. అఖిరాంథన్ ఆస్పరా శాస్త్రీయ నామంతో పిలిచే ఈ మొక్క అమరాంథేసి కుటుంబానికి చెందిన మొక్క. ప్రత్యేకించి వినాయకుడి నవరాత్రుల్లో ఈ ఔషధ మొక్కను పత్ర పూజకు ఎక్కువగా వినియోగిస్తుంటారు.
ఆధునిక ప్రపంచంలోనే కాదు.. పూర్వీకుల నుంచి ఈ ఉత్తరేణి మొక్కలకు బాగా ప్రసిద్ధిచెందదనే చెప్పాలి. పలు ఔషధాలకు తయారీలో ఈ మొక్క ఉండాల్సిందే అంటే అతియోశక్తి కాదు. గణేశుడికి భక్తితో సమర్పించే పత్రాలలో ఉత్తరేణి మొక్క కూడా ఎంతో ప్రాధాన్యమైనది. అనారోగ్య సమస్యలను మటుమాయం చేయడంలో ఉత్తరేణి మొక్క పనితీరు అద్భుతంగా ఉంటుంది. ఈ ఆకుల రసాన్ని తీసి శరీరంపై ఏర్పడిన దురదలు, పొక్కులపై రాస్తే వెంటనే ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది.
చాలామంది బాధితుల్లో ఉబ్బసంతో పాటు దగ్గు వంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఈ సమస్యలను తగ్గించుకోవాలంటే ఉత్తరేణి మొక్క నుంచి సేకరించిన ఎండబెట్టిన ఆకులను తీసుకోవాలి. ఎర్రటి నిప్పులపై ఎండిన ఆకులను వేయాలి. అప్పుడు వచ్చే పొగను పీల్చినట్టయితే దగ్గుతో పాటు ఆయాసం వంటి శ్వాస సంబంధిత సమస్యలు దూరమైపోతాయి.
ఉత్తరేణి మొక్క ఎండిన ఆకులను కాల్చిన తర్వాత ఏర్పడిన బూడిదను ఒక చోట చేర్చాలి. ఆ బూడిత మిశ్రమాన్ని ఆముదముతో బాగా కలపాలి. శరీరంపై తామర సమస్య, గజ్జి సోకిన ప్రాంతాల్లో లేపనం రాయాలి. కొన్నిరోజుల పాటు రాస్తుండటం వల్ల తగ్గిపోతాయి. అలాగే తేనెటీగలు, కందిరీగలు, తేళ్లు కుట్టిన సమయంలో విష ప్రభావానికి గురైన చోట ఈ ఉత్తరేణి ఆకులను ముద్దగా వచ్చేలా నూరి రాయాలి. అంతే శరీరంపై విష ప్రభావం తగ్గి నొప్పి సహా దురద అన్ని తగ్గుముఖం పడతాయి. చాలామందిని వేధించే మరో సమస్య.. పంటినొప్పి.. పిప్పి పళ్లు.. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఉత్తరేణి గింజల పొడిని వాడుకోవాలి.
ఉప్పుతో పాటు పటిక పొడి మిశ్రమం, అలాగే వంట కర్పూరం మిశ్రమాన్ని బాగా కలిపి ముద్దగా నూరాలి. పేస్టులా తయారుచేసుకోవాలి. ఆపై పంటినొప్పి ఉన్న చోట దాన్ని రాసుకోవాలి. చిగుళ్లలో నుంచి రక్తం కారడం వంటి సమస్య ఉన్నవారు తొందరగా ఉపశమనం పొందవచ్చు. చిగళ్లలో ఏర్పడిన రక్తస్రావాన్ని కూడా నివారించుకోవచ్చు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు పదార్థాలను కూడా కరిగించే గుణాలు ఉత్తరేణి మొక్కలో ఉన్నాయి. ఈ ఆకుల రసాన్ని నువ్వుల నూనె వేసిన తర్వాత బాగా మరిగించాలి. ఆ తర్వాత రసాన్ని పొట్ట భాగంలో కొవ్వు ఉన్నచోట అప్లయ్ చేస్తుంటే క్రమంగా కరిగిపోయే అవకాశం ఉంటుంది.
ఉత్తరేణి మొక్క విత్తనాలను పౌడర్ మాదిరిగా తయారుచేసుకోవాలి. ఆ పౌడర్ ను ఉప్పుతో కలిపి ఉంచుకోవాలి. ఉదయం లేవగానే ఈ పౌడర్ తో పళ్లు తోముకోవడం ద్వారా పంటి సమస్యలను తొందరగా తగ్గించుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. ఉత్తరేణి చెట్టు కొమ్మలతో కూడా పళ్లు తోముకోవచ్చు. నిత్యం ఇలా ఉత్తరేణి మొక్క పుల్లలతో పళ్లు తోముకోవడం ద్వారా పంటి అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. పళ్లు తెల్లగా కూడా మారుతాయి.
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఉత్తరేణి ఔషధాన్ని వాడటం ద్వారా తొందరగా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అధిక బరువు సమస్యతో బాధపడేవారు కూడా ఈ ఉత్తరేణి మొక్క గింజల మిశ్రమాన్ని తీసుకోవడం ద్వారా బరువు క్రమంగా తగ్గిపోవచ్చు. అంతేకాదు.. అతిగా తినే అలవాటును కూడా తగ్గించుకోవచ్చు. తద్వారా మీకు ఆకలి వేయదు. బరువు కూడా తగ్గేందుకు వీలుంటుంది. వికారం వంటి సమస్యలతో బాధపడేవారు ఈ ఉత్తరేణి గింజలను వాడటం ద్వారా తొందరగా ఉపశమనం పొందవచ్చు.
గాయాలను కూడా వెంటనే మానిపోయేలా చేయడంలో ఈ మొక్క ఉపయోగపడుతుంది. చర్మంపై అయ్యే గాయాలను నివారించడంలోనూ దివ్యౌషధంగా పనిచేస్తుంది. లంగ్స్ సమస్యతో ఇబ్బందిపడేవారు కూడా ఈ ఉత్తరేణిని ఔషధంగా వాడటం ద్వారా తొందరగా ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. ఊపిరితిత్తుల పనితీరు కూడా బాగా మెరుగుపడుతుంది. ఉబ్బస వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు. వెల్లుల్లి రెబ్బలతో పాటు నల్ల మిరియాలను కలిపి పేస్టుగా చేసుకోవాలి. అర టీ స్పూన్ వరకు రోజులో మూడు నుంచి నాలుగు సార్లు క్రమం తప్పకుండా తీసుకుంటుండాలి. జలుబు, ఫ్లూ, జ్వరం వంటి వ్యాధులను కూడా ఉత్తరేణి మొక్కతో నివారించుకోవచ్చు.
శరీరంలో పేరుకుపోయిన మలినాలను తొలగించడంలోనూ ఉత్తరేణి అద్భుతంగా పనిచేస్తుందని చాలామందికి తెలియదు. చర్మాన్ని శుభ్రపరచడంలో ఈ ఉత్తరేణి ఆకు బాగా పనిచేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన అనేక కఫం, పిత్తం లాంటి దోషాలను తొలగించుకోవచ్చు. ఫైల్స్ సమస్యతో బాధపడేవారు కూడా ఈ మొక్కను వాడుకోవచ్చు. శరీరంపై ఏర్పడే దద్దుర్లు, ఇతర అనారోగ్య సమస్యలను కూడా ఉత్తరేణి మొక్కతో సులభంగా తగ్గించుకోవచ్చునని నిపుణులు మాట.
ఏదిఏమైనా ఈ ఉత్తరేణి మొక్కను చూడగానే ఏదో పనికిరాని మొక్కగా భావిస్తుంటారు. ఎందుకంటే ఆ మొక్కలోని ఔషధ గుుణాలు గురించి తెలియకనే.. ఒకసారి ఈ మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎలా ఉంటాయో తెలిస్తే ఎప్పటికీ మొక్కను వదలిపెట్టరు. తప్పకుండా ఈ మొక్క గింజలు, ఆకులను వాడేందుకు ఆసక్తి చూపిస్తారు. కేవలం ఒక అనారోగ్య సమస్య మాత్రమే తగ్గుతుందని చెప్పలేం.. ఎన్నో అనారోగ్య సమస్యలకు ఈ ఉత్తరేణి దివ్యౌషధమని చెప్పవచ్చు. ఈ మొక్కతో కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలను ఎలా పొందాలో తెలుసుకున్నారని భావిస్తున్నాం.
Read Also : Mosquito Plant : అచ్చం గులాబీలా ఉండే ఈ మొక్కలో ఎన్ని ఔషధ గుణాలో తెలుసా?