Egg Masala Recipe : నోరూరించే ఎగ్ మసాలా కర్రీ.. ఇలా చేశారంటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.. అంత టేస్టీగా ఉంటుంది..!

Egg Masala Recipe : ఎగ్ మసాలా కర్రీ ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఒకసారి ఇలా చేశారంటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఇలా చేసుకొని తిన్నారంటే.. ఎగ్ కర్రీ మళ్లీ ఇలానే చేసుకుంటారు. అంత రుచిగా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. 5 నుంచి 6 కోడిగుడ్లను తీసుకోండి. ఇప్పుడు ఒక చాక్ తీసుకొని ఉడకబెట్టిన గుడ్లపై సన్నగా గీతలా కట్ చేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఇచ్చి కట్ చేసుకోవాలి.

ఇలా కట్ చేయడం వల్ల మసాలా అంతా ఎగ్ లోపల వెళ్తుంది. ఎగ్ తినే సమయంలో నోటికి చాలా రుచిగా ఉంటుంది. అందుకే ఎగ్ సగమే ఇలా కట్ చేసుకోవాలి. పూర్తిగా కట్ చేయొద్దు.. ఇలా అన్ని ఎగ్స్ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలోని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ కారం, వన్ టీ స్పూన్ ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్ని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే చేయండి. హై ఫ్లేమ్‌లో ఫ్రై చేయకండి. గోల్డెన్ కలర్‌లో వచ్చిన తర్వాత బయటకు తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి.

Egg Masala Recipe : ఎగ్ మసాలా కర్రీ టేస్టీగా రావాలంటే..

ఇప్పుడు అదే ఆయిల్‌లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడు గ్రేవి చాలా తిక్‌గా ఉంటుంది. ఇప్పుడు ఒక రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు అందులో వేసుకోవాలి. అలాగే, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని రెండు మీడియం సైజ్ టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకోవాలి. టమాటోలు మెత్తగా కుక్ అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఒక టీస్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి.

Egg Masala Recipe In Telugu
Egg Masala Recipe In Telugu

పచ్చి వాసన పోయేవరకు అలానే ఉంచాలి. ఇప్పుడు మసాలా వేసిన తర్వాత ఫ్లేమ్ మీడియం పెట్టుకుని మూత పెట్టుకోవాలి. ఒక 6 నుంచి 7 నిమిషాలు పాటు కుక్ చేసుకోవాలి. 7 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేయండి. ఇప్పుడు ఉడికించి గాట్లు పెట్టిన గుడ్లను అన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. అలా 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఎందుకంటే.. మంచి కలర్‌ఫుల్‌గా వస్తుంది. నూనె పైకి తేలేంతవరకు అలానే ఉంచాలి. అంతే.. ఎగ్ మసాలా కర్రీ రెడీ. చాలా సింపుల్‌గా ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరూ కూడా ఓసారి ట్రై చేయండి.

Read Also : Multigrain Dosa : సిరిధాన్యాలతో బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండా మల్టీ గ్రైన్ ప్రోటీన్ దోస.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..!

Leave a Comment