Beerakaya Pachadi : తింటే బీరకాయ పచ్చడినే తినాలి.. ఇలా చేశారంటే లొట్టలేసుకుని తినేస్తారు.. అంత టేస్టీగా ఉంటుంది..!

Beerakaya Pachadi : బీరకాయ పచ్చడి ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలా చేస్తే.. ఏ బ్రేక్ ఫాస్ట్‌లో అయినా ఇడ్లీ, దోశ పూరి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకైనా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కూడా చాలా సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం బీరకాయ పచ్చడి ఎలా టేస్టీగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.. డిఫరెంట్‌గా ఇలా ట్రై చేస్తే మీరే చెప్తారు.. బీరకాయ పచ్చడి కోసం 1/4 బీరకాయలు తీసుకోండి. ఆ బీరకాయల తొక్క తీసేయండి. ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. బీరకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పాన్ వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు కూడా వేసుకోవాలి.

Beerakaya Pachadi : How to Make Ridge Gourd Chutney in Telugu
Beerakaya Pachadi : How to Make Ridge Gourd Chutney in Telugu

నువ్వులు వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని ఒక నిమిషం వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఒక్క నిమిషం వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కారాన్ని బట్టి వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. మూత పెట్టుకొని సిమ్‌లో పెట్టుకొని వేగనివ్వాలి. బీరకాన్ని కొంచెం మంచిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. బీరకాయ ఉడికిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. మూడు టమాటలను ముక్కలా కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటలు సాఫ్ట్‌గా అయ్యేవరకు ఉడకనివ్వాలి. మళ్లీ స్టవ్ సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి.

Beerakaya Pachadi : బీరకాయ పచ్చడి మరింత టేస్టీగా రావాలంటే…

బీరకాయలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో వేసుకోవాలి. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా పేస్ట్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరి పేస్ట్‌లా కాకుండా ఇలా కొంచెం కచ్చాపచ్చాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. పాన్ వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ టీ స్పూన్ శనగపప్పు కూడా వేసుకోవాలి. శనగపప్పు కలర్ మారుతున్నప్పుడు హాఫ్ టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి.

Beerakaya Pachadi : How to Make Ridge Gourd Chutney in Telugu
Beerakaya Pachadi : How to Make Ridge Gourd Chutney in Telugu

జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి ముక్కలను వేసుకోవాలి. రెండు మూడు వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకోవాలి. కావాలనుకుంటే.. ఇంగువ కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి వేసుకోవాలి. బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అంతే.. టేస్ట్ టేస్టీగా బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఓసారి ట్రై చేయండి.

Read Also : Sorakaya Soup : శరీరానికి చలువ చేసే సొరకాయ సూప్.. తాగారంటే ఇట్టే బరువు తగ్గుతారు.. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం..!

Leave a Comment