Cure Mouth Ulcers Fast : నోటి అల్సర్లతో బాధపడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. మౌత్ అల్సర్లు లేదా నోటి పూత అని కూడా అంటారు. ఈ నోటి పూత సమస్య విషయంలో అజాగ్రత్తగా ఉండటం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నోటి పూత సమస్యను చాలామంది తేలికగా తీసుకోవద్దని సూచిస్తున్నారు.
కొన్నిసార్లు ఈ సమస్య తీవ్ర అనారోగ్యానికి దారితీయొచ్చునని హెచ్చరిస్తున్నారు. అసలు ఈ నోటి పూత ఎలా వస్తుంది.. ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం.. నోటి పూత సమస్యను తొందరగా వదిలించుకునేందుకు కొన్ని అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి అవేంటో ఓసారి చూద్దాం..
వంటిట్లో సమృద్ధిగా లభించే లవంగాలతో నోటి పూత సమస్యను ఇట్టే తగ్గించుకోవచ్చు. నోటి పూతకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేయడంలో లవంగాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఒక రోజులో పూటకు ఒక లవంగాన్ని నోట్లో పెట్టుకుని నమలాలి. అలాగే లవంగం రసాన్ని పీల్చడం చేస్తుండాలి. అప్పుడు నోట్లో ఏమైనా పుండ్లు, పూత ఉంటే వెంటనే తగ్గిపోతాయి. తొందరగా ఉపశమనం పొందవచ్చు.
తియ్యనైనా తేనె అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియాల్ లక్షణాలు ఉంటాయి. నోట పూత సమస్యను తగ్గించుకోవడంలో నేచురల్ మెడిసిన్ లా నివారిస్తుంది. నోటి పూత సమస్యతో బాధపడేవారు సమస్య ఉన్న భాగంలో కొంచెం తేనెను పూతగా రాయాలి. ప్రతిరోజూ ఇలా చేస్తుంటే.. నోటి పూత సమస్యను తొందరగా తగ్గించుకోవచ్చు.
కలబంద.. తెలియనివారు ఉండరు.. కలబంద గుజ్జును నోట్లో పూత ఉన్నచోట రాయాలి. నిత్యం ఇలా చేస్తుంటే తొందరలోనే నోటిపూత సమస్యను తగ్గించుకోవచ్చు. కలబందపై పైభాగాన్ని తొలగించి అందులో మెత్తటి గుజ్జును బయటకు తీయాలి. ఆ గుజ్జును నోట్లో పూతపై అప్లయ్ చేస్తే వెంటనే తగ్గిపోతుంది.
వంటింట్లో దొరికే పసుపు కూడా నోటి పూతను తగ్గిస్తుంది. వంటింట్లో ఎక్కువగా వినియోగించే పసుపులోనూ యాంటీ ఇన్‌ఫ్లామేటరీతో పాటు యాంటీ బ్యాక్టీరియల్ వంటి గుణాలు ఎక్కువగా లభిస్తాయి. అందుకే పసుపును ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. సహజసిద్ధమైన యాంటీబ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉండటంతో పసుపుకు అంత ప్రాముఖ్యత వచ్చింది. ఆర్గాన్ పసుపు మాత్రమే వాడాలని విషయం గుర్తించుకోండి. నోటిపూతను తగ్గించడంలో పసుపు మించి మరొకటి లేదనే చెప్పాలి. ఒక కప్పు మోతాదులో గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. అందులో కొద్దిగా పసుపు వేసి బాగా కలిపాలి. ఆ నీటిని నోట్లో పోసి బాగా పుక్కిలించాలి. రోజుకు రెండు సార్లు ఇలా చేస్తుంటే చాలు తొందరగా సమస్యను తగ్గించుకోవచ్చు.
నోటిపూతను నివారించడంలో నెయ్యి అద్భుతంగా పనిచేస్తుంది. నోట్లో పూత సమస్యతో బాధపడేవారు ఆ చోట నెయ్యి రాయాలి. ఇలా నిత్యం చేస్తూ ఉంటే క్రమంగా సమస్య తగ్గిపోతుంది. నోటి పూతను నివారించడంలో యాపిల్ సైడర్ వెనిగర్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అర కప్పు గోరు వెచ్చని నీరు తీసుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కలపండి.. ఇప్పుడా ఆ మిశ్రమాన్నినోట్లో ఉంచుకుని గట్టిగా పుక్కిలించాలి. రోజుకు రెండు సార్లు చేయండి చాలు.. వెంటనే నోటి పూత తగ్గించుకోవచ్చు.
Read Also : 5 Easy Neck Exercises : మెడనొప్పి బాధిస్తోందా? ఈ ఆసనాలతో ఇట్టే తగ్గిపోతుంది!