Spicy Egg Pulusu Recipe : ఆంధ్రా స్టైల్ కోడిగుడ్డు పులుసు.. ఇలా చేస్తే ఎంతో టేస్టీగా స్పైసీగా ఉంటుంది.. కొంచెం కూడా మిగల్చకుండా గిన్నె ఊడ్చేస్తారు!

Spicy Egg Pulusu Recipe : కోడిగుడ్డు పులుసు ఎప్పుడైనా ట్రై చేశారా? సాధారణంగా కోడిగుడ్డు పులుసును చాలా రకాలు చేసుకుంటుంటారు. తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్డు పులుసును తమకు నచ్చిన పద్ధుతుల్లో వండుతుంటారు. వాస్తవానికి కోడిగుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిదని తెలుసు. అందుకే రోజుకో గుడ్డు తినమని అంటారు. కోడిగుడ్డుతో తయారుచేసిన వంటకాలు కూడా అంతే రుచిగా ఉంటాయి. కోడిగుడ్డు పులుసును ఎలా తయారుచేయాలో తెలుసా? కోడిగుడ్డును ఉడకబెట్టడమే కాదు.. పులుసును కూడా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఒకసారి కోడిగుడ్డు పులుసు ఇలా తయారుచేశారంటే లొట్టలేసుకుంటూ తినేస్తారు. ఆంధ్రా స్టయిల్ కోడిగుడ్డు పులుసును ఇలా చేశారంటే చాలా రుచిగా ఎంతో స్పైసీగా ఉంటుంది. ఇంతకీ ఈ కోడిగుడ్డు పులుసును ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

కావాల్సిన పదార్ధాలివే :
ముందుగా ఉడికించిన గుడ్లు నాలుగు నుంచి 6 వరకు తీసుకోవచ్చు. సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు, సన్నగా తరిగిన 5 పచ్చి మిరపకాయలు, సన్నగా ముక్కలుగా కట్ చేసిన మూడు టమాటాలు, ఒక టీ స్పూన్ పసుపు, రెండు టీ స్పూన్ల కారం పొడి, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ చింతపండు గుజ్జు, బెల్లం ఒక టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంతగా వేసుకోవాలి. అలాగే, ఒక టీ స్పూన్ ఆవాలను వేయాలి. ఆ తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర, రెండు కరివేపాకు రెమ్మలు, తురిమిన కొత్తిమీర రెండు టీ స్పూన్లు, తగినంత ఆయిల్ వేసుకోవాలి.

Spicy Egg Pulusu Recipe : ఆంధ్రా ఎగ్ కర్రీ.. కోడి గుడ్డు పులుసు రెసిపీ తయారీ.. 

తయారీ విధానం ఇలా :
ముందుగా,, ఒక పాన్ తీసుకోండి.. అందులో కొద్దిగా నూనె పోసి వేడి చేయండి. నూనె కొద్దిగా కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేయాలి. నిముషం దాకా లైట్‌గా వేపుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి పేస్ట్ వేసి ఐదు నిమిషాల వరకు దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, కారం, పసుపు, ధనియాలపొడి వేసి మరికొన్ని నిముషాలపాటు అలానే ఉడికించుకోవాలి. చివరిగా టమాటా ముక్కలతో పాటు చింతపండుగుజ్జు కలిపి ఐదు నిముషాల వరకు లో ప్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి.

Spicy Egg Pulusu Recipe Andhra Style in telugu
Spicy Egg Pulusu Recipe Andhra Style in telugu

టమాటా గుజ్జు మెత్తగా ఉడికిన తర్వాత ఉప్పు, కొద్దిగా బెల్లం వేసి బాగా కలియబెట్టాలి. చివరిగా పది నుంచి పదిహేను నిమిషాల వరకు మరగించాలి. అప్పటికే నీళ్లలో ఉడికించిన గుడ్లను తీసుకోవాలి. ఆ గుడ్లు తెల్లటి పైభాగంలో కొద్దికొద్దిగా గాట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత తయారైన కోడిగుడ్డు గ్రేవీలో కలపాలి. ఇదిగో.. మీకోసం ఆంధ్రా స్టయిల్లో తయారు చేసిన కోడిగుడ్డు పులుసు రెడీ.. అన్నంలో కోడిగుడ్డు పులుసును కలుపుకుని తింటే.. ఆహా ఆ టేస్టే వేరబ్బా.. గిన్నె మొత్తం ఖాళీ చేసేస్తారంతే..

Read Also : Gongura Pachi Senagapappu Curry : ఆంధ్రా స్టైల్ గోంగూర పచ్చి శనగపప్పు పులుసు కూర.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్ది.. లొట్టేలేసుకుంటూ తినేస్తారు!

Leave a Comment