Bendakaya Endu Chepa Kodiguddu Pulusu : బెండకాయ కోడిగుడ్డు ఎండు చేపల పులుసు ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే చాలా రుచికరంగా ఉంటుంది. లొట్టేలేసుకుంటూ తినేస్తారు.. కొంచెం కూడా మిగల్చరు.. అంత టేస్టీగా ఉంటుంది. ఎవరికైనా నోరూరిపోవాల్సిందే.. బెండకాయ, ఎండు చేపల కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంతకీ ఈ పులుసు ఎలా చేయాలో తెలుసా? అయితే ఇలా చేయండి.. చాలా అద్భుతంగా వస్తుంది. మీరు చేయాల్సిందిల్లా.. బెండకాయ కోడిగుడ్డు ఎండుచేపల పులుసుకు ఎలాంటి పదార్థాలు కావాలి అనేది ముందుగా తెలుసుకోండి. అవేంటో ఓసారి చూద్దాం.
కావలసిన పదార్థాలు.. బెండకాయ -1/3 కేజీ, కోడిగుడ్లు-4, ఎండు చేపలు-4, నూనె, పసుపు, ఉప్పు, కారం, ఉల్లిపాయ-1, అల్లం వెల్లుల్లి పేస్ట్1 టీ స్పూన్, పోపు గింజలు, జిలకర ఒక టీ స్పూన్, ఆవాలు ఒక టీ స్పూన్, పచ్చిమిర్చి, చింతపండు, ధనియాల పొడి -1 టీ స్పూన్,
తయారీ విధానం.. ఎండు చేపలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని… వేడి నీళ్లలో రెండు నిమిషాలు నానబెట్టి వేడి నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. కోడిగుడ్లను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి ఐదు టేబుల్ నూనె వేసి నూనె వేడైన కోడిగుడ్లు, ఎండు చేపలు వేసి కొంచెం మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు కలపాలి.

కోడిగుడ్డు ఎండు చేపలు కలర్ మారేంతవరకు అడుగంటకుండా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఆ తర్వాత పోపు గింజలు జిలకర ఆవాలు కరివేపాకు వేసి తాలింపు వేగిన తర్వాత నిలువుగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసిన బెండకాయ ముక్కలు వేసి కలపాలి. కొంచెం ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్ లో రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత పక్కన పెట్టుకున్న ఎండు చేపలు, కోడిగుడ్లు రుచికి తగినంత కారం, ఉప్పు వేసి నెమ్మదిగా కలిపి రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి.
ఇప్పుడు చింతపండు గుజ్జు వేసి గుడ్లు మునిగేంతవరకు ఒక గ్లాస్ నీళ్లు పొయ్యాలి. ఆ తర్వాత పులుసు చిక్కబడేంత వరకు ఉడికించాలి. పులుసులో నూనె పైకి తేలిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసి కలిపి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంది. బెండకాయ కోడిగుడ్డు ఎండు చేపల పులుసు రెడీ.. అన్నంలో కలుపుకుని తింటుంటే ఉంటుంది ఆ రుచే వేరబ్బా.. మీరు కూడా ఓసారి ట్రై చేయండి..