Yarravaram Bala Ugra Narsimha Swamy : యర్రవరంలో స్వయంభూగా వెలసిన బాల ఉగ్రనరసింహ స్వామి.. ఆ గ్రామంలో అనేక అద్భుతాలు సృష్టిస్తున్నారు. యర్రవరం గ్రామంలో బాల ఉగ్ర నరసింహ స్వామిగా కొలువుదీరాడు. అంతేకాదు.. వైకుంఠం నుంచి ముక్కోటి దేవతలతో ఏకమై వస్తానని చెబుతున్నాడట ఈ బాల ఉగ్ర నరసింహ స్వామి.. గ్రామంలోని ఒక బాలుడి ఒంటిపైకి వచ్చి.. 2032లో సృష్టి అంతం కానుందని, 12 జ్యోతిర్లింగాల్లో మన శ్రీశైలం ఒకటి.. 18 అష్టదశ శక్తిపీఠాలలో ఒక శక్తి పీఠం ఒకటి ఉంది. అందులో నుంచి 12 జ్వాలలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఆ జ్వాలలను నీటిలో ఆర్పాలన్నా ఆరవు.. అష్టదశ శక్తి పీఠాలలో ఒకటి శక్తిపీఠంగా మారింది.
అది అమ్మవారు కొలుదీరిన ప్రదేశమని బాల వాక్కు చెప్పాడు. 2032 సంవత్సరం నాటికి ఈ 12 జ్వాలలు ఆరిపోతాయట.. ప్రపంచమంతా ప్రళయాలతో నిండిఉంటుంది. అప్పుడు స్వయంభూగా ఈ లక్ష్మీ నరసింహ, బాల నరసింహ, ఉగ్ర నరసింహ ముగ్గురు ఏకమై ఒక్కరిగా భూప్రపంచాన్ని కాపాడేందుకు ఈ గుడి నుంచే కదిలి వస్తాడు. అందుకే ఈ నారాయణుడు వైకుంఠం నుంచి కదిలి భూలోకానికి వచ్చాడు. ఏడు కొండల్లో కొలువైనది ఈయనే.. అనంత పద్మనాభ స్వామిని నేనే అంటున్నాడు. అప్పుడే వస్తుంది ఏడు సముద్రాలు ఏకమై పెద్ద ప్రళాయం వస్తుందట.. అప్పుడు అంతం అవుతుంది భూ ప్రపంచమని, అదే సమయంలో లక్ష్మి నరసింహ స్వామి వచ్చి అందరిని కాపాడుతాడని చెబుతున్నాడు.
స్కూల్లో చదివే బాలుడికి అవహించిన నరసింహ స్వామి :
అప్పుడే గ్రామ ప్రజలను కాపాడడానికే ఇక్కడ వెలిశానని చెబుతున్నాడట.. ఈ గ్రామంలో అనేక దేవతలు కొలువై ఉన్నారు. వైకుంఠానికి ఇక్కడే దారి ఉందని చెప్తున్నాడట.. బంగారు ఉయ్యాలలోని బాలా ఉత్తర నరసింహస్వామి ఆ రోజు తాను బయటికి వస్తాను అని చెప్తున్నాడట.. ఆదిశేషుల పడగలతో మూడు నామాల లక్ష్మీనరసింహస్వామిగా ఉగ్ర నరసింహ స్వామిగా బాలా లక్ష్మీ నరసింహస్వామిగా ఆ గుట్టపై కొలువుతీరి ఉన్నాడు. యర్రవరం గ్రామంలో ఒక మాటకు ఆ గడ్డ మీద నేనున్నానని చెప్పగా ఊరి ప్రజలు ఎవ్వరూ నమ్మలేదు. స్కూల్లో బాలుడుకి దేవుడు వచ్చి వింత వింతగా చేస్తుంటే.. అక్కడి స్కూలు యజమాని ఆ తల్లిదండ్రులకు చెప్పారు.

ఆ బాలుడిని నేను లక్ష్మీ నరసింహ స్వామిని.. గుట్టపై ఉన్నానని చెప్పడంతో ఆ బాలుడుతో ఊరి ప్రజలందరూ అక్కడికి వెళ్లారు. ఆ గుట్ట మీద పుట్టలో బిందెలతో నీళ్లు పోయగా.. ఆ స్వామి రూపాలు కనిపించాయి. ఆ రోజు నుంచి 3 నామాలతో, అక్కడ వింత వింత మహిమలు జరుగుతున్నాయి. మూడో రోజు ఓంకార నామం ఆ తర్వాత నుంచి వినాయకుడు, హనుమంతుడు, ముక్కుపుడక పెట్టుకున్న కనకదుర్గమ్మ, శివుడు అలా గడ్డపై కనిపిస్తూ ఉన్నాయి. ఆ గ్రామానికి పెద్ద అయినా జగన్నాధం నువ్వే గుడి కట్టిస్తావని చెప్పాడు. ఆ వ్యక్తి నేను కట్టించడమేమిటి అని అన్నాడు. తనకి నమ్మకం కలిగేలా అమెరికాలోని తన మనవడికి మాటల రావు అనేది చెప్పాడు. అతనికి మాటలు రప్పిస్తే.. గుడి కట్టిస్తానని వాగ్దానం చేశాడు.
బాల స్వామి వాక్కు నిజమైంది.. పిల్లాడికి మాటలు వచ్చాయి :
ఆ విషయం అతడికి తప్పా ఎవరికీ తెలియదు. అయితే, 10 లక్షలు విరాళం ఇస్తాను అని అన్నాడు. కొన్ని రోజుల తర్వాత తన భార్య చనిపోతుందని.. ఆ ఊరి ప్రజలందరికీ చెప్పాడు బాల నరసింహ స్వామి. కానీ, ఆ విషయం గుడి కట్టించిన తనకు తెలియదు. నిజంగానే.. ఆ బాలుడు చెప్పిన వాక్కు ద్వారానే ఏ సమయమైతే చెప్పాడో అదే సమయంలో వాళ్ళ భార్య మరణించింది. అప్పటి నుంచి అతడు గుడికి రావడం మానేశాడు. నేను గుడి కట్టాను అన్నాడు. అయితే, నీకు ఒక సంతోషకరమైన వార్త వినిపిస్తుంది అని చెప్పాడు. నిజంగానే ఆ బాలుడు వాక్కుగా వాళ్ల మనవడు తాతయ్య అని పిలవడం ప్రారంభించాడు. ఆ స్వామికి రెండు చేతులు జోడించి రూ. 50 లక్షలు అనడంతో ఊరి ప్రజలందరూ గుడి ధర్మకర్తగా చైర్మన్ జగన్నాధంను ఎన్నుకున్నారు. ఆ ఊరిలో అయ్యగారిని పిలిశారు.

అక్కడ దేవుడు లేడన్న అయ్యగారికి పక్షవాతం :
అయితే, అక్కడ ఏమీ లేదని చెప్పాడు అయ్యగారు. అయ్యగారితో శంకుస్థాపన చేశారు. కానీ, మరుసటిరోజు అయ్యగారికి పక్షవాత రావడం జరిగింది. ఆ ఊరి ప్రజలందరూ వాళ్ల భార్యకు చెప్పారు. అక్కడ నిజంగానే స్వామి ఉన్నాడు. నమ్మకంతో దండం పెట్టుకోండి అని చెప్పడంతో కొబ్బరికాయ కొట్టారు. అంతే.. ఇక బతకడు అన్న అయ్యగారు కాస్తా లేచి కూర్చున్నాడు. అప్పటినుంచి ప్రధాన అర్చకుడిగా అక్కడ స్వామివారికి సేవలు చేస్తూ ఉన్నాడు. ఆ బాలుడు ఆ ఊరి ఆడపడుచులు పాలపొంగలతో చెయ్యాలి. రావి చెట్టు నాటాలి. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా చేశారు. అయితే ఆ గుడిని పెద్ద కుడిలా కట్టాలని చెబుతున్నాడు..
Yarravaram Bala Ugra Narsimha Swamy : యర్రవరంలో బాల ఉగ్రనరసింహ స్వామి వింతలు..
కోరిన కోరికలను వెంటనే తీరుస్తున్న బాల నరసింహ స్వామి :
ఆ ఊరి ప్రజలు అంత కట్టాలంటే మా వల్ల కాదు స్వామి అన్నారు. ఆ బాల నరసింహ స్వామి అంతా నేనే చూసుకుంటాను.. అన్నట్లే విరాళాలు ఇస్తున్నారు. నిత్యఅన్నదానానికి కూడా ఇస్తున్నారు.. వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. కోరుకున్న కోరికలు వెంటనే తీరుతున్నాయని చెప్తున్నారు. అంత మహిమ కల్లా బాల ఉగ్ర నరసింహ స్వామి కొంగుబంగారంలా నిలుస్తున్నాడు. చరిత్రలో ఈ గుడి ప్రసిద్ధి పొందిందని ఆ బాలుడు వాక్కు రూపంలో చెప్పాడు.
సంతానం లేని వారికి సంతానం.. మాటలు రాని వారికి మాటలు.. చెవి, మూగ, కళ్ళు కనపడని వారు ఎలాంటి వ్యాధితోటైనా బాధపడేవారు అక్కడ దర్శనం చేసుకుని మొక్కుకుంటున్నారు. అలాగే వాళ్ళ కోరికలు కూడా తీరుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. స్వామివారికి పాలపొంగలతో, అభిషేకాలతో, అర్చనతో భజనలతో నిత్య అన్నదానం జరుగుతుంది. ఇంకా.. ప్రత్యేకంగా శుక్రవారం రోజు దూర ప్రాంతాల నుంచి కూడా స్థానికులు వచ్చి స్వామివారిని దర్శనం చేస్తున్నారు.. అక్కడ స్వామివారం మొదటివారం కోరుకొని అలా మూడు వారాలు తిరిగేలోపుల్ని అన్ని కోరికలు నెరవేరుతున్నాయని సంతోషంగా చెబుతున్నారు.
కోదాడకు 15 కిలోమీటర్ల దూరంలో ఆలయం :
కోదాడ మండలం యర్రవరం గ్రామంలో మత సామరస్యానికి ఆదర్శంగా గ్రామానికి చెందిన ఇద్దరు ముస్లిం పురుషులు స్వచ్ఛందంగా హిందూ దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులుగా పనిచేస్తున్నారు. యర్రవరం గ్రామం, కోదాడ పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతి శుక్రవారం దర్శనం కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి 6వేల నుంచి 7వేల మంది భక్తులు ఆలయానికి వస్తుంటారు. రూ.20 కోట్లతో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆలయానికి సంబంధించిన డిజైన్ దాదాపు పూర్తయిందని గుడి దర్మకర్త జగన్నాధం తెలిపారు. గ్రామంలోని దాదాపు 50 ముస్లిం కుటుంబాల సభ్యులు కూడా శుక్రవారం ఆలయాన్ని తప్పకుండా సందర్శిస్తుంటారు.