Attract Money Remedies : మీ ఇంటి పూజ గదిలో ఈ 10 వస్తువులు ఉంటే.. సకల దోషాలు పోయి ఐశ్వర్యం తప్పక కలుగుతుంది..!

Attract Money Remedies :  ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే అద్భుతమైన మనీ రెమడీలు మీకోసం.. మీ ఇంట్లోని పూజ గదిలో ఈ వస్తువులు ఉంటే (Money Remedies)  అనేక భోగభాగ్యాలు మీ సొంతం అవుతాయి. పూజ గదిలో ఈ 10 వస్తువులు ఉంటే.. సకల దోషాలు పోయి ఐశ్వర్యం తాండవిస్తుంది.. సహజంగా అందరూ పూజ గదిలో చిత్రపటాలు, దేవుని ఫోటోలు, విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ మంగళకరమైన వస్తువులు వల్ల అనేక ఆర్థిక ప్రయోజనాలతో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు.

నెమలి ఈకలు.. ఏ ఇంట్లో పూజ గదిలో కొన్ని నెమలి ఈకలు ఉంటాయో ఆ ఇంట్లో నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి.

ఆవు దూడ.. పూజ గదిలో ఆవు దూడ ఫోటో, విగ్రహం, బొమ్మ ఉంటే సకల దేవతల స్వరూపం గోమాత అనుగ్రహం వల్ల ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది..

(చాత్రము)… పూజ గదిలో వెండితో తయారు చేసిన గొడుగు లేదా రాగితో తయారుచేసిన చిన్న గొడుగును ఒక మూలన పెట్టుకోండి పూజ చేసేటప్పుడు ఛత్రం సమర్పయామి.. అలాగే చామరం పూజ అయిన తర్వాత చామరం తో విసురుతారు.

పచ్చ గవ్వలు.. పసుపు రంగు గవ్వలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి 9 లేదా 6 గవ్వలు ఉంటాయో ధనలక్ష్మి అనుగ్రహించి సకల సంపదలు కలిగి ఉంటారు.

Attract Money Remedies in telugu
Attract Money Remedies in telugu

పాదరసం… పాదరసం పరమేశ్వరుడు తేజస్సుకు సంకేతం పాదరసానికి చాలా శక్తి ఉంది పాదరసాన్ని రుద్ర వీర్యం పురాణాలు చెబుతున్నాయి. పాదరసం, గంధం చెక్క కలిపి ఉండాలి. ఏ ఇంట్లో గదిలో పాదరసం గంధం చెక్క కలిపి ఉంచుతారో ఆ ఇంట్లో పరమేశ్వరుడు, లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక అష్టైశ్వర్యం భోగభాగ్యాలు కలిగి ఉంటారు.

పసుపు అక్షింతలు.. పసుపు అక్షింతలు పూజ గదిలో ఉండడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. పచ్చ కర్పూరం… పచ్చ కర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతి.. పచ్చ కర్పూరంతో విష్ణుమూర్తికి హారతి ఇచ్చిన పచ్చ కర్పూరం తో నైవేద్యం పెట్టిన ఏ కోరిక కోరుకున్న వెంటనే తీరుతుంది. పూజ గదిలో పచ్చ కర్పూరం డబ్బాలో 9 యాలకులు 9 లవంగాలు వేసి పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక ఉంటుంది.

తామర గింజలు… లక్ష్మీదేవికి తామర గింజలు అంటే ఇష్టం కొన్ని తామర గింజలు తీసుకొని పూజ గదిలో పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది.

Attract Money Remedies : ఆర్థిక సమస్యలు పోవాలంటే.. మీ ఇంట్లో ఇవి ఉండాల్సిందే.. 

ముత్యాల మాల… లక్ష్మీదేవి ఫోటో కి ముత్యాల మాల అలంకరించుకోవాలి లేదా లక్ష్మీ పాదాల ముత్యాల మాలను దగ్గర పెట్టుకోవడం వల్ల లక్ష్మీ అనుగ్రహం వల్ల సిరిసంపదలు కలిగి ఉంటారు. తాంబేలు, చల్ల కవ్వం, కల్పవృక్షం, పసుపు కొమ్ములు, పసుపు, కుంకుమ, గంధం పూజ గదిలో ఉండడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.

లక్ష్మీదేవి పూజ చేసుకునేటప్పుడు వెండి, బంగారం పూలు, లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, చిట్టి గాజులు, రూపాయి నానాలు, ముత్యాలు, గోమతి చక్రాలు, పగడాలు, గురిగింజలు, పసుపు, కుంకుమ గంధంతో 108 నామావళి( ఓం మహాలక్ష్మి యే నమః) అర్చన లక్ష్మీదేవి విగ్రహానికి పసుపు జలం, కుంకుమ జలం, గంధం జలం, శుద్ధ జలం పంచామృతంతో పూలతో అభిషేకం.. ప్రతి శుక్రవారం, అమావాస్య, పౌర్ణమి రోజులలో లక్ష్మీదేవి పూజ చేస్తారు వారికి లక్ష్మీ అనుగ్రహం తో సిరి సంపదలు లక్ష్మీ కటాక్షం ధనాభివృద్ధి ఆరోగ్యం సకల సంపదలు కలిగి ఉంటారు.

ఉప్పు దీపం, గజలక్ష్మీ దీపం, కామాక్షి దీపం, అష్టలక్ష్మి దీపం, కుబేర దీపం, అఖండ దీపం, తమల ఆకులపై దీపం, పిండి దీపం, రావి ఆకులపై దీపం, ఆవు నెయ్యితో నువ్వుల నూనెతో దీపారాధన చేసి నైవేద్యం పెట్టి మీ కోరికలను సంకల్పం చేసి నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఇష్ట దైవాన్ని, కుల దైవాన్ని పూజించడం వల్ల మీరు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి లక్ష్మి దేవి అనుగ్రహం కలుగుతుంది. (Attract Money Remedies)

Read Also : Guruvinda Ginja Benefits : అష్ట దరిద్రులు కూడా కుబేరులు చేసే అద్భుతమైన పరిహారం!

Leave a Comment