Couple Relationship : ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు పెళ్లి తర్వాత గొడవలు పెట్టుకుని విడిపోయిన వారు చాలా మంది ఉన్నారు. అయితే, అలా జరగకుండా ఉండటానికి వాళ్లిద్దరు ప్రయత్నాలు చేసి ఉంటే కలిసి మెలిసి ఉండొచ్చు. కానీ, అటువంటి ప్రయత్నాలు మ్యాగ్జిమమ్ జరిగి ఉండకపోవచ్చు. కాగా, అలా కాకుండా కపుల్స్ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో కావాలి. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవనంలో ప్రతీ ఒక్కరు పని ఒత్తిడిలోనే తమ జీవితాన్ని గడిపేస్తున్నారు. ఇంటికి వచ్చినప్పటికీ వారు ఆఫీసు వర్క్ గురించి ఆలోచిస్తుంటారు. అలా చేసే వారిని మనం బోలెడు మందిని చూడొచ్చు. ఈ క్రమంలో పెళ్లి అయిన తర్వాత భార్యా కాని భర్త కాని ఆఫీసు వర్క్ ముగించుకుని ఇంటికి వచ్చిందంటే చాలు.. ఆ విషయాలన్నిటినీ మర్చిపోవాలి అని గుర్తుంచుకోవాలి.
తమ భాగస్వామితో తగు సమయం స్పెండ్ చేయాలి. భాగస్వామిని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. ఇక వర్కింగ్ ఉమన్ కాని, మెన్ కాని ఎవరైనా ఆఫీస్ వర్క్‌ను ఆఫీస్‌లోనే వదిలేయాలి. ఇంటిలోపల మ్యాగ్జిమమ్ డిస్కస్ చేయకపోవడమే మంచిది. ఒకవేళ భార్య గృహిణి అయితే కనుక భర్త రాగానే భార్య యోగ క్షేమాలను అడిగి మరీ తెలుసుకోవాలి. భార్యకు అవసరమైనపుడు పనుల్లో సాయం చేయాలి. అలా చేయడం వల్ల ఇద్దరి మధ్య ప్రేమ మరింత పెరిగి మానసకి ప్రశాంతత లభిస్తుంది. భార్యను ప్రేమించడం మాత్రమే కాదు.. ఆ ప్రేమను వ్యక్తపరచాలి కూడా.
ఇకపోతే ప్రేమను వ్యక్తపరచడానికి ముద్దు అత్యుత్తమైనదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భాగస్వామిపై ఉండే ప్రేమను భర్త కాని భార్య కాని ముద్దు ద్వారా ఈజీగా తెలియచేయొచ్చు. ప్రేమ, అప్యాయత, అనురాగం తెలపడానికి ముద్దు చాలా మంచి మార్గమని తెలుసుకోవాలి. బిజీ లైఫ్‌లో చాలా మంది అలిసిపోతుంటారు. ఈ క్రమంలో భార్యా భర్తలు ఇంటిలోపల ఉన్నపుడు గత జ్ఞాపకాలను, అనుభూతులను గుర్తు చేసుకుంటే కనుక న్యూ ఎనర్జీ వస్తుంది. భార్యా భర్తలు మొదటి సారి కలుసుకున్న సందర్భాన్ని, ఫస్ట్ కిస్, లవ్ ప్రపోజల్ డే వంటి సందర్భాలను గుర్తు చేసుకుంటే బంధం ఇంకా బలపడుతుంది.
Read Also : Wife Avoiding Husband : మీ భాగస్వామికి శృంగారంపై ఆసక్తి తగ్గుతోందా? అందుకు కారణం మీరే?