Vasthu Tips : మనలో కొందరు ఎంత ఎక్కువ కష్టపడినా ప్రతిఫలం ఉండటం లేదని బాధపడుతుంటారు. మనుషులంతా కష్టపడేది డబ్బుల కోసమే. అవే లేకపోతే మనిషి మనుగడ ఈ రోజుల్లో అసాధ్యం. ఎంత ఎక్కువ డబ్బులొస్తే అంత సుఖం, విలాసంగా లైఫ్ లీడ్ చేయొచ్చని అందరూ భావిస్తారు.కానీ సంపాదనలో కొందరు మాత్రమే అనుకున్నది సాధిస్తారు. కొందరు ఎంత కష్టపడినా, చెమటోర్చినా అనుకున్న గమ్యాన్ని సాధించలేరు. దీంతో చాలా నిరాశకు గురవుతారు. అయితే, ఇలాంటి వ్యక్తులు ధనలాభం పొందేందుకు జోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలు చేస్తే కోరుకున్నది సిద్ధించే అవకాశం ఉందని చెబుతున్నారు శాస్త్రం తెలిసిన వారు. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
లక్ష్మీ కటాక్షం మనకు త్వరగా సిద్దించాలంటే మనం ఉంటున్న ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలట.. చెత్తా చెదారం, మురికి అనేది కనిపిస్తే వెంటనే క్లీన్ చేయాలి. పనికిరాని వస్తువులు బయటపడవేస్తేనే బెటర్. అంతేకాకుండా ధనప్రాప్తి జరగాలంటే.. ధనం దాచిపెట్టే చోటుపై కూడా జాగ్రత్త తీసుకోవాలి. డబ్బు దాచే ప్రదేశం ఎప్పుడైనా ఉత్తర దిశలో ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మనం సంపాదించిన సొమ్ము అయినా వృథా కాకుండా ఉంటాయి. వేరే రకంగా కూడా ధనలాభం జరగొచ్చు.
ఇకపోతే జ్యోతిష శాస్త్రం కులాయి గురించి కూడా వివరించింది. వాటర్ ట్యాప్ లేదా ట్యాంక్ నుంచి నీరు లీక్ కాకుండా చూసుకోవాలి. దీనిని ఆ ఇంటికి అశుభంగా పరిగణించాలట.. నీటి వలే డబ్బు కూడా బయటకు వెళ్లిపోతుందని నమ్ముతుంటారు. అందుకే ఇంట్లో నీటి కులాయి లీక్ అవుతూ ఉంటే వెంటనే సరిచేయించుకోవడం బెటర్.. లేదంటే వృథా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. డబ్బు బాగా సంపాదించాలనుకునే వారు తమ బెడ్రూం తలుపునకు ఎదురుగా ఎడమవైపు ఒక ఇనుప షో పీస్‌ను ఏర్పాటు చేసుకుంటే చాలా మంచి జరుగుతుందని చెబుతున్నారు.