Life Partner : కొందరు తమ క్లోజ్ ఫ్రెండ్ వారి భాగస్వామిగా వస్తే బాగుండని ఎంతో ఆశపడుతుంటారు. అయితే, ఇలాంటి వ్యక్తులు ఓపెన్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటారు. ఎందుకంటే ఒకవేళ వారి వద్ద తమ ఇష్టం గురించి చెబితే ఉన్న స్నేహం కూడా చెడిపోవచ్చని భయపడుతుంటారు. ఒకవేళ వారు ధైర్యం తెచ్చకున్నా అప్పటికే ఆలస్యం కూడా కావొచ్చు. మీ ఫ్రెండ్‌కు వేరే వ్యక్తితో మ్యాచ్ ఓకే అవ్వడం లేదా వేరే వారితో రిలేషన్ షిప్‌లో ఉండటం జరిగిపోవచ్చు. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా వారికి కొన్ని పర్సనల్స్ ఉంటాయి. వారి రిలేషన్ సక్సెస్ అయ్యాక మీకు చెబుతామని అనుకుని ఉంటారు. కానీ అంతలోనే ఎన్నో అనర్ధాలు జరిగిపోతాయి. మీ ఆశలు కూడా ఆవిరిపోతాయి. అందుకే స్నేహితుడిని లేదా స్నేహితురాలిని మీ భాగస్వామిగా పొందాలనే ఆశ కలిగితే ఓ మంచి సందర్భం చూసి డైరెక్ట్‌గా ఓపన్ అవ్వడం చాలా బెటర్.. మీ మాటల్లో వారికి నిజాయితీ కనిపిస్తే ప్రయత్నం వృథా కాకపోవచ్చును.
ఇక బెస్ట్ ఫ్రెండ్స్‌ను భర్త లేదా భార్యగా పొందాలనుకునే మొదట ఈ రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇలా చేయడం వలన వారి మిమ్మల్ని అర్థం చేసుకుని, మీతో ఏడగుడులు నడిచేందుకు ఆసక్తి చూపిస్తారు. లేదా మధ్యలోనే మిమ్మల్ని వదిలేసి దూరంగా కూడా వెళ్లిపోవచ్చు. అందుకే ఫ్రెండ్స్‌ను భాగస్వామిగా పొందాలనుకునే వారు.. ఎప్పుడు ప్రేమను అడుకోవద్దు. ఒక్కసారి మీ అభిప్రాయం చెప్పాక మీ పని మీరు చేసుకుంటూ వెళ్లండి.. పదే పదే ప్రేమించాలని అడుక్కోవడం వలన చీప్ అయిపోతారు.
ఇక ప్రేమను వ్యక్తపరిచాక తిరిగి ప్రేమించాలని వెంట తిరగడం మానేసి మీ పనులను చేసుకుంటూ అందులో బిజీగా ఉండండి. ఊరికే వెంట తిరిగితే బాధ్యత లేదని ఖాళీగా ఉన్నావని చులకన భావం ఏర్పడుతుంది. అదేవిధంగా మీరే ముందు మెసేజ్స్ చేయొద్దు. ఒకసారి చేశాక రిప్లై వచ్చేవరకు ఎదురుచూడాలి. రోజూ మీరే ముందు చేస్తే పనిపాట లేదనుకునే అవకాశం ఉంది. అలాగే, రోజూ ఉదయాన్నే పలకరించడం మంచిదే. ఇలా చేయడం వలన వారిపై మీకు ఎంత ఆసక్తి ఉందో అర్థం చేసుకునే చాన్స్ ఉంటుంది. మరీ ఓవర్‌గా మాట్లాడినా కూడా చెడు ఇంప్రెషన్ రావొచ్చు.
అన్నింటికంటే ముఖ్యమైనది. మీ భవిష్యత్ ప్రణాళిక వారికి చెప్పండి. దానికోసం కష్టపడండి. ఖాళీ టైంలో వారితో మాట్లాడాక తిరిగి భవిష్యత్ పై ఫోకస్ పెట్టండి.. మంచి ఉద్యోగం, జీవితం పట్ల విజన్ ఉన్నవారినే అందరూ కోరుకుంటారు. ఇంట్రెస్టింగ్ మాట్లాడండి.. సెన్స్ ఆఫ్ హ్యుమర్ కూడా వాడండి. అలా అని సిల్లీ జోక్స్ వేయడం, ఇతరులపై కామెడీ చేసి మిమ్మల్ని మీరు తగ్గించుకోవద్దు. అట్రాక్టివ్ గా ఉండేందుకు, చూడగానే మీతో ఇంకొంచెం సేపు ఉంటే బాగుంటుందనుకునేలా బిహేవ్ చేయండి.. మంచి డ్రెస్సింగ్, ఫ్రెష్ నెస్ కూడా ముఖ్యమే.
Read Also : Romantic Life : మీ శృంగార జీవితం సంతోషంగా ఉండాలంటే ఇలా చేయండి.. స్వర్గంలో తేలిపోతారు..!