couple should not say frank on face these things
Couple Should Not Say : ప్రతీ ఒక్కరి జీవితంలో జరిగే అపురూపమైన ఘట్టం పెళ్లి. కాగా మ్యారేజ్ తర్వాత దంపతులు ఇద్దరు జీవితాంతం లైఫ్ లీడ్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఒకరికి మరొకరు తోడుగా ఉంటూ ప్రతీ విషయమై అవగాహన పెంచుకోవాలి. ఇకపోతే సర్దుకుపోవడాలు అలవాటు చేసుకోవాలని, అలా అయితేనే జీవితం సాఫీగా సాగుతుందని పెద్దలు చెప్తుంటారు. అది ముమ్మాటికి నిజం. ఇకపోతే దంపతుల్లో కొన్ని విషయాలు నేరుగా మొహం మీద చెప్పకూడదు. అవేంటో ఈ స్టోరి చదివి తెలుసుకుందాం.
భార్యా భర్తలు ఇద్దరు కూడా భాగస్వాములుగా ఉండాలి తప్ప ఒకరిపైన మరొకరు అజమాయిషీ చెలాయించాలని అనుకోకూడదు. ఒకరిని కంట్రోల్ చేయడానికి మరొకరి వద్ద రిమోట్ ఉండాలని అనుకోకూడదు. భార్యా భర్తలు ఇద్దరి అభిరుచులు, ఆదర్శాలు, అభిప్రాయాలు ఒక్కటిగా ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఒకరి అభిప్రాయాలను మరొకరు భావించుకోవాలి. ఒకరి ఆదర్శలను మరొకరిపై రుద్దాల్సిన అవసరం లేదు. భర్తలను మార్చాలని భార్యలు, భార్యలను మార్చాలని భర్తలు అనుకోవాల్సిన అవసరం లేదు. అలా అనుకుంటే గొడవలు స్టార్ట్ అయి విభేదాలు ఇంకా తారాస్థాయికి పెరగొచ్చు.
సానుభూతి, సహకారం అనేవి చాలా ముఖ్యమని భార్యా భర్తల మధ్య చాలా ముఖ్యమని గుర్తించాలి. దంపతుల్లో ఎవరైనా మొహం మీదనే అందరి ముందర తమ లోపాలను బయటపెట్టొద్దు. అలా చేయడం వల్ల బాధ కలిగి ఇంకా గొడవలు పెరుగుతాయి. సమస్యలు ఏవైనా వారు డిస్కస్ చేసుకోవాలే తప్ప అందరి ముందర చులకన చేయొద్దు. ఇకపోతే చాలా మంది భార్యా భర్తల్లో ఎవరో ఒకరు తమ మాటే నెగ్గాలని పట్టు పడుతుండటం మనం చూడొచ్చు. అలా చేయడం వల్ల అప్పటి వరకు పంతం నెగ్గుతుంది. కానీ తర్వాత ఆ విషయమై ఇంకొకరు బాధపడటంతో పాటు దానినే మనసులో పెట్టుకుని ఉంటారు.
పంతాలొద్దు.. సర్దుకుపోండి :
అది ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చే ప్రమాదముంటుంది. కాబట్టి పంతాలకు పోకుండా సర్దుకుపోవాలి. సర్దుకుపోగల నైపుణ్యం అతిముఖ్యమని గుర్తించాలి. ఇకపోతే విమర్శలను తట్టుకోగలగాలి. విమర్శను తట్టుకోకపోవడం వల్ల సమస్యలు ఇంకా జఠిలమవుతాయి. అయితే, ప్రతీ చిన్న విషయాన్ని విమర్శిచాల్సిన అవసరం లేదు. హేతుబద్ధంగా ఆలోచించిన తర్వాతనే విమర్శ చేయాలి. అలా చేసినపుడే విమర్శను స్వీకరించగలుగుతారు. సాధారణంగా పొగడ్తతో మనుషులు ఎంత ఉప్పొంగుతారో గాయపరిస్తే అంతే స్థాయిలో కుంగిపోతారని భార్యా భర్తలిద్దరూ గుర్తించాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి. భార్యా భర్తల్లో ఎవరు తప్పు చేసినా వాటిని మొహం మీదనే చెప్పొద్దు.
ఇకపోతే తమ తప్పుల్ని ఒప్పుకునే అక్షణం ఇద్దరూ కలిగి ఉండాలి. తప్పు చేయలేదని తప్పించుకునే ప్రయత్నం అస్సలు చేయొద్దు. తప్పు కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నం చేయడం వల్ల భవిష్యత్తులో నష్టం కలుగుతుందన్న సంగతి గ్రహించాలి. ఇకపోతే వంటలు కాని లేదా ఇతర ఏదేని స్వీట్స్ చేసిన సమయంలో బాగున్నపుడు అందరి ముందు భార్యను భర్త ప్రశంసించాలి.
ఒకవేళ బాగలేకపోతే నేరుగా వెంటనే చెప్పాల్సిన అవసరం లేదు. బాగానే ఉన్నాయని చెప్పాలి. అతిథుల ముందర భార్య వంటలు బాగా చేయలేదని చెప్పొద్దు. తర్వాత చెప్పడం వల్ల భార్యా భర్తల బంధం ఇంకా బలపడే చాన్సెస్ ఉంటాయి. కాబట్టి భార్యా భర్తలు ఈ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. భార్యా భర్తలు ఇద్దరు ఒకే అభిరుచి కలిగి ఉండాల్సిన అవసరం లేదు.
అలా చేయమని బలవంతం చేయొద్దు :
ఈ సమయంలో ఎవరో ఒకరు అభిరుచి విషయంలో ఆర్గుమెంట్ చేసినపుడు వాటిని గురించి వినాలి. అభిరుచిని మార్చుకోవాలని భాగస్వామిని బలవంతం చేయాల్సిన పని లేదు. ఎవరి అభిరుచులు వారికి ఉంటాయన్న సంగతి గుర్తుంచుకోవాలి. అయితే, ఆయా అభిరుచులను మరొకరి కోసం త్యాగం చేయాల్సిన సందర్భం వస్తే అలా చేస్తేనే మంచిది. ఏదేని విషయమై డిస్కషన్ జరిగినపుడు భార్యా భర్తలు ఇద్దరు కూడా అందులో పాల్గొని ఎవరి వాదనను వారు వినిపించాలి.
అలా వినిపిస్తున్న క్రమంలో ఒకరిపైన మరొకరు అరవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా భర్తలు భార్యల మీద దబాయించాల్సిన అవసరం లేదు. సున్నితంగానే తమ వాదనను వినిపించి, అది గెలిచేందుకు గల కారణాలను వివరించాలి. భార్య లేదా భర్త ఎదుటి వారి పరిస్థితిని అర్థం చేసుకోగలగాలి. అలా అర్థం చేసుకుంటేనే అన్యోన్య దాంపత్యం కొనసాగుతుంది. లేదంటే కష్టాలు ఎదురవుతాయి.
కోపంతో వద్దు.. ప్రేమే ముద్దు :
ఇక ఏదేని విషయం నచ్చనపుడు వెంటనే భాగస్వామికి కోపంగా చెప్పొద్దు. అలా చెప్పడం వల్ల భాగస్వామి బాధపడిపోయి ఎదుటి వ్యక్తిలో గల లోపాలను అన్వేషించే ప్రయత్నం చేస్తాడు. అలా భార్యా భర్తలు ఇద్దరు కూడా ఒకరి లోపాలను మరొకరు వెతుక్కునే పనిలోనే పడిపోతారు. ఫలితంగా సమస్య ఇంకా జఠిలమవుతుంది. ఈ నేపథ్యంలో కూర్చుని మాట్లాడుకుని సర్దుబాటు చేసుకునేందుకు ప్రయత్నించాలి.
అలా చేయడం వల్ల సమస్యలు ఇట్టే పరిష్కరించబడతాయి. మనస్పర్థలు ఒకసారి వచ్చాయంటే అవి విభేదాలుగా మారి విడిపోయేంత అగాధాన్ని మీలో సృష్టిస్తాయి. కాబట్టి భార్యా భర్తలు ఇద్దరు కూడా కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అలా చేస్తేనే భార్యా భర్తల మధ్య ఎటువంటి గొడవలు రాకుండా జీవితం సాఫీగా సాగిపోతుంది. సర్దుకుపోయే గుణాన్ని ఇద్దరూ కలిగి ఉంటే చాలా మంచిది.
Read Also : Star Anise Benefits : అనాస పువ్వుతో అన్ని రోగాలకు చెక్ పెట్టొచ్చట.. నిజంగా సూపర్ కదూ..!
Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More
Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More
Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More
Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More
Sky Fruit : స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More
Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More
This website uses cookies.