Kodiguddu Vellulli Karam : కోడిగుడ్డుతో వెల్లుల్లి కారం ఎప్పుడైనా తిన్నారా? నోటికి ఏది తినాలని అనిపించనప్పుడు పుల్లపుల్లగా స్పైసీగా తినాలనిపిస్తుంటుంది. అలాంటప్పుడు కోడిగుడ్డు వెల్లుల్లి కారంతో ఇలా రెసిపీని తయారుచేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం తినడానికి పుల్లపుల్లగా కారం కారంగా చాలా కమ్మగా ఉంటుంది. వేడివేడి అన్నంలో తింటే మాత్రం టేస్ట్ అదిరిపొద్ది. కోడిగుడ్డుతో వెల్లుల్లి కారాన్ని ఎలా తయారుచేసుకోవాలో తెలుసా? ముందుగా ఒక పాన్ తీసుకోండి. అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 5 గుడ్లని పగలగొట్టి వేసుకోండి. ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టి గుడ్లు పగలగొట్టి వేసుకోవాలి. గుడ్ల పైనా లైట్‌గా పసుపు చల్లుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా గుడ్లపై చల్లుకోండి.
కారాన్ని కూడా గుడ్లపై చల్లేసి ఫ్లేమ్ లో ఫ్లేమ్‌లోనే పెట్టి బాగా కాలేవరకు అలానే ఉంచండి. కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పాలి. మిక్సీ జార్‌లో మీడియం సైజు వెల్లుల్లి తీసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్‌లో వెల్లుల్లిపాయలతో పాటు 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. జీలకర్ర టీ స్పూన్ తీసుకోవాలి. ధనియాలు టీ స్పూన్, చిటికెడు మెంతులు చాలు. కాస్త పులుపు కోసం కొద్దిగా చింతపండు వేస్తే సరిపోతుంది. రుచికి సరిపడా కల్లు ఉప్పు వేసుకోండి. ఇప్పుడు అన్నింటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. వేగిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. రెండో వైపు తిప్పి లైట్‌గా వేగనివ్వాలి.

ఇప్పుడు రెండో వైపు కూడా లైట్‌గా వేగిన తర్వాత పెద్ద ముక్కలుగా ఉండేలా తుంచేసుకోండి. ఆ తర్వాత ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి నిమిషం వేయించుకోవాలి. బాగా వేగితే స్మెల్ రాదు. సిమ్‌లో పెట్టి రెండు నిమిషాలు వేగిన తర్వాత ముక్కలు అన్నింటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పోపు పెట్టుకొని మరో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ గుడ్డు కారానికి కొద్దిగా ఆయిల్ పడుతుంది. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి.
ఈ పోపు దినుసులు వేగిన తర్వాత రెండు ఎండు మిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. కరివేపాకు వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం మొత్తం వేసుకోవాలి. ఫ్లేమ్ లో ఫ్లేమ్‌లోనే ఉంచి బాగా కలుపుకోవాలి. వెల్లుల్లి కారం కాస్త వేగిన తర్వాత ఈ గుడ్డు మిశ్రమాన్ని వేసుకోవాలి. లో ఫ్లేమ్‌లోనే ఉంచి రెండు నిమిషాలు బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఈ వెల్లుల్లి కారం మొత్తాన్ని గిన్నెలోకి తీసుకుంటే చాలు.. వేడివేడిగా అన్నం పెట్టుకొని కోడిగుడ్డు వెల్లుల్లి కారం వేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది.