Chicken Dum Biryani : చికెన్ బిర్యానీని ఇంట్లో రెగ్యులర్‌గా చేసే స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మసాలా చేసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి. ఒక బిర్యానీ ఆకు కొంచెం రాతి పువ్వు, రెండు స్పూన్ల ధనియాలు, ఒక స్పూన్ మిరియాలు, అర స్పూన్ సోంపు, అర స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 2 మరాఠీ మొగ్గలు, 2 మిరియాలు, పావు స్పూను సాజీర, ఆరు ఏడు యాలకులు, చిన్న జాజికాయ ముక్క, చిన్న జాపత్రి, ఒక అనాస పువ్వు, చిన్న దాల్చిన చెక్క వేసి మంటలో ఫ్లేమ్ లో ఉంచి గ్రైండ్ చేసినప్పుడు ఈజీగా నలిగేలా 2నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి.
ఏమాత్రం మాడిన బిర్యాని రుచి అంతా పాడైపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయిలో ఉల్లిపాయ ముక్కలు వేయించడానికి సరిపడినంత నూనె పోయాలి. నూనె కాగిన తర్వాత సన్నగా పొడవుగా ఒకే సైజులో కట్ చేసిన 2 ఉల్లిపాయల ముక్కలు వేసి మంట హై ఫ్లేమ్ లో ఉంచి కంటిన్యూగా కలుపుతూ వేగనివ్వాలి. ఉల్లి పాయలను మాడకుండా మంచి గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత జాలీ గరెటతో వేసి గట్టిగా ఒత్తి నూనె అంతా తీసేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి.
చక్కగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న ముప్పావు కిలో చికెన్ తీసుకోవాలి. అరకప్పు పెరుగు 2 నుంచి 3 స్పూన్ల వరకు కారం, రుచికి సరిపడా ఉప్పు, పావు స్పూన్ పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసి వేయించిన ఉల్లిపాయల్ని చేత్తో క్రష్ చేసి వేసుకోవాలి. మసాలాలు తక్కువ తినేవాళ్లు మసాలా పొడి తగ్గించి వేసుకోవచ్చు. తినే కారాన్ని బట్టి నాలుగైదు పచ్చిమిర్చిలు ముక్కలు కూడా వేసుకోవచ్చు. పెద్ద నిమ్మకాయని తీసుకొని అర చెక్క నిమ్మరసం పిండాలి.
ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేలా బాగా కలిపి గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గిన్నెలో బాస్మతి బియ్యం 3 కప్పులు తీసుకొని నీళ్లు పోయాలి. బాగా కడిగి అరగంట పాటు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. అరకిలో తీసుకుంటే ముప్పావు కిలో వరకు చికెన్ తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయిలో ఉల్లిపాయలు వేయించుకున్న నూనెలో ఏడు ఎనిమిది స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. వేడిక్కిన తర్వాత అందులో చికెన్ వేసి మంట హై ఫ్లేమ్‌లో ఉంచి రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి.

చికెన్‌లో నీళ్లు బయటకు రాగానే మూత పెట్టి మంటలో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసి 15 నిమిషాల పాటు నెమ్మదిగా ఉడకనివ్వాలి. అడుగు అంటకుండా మధ్యమధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. 15 నిమిషాల తర్వాత మూత తీయాలి. చక్కగా ఉడికినప్పుడు 3 పచ్చిమిర్చిల మొక్కలు సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా కూడా వేయాలి. ఒకసారి బాగా కలిపి కూరలో ఈ మాత్రం గ్రేవీ ఉన్నప్పుడు స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి. కూర మరి డ్రైగా అయిపోతే.. బిర్యానీకి దమ్ పెట్టినప్పుడు నీరు సరిపడినంత ఉండకపోవడం వల్ల అన్న సరిగా ఉడకదు.
Chicken Dum Biryani : బాస్మతి బియ్యంతో చికెన్ ధమ్ బిర్యానీ..
ఈ మాత్రం గ్రేవీ ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత మరో గిన్నెలో మనం తీసుకున్న బియ్యానికి తగినంత ఎసరు పెట్టి ఈ నీళ్ళని రుచి చూసినప్పుడు బాగా ఉప్పగా ఉండే విధంగా ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే రెండు బిర్యానీ ఆకులు, ఒక నల్ల యాలకలు, చిన్న జాపత్రి, ఒక మరాఠీ మొగ్గ, ఒక అనాస పువ్వు, 4 లవంగాలు, 3 యాలకులు, 1/4 స్పూను షాజీరా, ఉల్లిపాయలు వేయించిన నూనె ఒక స్పూన్ వేసి నీళ్లను మరగనివ్వాలి. ఇప్పుడు మరుగుతున్న నీళ్లలో నానబెట్టిన బియ్యాన్ని వేసి మంట హై ఫ్లేమ్‌లో ఉంచి ఒకసారి కలిపి ఉడకనివ్వాలి.
అన్నం 80శాతం ఉడికిన తర్వాత గంజి రాకుండా జాలిగెరతో వడకట్టి ఈ అన్నాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. నేరుగా బిర్యానీ గిన్నెలో అయినా సర్దుకోవచ్చు. ఇప్పుడు బిర్యానీ వండడానికి స్టవ్ మీద గిన్నె పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసి కుక్ చేసి ఉంచుకున్న చికెన్ గ్రేవీతో పాటుగా అడుగున ఒక లేయర్‌గా వేసుకోవాలి. ఇలా ఒకవేళ గ్రేవీ సరిపడినంత లేకపోతే అన్నం ఉడికించిన గంజి పావుకప్పు వరకు వేసుకోవచ్చు. చికెన్ పైన అన్నాన్ని ఒక లేయర్‌గా వేసి కొద్దిగా కొత్తిమీర పుదీనా వేయించిన ఉల్లిపాయలు వేసి మళ్లీ దానిపైన చికెన్ గ్రేవీతో పట్టుకొని మరో లేయర్‌గా వేసుకోవాలి.
ఇదే విధంగా.. అన్నం, పుదీనా, కొత్తిమీర వేయించిన ఉల్లిపాయలు వేసిన తర్వాత చివరిగా ఫ్లేవర్ కోసం పాలలో నానబెట్టిన కుంకుమపువ్వు కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి. మొగలి పువ్వుల నుంచి తయారు చేసే ఈ కేవడా వాటర్ బిర్యానీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు మూత పెట్టి ఆవిరి బయటకు పోకుండా హోల్ ని క్లోజ్ చేసి దీని మీద ఏదైనా బరువు పెట్టి మంట లో ఫ్లేమ్ లో ఉంచి నెమ్మదిగా ఉడకనివ్వాలి. దాదాపు 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత వెంటనే మూత తీయకుండా 5 నిమిషాల పాటు అన్నం సెట్ అయ్యేవరకు వదిలేసి ఆ తర్వాత మూత తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి.