Bendakaya Pachadi : బెండకాయలతో ఎప్పుడు చేసుకునే పులుసు వేపుడు కాకుండా పుల్లగా కారంగా నోటికి ఎంతో రుచిగా బెండకాయ పచ్చడి పులుసు వేపుడు బోర్ కొడితే ఓసారిలా పచ్చడి ట్రైచేయండి వేడివేడిఅన్నంతో అద్ధిరిపోతుంది ఎలా చేయాలో చూద్దాం… పెద్ద వాళ్ళు మాత్రమే కాకుండా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తిని ఈ బెండకాయ పచ్చడి.
కావలసిన పదార్థాలు : బెండకాయలు 1/3 కిలో, మెంతి గింజలు 10,15,ధనియాలు 2 స్పూన్ల, జీలకర్ర 1/2 స్పూను,ఎండుమిర్చి 15, నూనె, టమాటాలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, చింతపండు, ఆవాలు 1 స్పూన్, పచ్చిశనగపప్పు 1 స్పూన్, మినప్పప్పు 1 స్పూన్, కరివేపాకు..
తయారీ విధానం : స్టవ్ మీద కడాయిలో ఒక స్పూన్ నూనె కాగిన తర్వాత 10, 15 వరకు మెంతి గింజలు అర స్పూను జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. అందులో మీరు తినగల కారాన్ని బట్టి 15 వరకు ఎండుమిర్చిలను కట్ చేసి వేసుకోవాలి. మంట లో ఫ్లేమ్ లో ఉంచి కలుపుతూ వేగనివ్వాలి. ఇవి మంచి రంగులోకి వేగిన తర్వాత ఒక ప్లేట్ లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక స్పూన్ నూనె వేసి పావు కిలో బెండకాయల్ని కడిగి తడి లేకుండా ఆరబెట్టి కట్ చేసుకున్న ముక్కలు వేసి మంట మీడియం ఫ్లేమ్ లో ఉంచి కలుపుతూ వేయించాలి. ఆ తర్వాత తక్కువ మంట మీద వేస్తే దేంట్లో జిగురు ఎక్కువ వచ్చేసి పచ్చడి కూడా మరీ జిగురు జిగురుగా అనిపిస్తుంది కాబట్టి ఎక్కువ మంట మీద వేయించుకోవాలి.

అలాగే ఇవి వేగడానికి ఒక స్పూన్ నూనె సరిపోనట్లయితే మరో స్పూన్ నూనె వేసి వేయించుకోవాలి. ఇలా చక్కగా పొడిపొడిగా వేగిన వేటిని పక్కన పెట్టుకోవాలి. కడాయిలో మరో స్పూన్ నూనె వేసి రెండు టమాటాలని సన్నగా కట్ చేసిన ముక్కలు పావు స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్ లో ఉంచి నెమ్మదిగా మగ్గనివ్వాలి. అయితే ఇది అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ముక్కలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలు అన్ని వేసి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా చింతపండు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఇందులో వేయించిన బెండకాయ ముక్కలు టమాటాలు కూడా వేసి కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరీ మెత్తగా ఉన్నట్లయితే బంకలో ఉండి టేస్ట్ కూడా అంతగా బాగుండదు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత తాలింపు కోసం కడాయిలో ఒక స్పూను నూనె వేసి కాగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు వేసి కొద్దిసేపు వేగనివ్వాలి ఆ తర్వాత ఒక ఎండు మిర్చిని కట్ చేసిన ముక్కలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసి అన్ని వేగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి ఈ పోపులో తయారు చేసుకున్న పచ్చడి వేసి కలపాలి. ఎంతో రుచికరమైన బెండకాయ పచ్చడి..