Categories: AyurvedamLatest

Ayurvedic Remedies : వాస‌నను కోల్పోయారా ? ఈ ఆయుర్వేద చిట్కాలను ఓసారి ట్రై చేసి చూడండి

Advertisement

Ayurvedic remedies to treat loss of smell : స్మెల్.. ఇది కేవలం శరీరంలో ముక్కు మాత్రమే సంబంధించిన విషయం. ముక్కుకు ఇంపుగా ఉంటే అది సువాసన అని పిలుస్తుంటారు. మనలో కొందరు వాసనను గుర్తించలేరు. ముఖ్యంగా వంటకాల విషయంలోనూ అంతే. కొందరైతే ఎక్కడ ఏం స్పెషల్ వండుతున్నారో కేవలం వాసన చూసే చెప్పేస్తారు.

అలా కొందరి ముక్కు షార్ప్ గా పనిచేస్తుంది. మరి కొందరు ఎక్కువ వాసన వస్తున్నా వాటిని పసిగట్టలేరు. దీని వల్ల ఇష్టమైన ఫుడ్‌ను వాసన చూడకుండా, ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఇలా కొంత మంది వాసనను పీల్చగల గుణాన్ని కోల్పోతున్న పరిస్థితి ఎక్కువగా ఉంటుంది.
Dangerous Zodiac Signs : ఈ రాశి మీదేనా? వీరికి హార్ట్ ఎటాక్స్ ఎక్కువగా వస్తాయట.. మీ రాశి ఉందో చెక్ చేసుకోండి

వాసనను ఎంజాయ్ చేయలేక మామూలుగానే ఆహారాన్ని తినేస్తుంటారు. ఇలా వాసనను పీల్చే శక్తి కోల్పోయిన వారు చావుకు దగ్గరగా ఉన్నట్లేనని అంటున్నారు కొందరు పరిశోధకులు. పరిశోధించి మరీ ఈ విషయాన్ని తేల్చి చెప్పారు. మన శరీరంలో వాసనను పీల్చే గుణం కేవలం ముక్కుకు మాత్రమే ఉంది. ఒక వేళ ఆ గుణాన్ని ముక్కు కోల్పోతే కొద్ది సంవత్సరాల్లోనే సదురు వ్యక్తి మృతి చెందడం ఖాయమని వారి పరిశోధనలో తేలింది.

ఈ హోం రెమెడీలు ట్రై చేశారా? :
ముక్కు వాసన గుర్తించే శక్తిని కోల్పోయినపుడు ఆశక్తిని తిరిగి పొందడానికి కొన్ని చికిత్స, చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. అందులో హోం రెమెడీస్ ఒకటి. మనం కోల్పోయిన వాసన గుణాన్ని దీని ద్వారా తిరిగి పొందవచ్చు. నిజానికి మీ ముక్కు వాసన చూడగల శక్తిని కోల్పోతే ఆ పరిస్థితిని ‘అనోస్మియా’గా పిలుస్తారు. వాసన ఎక్కువగా, ఘాటుగా ఉన్నా.. వాసన గ్రహించలేకపోవడాన్ని అనోస్మియాగా పిలుస్తుంటారు. వాసనను గ్రహించగలిగే నరాలు దెబ్బతినడం వల్ల మెదడుకు సరిగ్గా సిగ్నల్స్ అందకుండా పోతాయి. దీని వల్ల వాసనను గుర్తించడం సాధ్యం కాదు.

కొందరిలో ఇవి తాత్కాలికంగా కనిపించినా.. మరికొందరిలో శాశ్వతంగా ఉంటాయి. దీని వల్ల భవిష్యత్తులో అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. జలుబు, కాలుష్యం, ఒత్తిడి, క్యాల్షియం, విటమిన్స్, జింక్ లోపాల కారణంగా వాసనను గ్రహించేశక్తిని కోల్పోతుంటారు. తలకు గాయాలు కావడం వలన సైతం వాసనను గుర్తించే శక్తిని కోల్పోయే అవకాశం ఉంది.
First Night Milk Secret : ఫస్ట్‌నైట్ రోజు పాలే ఎందుకు తాగాలి.. అందులో ఉన్న సీక్రెట్ ఏంటి?

ఈ తరహా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న వారు సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకోగలగాలి. లేదంటే మరిన్ని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే చాన్స్ ఉంది. వాసన గుర్తించే శక్తిని తిరిగి పొందడానికి పలు ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

వెల్లుల్లితో వాసన తిరిగి వస్తుంది :
ఆముదంలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల వాసన గ్రహించే శక్తిని తిరిగి పొందే చాన్స్ ఉంది. ఆముదానికి సంబంధించిన ఒక్కో నూనె చుక్కను ముక్కులో వేసుకోవాలి. పొద్దున్న, రాత్రికి నిద్రపోయే సమయానికి ముందర చుక్క ఆముదాన్ని ముక్కులో వేసుకుంటే ఫలితం ఉంటుంది.

వెల్లుల్లిలోనూ యాంటీ మైక్రోబయల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. దీని వల్ల నాజల్‌ప్యాసేజ్ క్లియర్ అవడమే కాకుండా తిరిగి వాసనను సైతం పొందేలా హెల్ప్ చేస్తుంది. వెల్లుల్లిని నీటిలో మరగబెట్టి దాన్ని రోజుకు రెండు సార్లు తాగితే కాస్త ఫలితం కనిపిస్తుంది.

అల్లం సైతం ఉపయోగపడుతుంది. బాగా మరిగిన నీటిలో కాస్త అల్లం ముక్కను వేసి మరింత మరిగించాలి. తర్వాత దానితో ఆవిరిపడితే నాజల్‌ప్యాసేజ్ శుభ్రమవుతుంది. వాసనతో పాటు రుచినిసైతం గుర్తించొచ్చు. దాల్చిన చెక్క పౌడర్‌తో కొద్దిగా హనీ కలిపి నాలుకపై రాయాలి. లేదంటే నీటిలో కలుపుకుని తాగాలి. దీని వల్ల సైతం మంచి ఫలితం కనిపిస్తుంది.
Best Yoga Poses : అధిక బరువు తగ్గాలంటే ఈ యోగాసనాలు బాగా పనిచేస్తాయి ? ఏ సమయంలో మంచిదంటే?

ఆవిరిపట్టడం వల్ల సైతం వాసనను గుర్తించే శక్తిని తిరిగి పొందొచ్చు. నీరు బాగా మరిగిన తర్వాత.. ఆవిరి బయటకు పోకుండా నిండా దుప్పటి కప్పుకుని ఆవిరి పడితే వాసనను తిరిగి గ్రహించవచ్చు. యాలకులు సైతం వాసనను గుర్తించే శక్తిని తిగిరి పొందేందుకు సహాయపడతాయి. అందుకే ఆహారపదార్థాల్లో యాలకులకు స్థానం ఇవ్వడం ముఖ్యం. దీని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇక చివరగా నిమ్మకాయలు.

లెమన్‌జూస్‌లో ఉంటే సిట్రస్ ముక్కుపై ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. నిమ్మకాయల తొక్కలు లేదా నిమ్మకాయ రసాన్ని ఉదయం పూట.. సాయంత్రం పూట వాసన చూస్తే మంచి ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు నిపుణులు.

ఈ చిట్కాలు పాటిస్తే చాలు :
పైన చెప్పిన చిట్కాలు పాటించడం వల్ల మనం కోల్పోయిన వాసనను గుర్తించే శక్తిని తిరిగి పొందవచ్చు. కానీ కొందరు ఇవి పాతకాలం చిట్కాలు అని, వీటి వల్ల ఉపయోగం ఉండదని కొట్టిపారేస్తారు. కానీ నిజానికి ఇవి ఆయుర్వేదంలో భాగంగా వెలుగులోకి వచ్చాయని కొందరి అభిప్రాయం. వీటితో తప్పనిసరిగా ఎంతో కొంత ఫలితం తప్పకుండా ఉంటుంది. అయినా వీటితో ఫలితం లేకపోతే తప్పని సరిగా వైద్యుడిని సంప్రదించాలి. లేదంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది.

మీరే కాకుండా మీ ఇంట్లో వారు, బంధువులకు, స్నేహితులు ఎవరైనా వాసనను పసిగట్టే శక్తిని కోల్పోతే ముందుగా ఈ చిట్కాలు వారికి సూచించండి. చిట్కాలను పాటించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.

మోతాదుకు మించి వీటిని వాడితే కొంత ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది. మరి ఇలాంటి సమస్యను మీరెప్పుడైనా ఎదుర్కొన్నారా? ఇలాంటి చికిత్సను ట్రై చేశారా? చేయకపోతే ఇలాంటి సమస్య ఎదురైనప్పడు వీటిని ట్రై చేసి చూడండి. రిజల్డ్ మీరే చెబుతారు. మరో ఆర్టికల్‌తో మరిన్ని చిట్కాలను మీ ముందు ఉంచేందుకు ప్రయత్నం చేస్తాం.
Wife Dispute Husband : భర్తతో గొడవలు రాకుండా ఉండాలంటే భార్య ఏం చేయాలి?

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Anjeer : అంజీర్ పండ్లలో అసలు రహస్యమిదే..!

Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More

6 months ago

Mango Health Benefits : మామిడి పండ్లు మాత్రమే కాదు, కాయలు తింటే ఏంలాభం!

Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More

6 months ago

Atibala plant Benefits : అతిబల మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More

6 months ago

Aloo curry : ఈ సీజన్ లో రైస్ రోటి లోకి అద్ధిరిపోయే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఆలూతో ఇలా ఓసారి ట్రైచేయండి.

Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More

6 months ago

Sky Fruit : ఈ ఫ్రూట్ తింటే మధుమేహం పరార్.. ఆయుర్వేదంలో దివ్యౌషధం…

Sky Fruit :  స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More

6 months ago

Graha Dosha Nivarana : స్త్రీ శాపం, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు, గ్రహణ దోషాల పరిహారానికి ఈ దానం చేసి ఈ మంత్రం పఠించండి..

Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More

6 months ago