Entertainment

Dangerous Zodiac Signs : ఈ రాశి మీదేనా? వీరికి హార్ట్ ఎటాక్స్ ఎక్కువగా వస్తాయట.. మీ రాశి ఉందో చెక్ చేసుకోండి

Advertisement

Dangerous Zodiac Signs : రాశి ఫలాలు అనేవి తప్పనిసరిగా ప్రతీఒక్కరి జీవితాలను ప్రభావితం చేస్తాయని జ్యోతిష్కులు, పండితులు స్పష్టంచేస్తున్నారు. అయితే, ఇవి కొన్ని సందర్భాల్లో మంచి చేస్తాయని మరికొన్ని సందర్భాల్లో నెగెటివ్ సంకేతాలిస్తాయని వారు సెలవిచ్చారు. వాస్తవానికి ఓ వ్యక్తి పుట్టిన సంవత్సరం, తేది, గడియల ఆధారంగా అతని ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి రోగ నిర్ధారణ అంచనా వేయలేమనేది సత్యం.

కేవలం అతని వ్యక్తిత్వాన్ని బట్టి, ఎవరి జీవితాన్ని వారు జాగ్రత్తగా చూసుకోవడం మీదే శారీరక, మానసిక ఆరోగ్యం, బాధ, సంతోషం ఆధారపడి ఉంటాయి. జీవితంలో మీకు ఎదురయ్యే ఇబ్బందులు, ఇతరులతో ఏర్పడే పరిచయాలు, ఆఫీసులో పనివేళలు, టెన్షన్స్ అనేవి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఈ విషయంలో ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. 

మేష రాశి : మేష రాశి వారికి ప్రధానంగా తల, మెదడు, మొహంతో సంబంధం కలిగి ఉంటారు. వీరికి మూడో నేత్రం చాలా శక్తి వంతంగా ఉంటుంది. మేషరాశి వారి చక్రం అంగారకుడి ద్వారా పాలించబడుతుందని చెబుతున్నారు. ఈ కారణాల వల్లే మేషరాశి కలిగిన వారికి అధికంగా తలనొప్పి, గుండె నొప్పులను ఎదుర్కొనే అవకాశం ఉంది. వీరు మానసిక ఒత్తిడిని ఎక్కువగా కలిగి ఉంటుంటారు. ఈ వ్యక్తుల మెదడు అన్నివేళలా విపరీతమైన ఆలోచనలు చేస్తుంటుంది. ఈ రాశి వారు ఎక్కువగా ఒత్తిడికి గురైన సమయంలో జుట్టు ఎక్కువగా రాలే సమస్యలను కూడా ఎదుర్కొంటారు.

వృషభ రాశి : వృషభ రాశి వారు మెడ, గొంతు, చెవులతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటారు. ఈ రాశి చక్రం ప్రధానంగా గొంతుపై శక్తి వంతంగా ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో వీరు ఎక్కువగా థైరాయిడ్ , ENTకి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటుంటారు. అందుచేత వృషభరాశి కలిగిన వ్యక్తులు ఎక్కువగా గొంతునొప్పి, జలుబు, చెవినొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటారు. కారణం ఎంటంటే వృషభ రాశి వారు హఠాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడం జరగుతుంటుంది. అందువల్లే వీరు థైరాయిడ్ గ్లాడ్‌ వంటి సమస్యల బారిన పడుతుంటారు.

మిథున రాశి : మిథున రాశి వారికి ముఖ్యంగా శరీరంలోని ఊపిరితిత్తులు, చేతులు, భుజాలతో ముడిపడి ఉంటుంది. వివరంగా చెప్పాలంటే ఊపిరితిత్తులపై ఈ రాశి చక్రం శక్తివంతంగా ప్రభావం చూపవచ్చును. అందువల్లే మిథున రాశి కలిగిన వారు శ్వాస సంబంధిత సవాళ్లను ఎదుర్కొనవచ్చను. ఈ వ్యక్తుల్లో సాధారణంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీంతో జలుబు, జ్వరం వంటి సమస్యలు తరచు ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. ఈ రాశి వారి నాడీ వ్యవస్థ ప్రభావితం అవ్వడం ఆందోళన కలిగించే అంశం.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి కడుపు, ఛాతితో ఎక్కువగా సంబంధం ఉంటుంది. వీరు భావోద్వేగ భరితులు. త్వరగా డిప్రెషన్‌కు గురయ్యే ఆస్కారం ఎక్కువగా ఉంది. వీరు ఒకవేళ ఒత్తిడికి గురైతే బాగా తింటారు. అందువల్ల కర్కాటక రాశి వారికి జీర్ణ సమస్యలకు అధికంగా గురయ్యే చాన్స్ ఉంది. అయితే, ఈ రాశి వారు ఎప్పుడూ తమకు అనుకూలమైన ప్రదేశంలో ఉండేందుకు ఇష్టపడతారు. అక్కడే వీరు సురక్షితంగా ఉండగలరు. వీరే ప్రాంతాల్లో ఉండటానికి అస్సలు సుముఖత చూపించరు.

సింహరాశి : సింహ రాశి వారికి వెన్ను, గుండె, బ్యాక్ బోన్, బ్లడ్‌తో సంబంధం కలిగి ఉంటుంది. ఈ రాశి వారికి మూల చక్రం చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. వీరు ఎక్కువగా బీపీతో బాధపడుతుంటారు. దీంతో పాటే గుండె సమస్యలు కూడా అధికంగా దరిచేరే అవకాశం ఉంది. హార్ట్ స్ట్రోక్ రావడానికి గల కారణాలు ఎమైతే ఉంటాయో వాటికి దూరంగా ఉండటం బెటర్. అంతేకాకుండా సింహ రాశి వారికి సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఎక్కువే. వీరిని ఎవరైనా మరిచిపోతే అస్సలు తట్టుకోలేరు. వారిపై కోపం పెంచుకుంటారు.

కన్య రాశి : కన్యరాశి వారిని బుధుడు పాలిస్తాడు. వీరికి ప్రేగులతో, పొత్తి కడుపుతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ రాశి వారికి అప్పుడప్పుడు జీర్ణవ్యవస్థ, ఆహారపు అలవాట్లతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందువల్ల కన్యారాశి వారు ఆరోగ్యకరమైన ఆహారాన్నే ఎల్లప్పుడూ తీసుకోవాలి, కానీ, దానిపై ఎక్కువ మక్కువ చూపరాదు. ఆహారం విషయంలో సమతుల్యత పాటించడం అవసరం. మరోవైపు ఈ రాశి వారు తమ జీవితంలో ఎదైనా చిన్న చెడు ఘటన జరిగినా భరించలేరు. వీరికి ఓసీడీ అలవాటు కూడా ఎక్కువే.

తులా రాశి : తులరాశికి చెందినవారిలో చర్మం, మూత్రపిండాల వ్యాధులు, అడ్రినల్ గ్రంథులతో దగ్గరి సంబంధం ఉంటుంది. శుక్రుడు ఈ రావి చక్రాన్ని పరిపాలిస్తాడు కావున తులా రాశి సౌరవ్యవస్థలో చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ రాశి యువతి, యువకులు సున్నితమైన చర్మాన్ని కలిగి ఉంటారు. తులా రాశి వారికి ఎక్కువగా హైడ్రేటెడ్ మరియు తేమగా ఉండటం చాలా ఇంపార్టెంట్. ఈ రాశి కలవారు ఎల్లప్పుడూ మంచి ఆహారం తీసుకోవాలి.ఎందుకనగా వారికి కడుపు సమస్యలతో పాటు తీసుకునే ఆహారం కారణంగా జీర్ణంకాకపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశికి చెందిన వారికి మూత్రాశయం, పురీషనాళం, అండాశయాలు, వృషణాలు, జననాంగంతో దగ్గరి సంబంధం ఉంటుంది. ఈ రాశి మూల చక్రం, పవిత్ర చక్రం పైనే ఈ రాశి సామర్థ్యం ముడిపడి ఉంటుంది. ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండకపోతే లైంగికంగా సంక్రమించే వ్యాధులు తలెత్తే అవకాశం ఉంది. ఈ రాశి గల మహిళలకు యూరిన్ ఇన్ఫెక్షన్లు, యూటీఐ అండ్ పీసీవోఎస్ వంటి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి : ధనుస్సు రాశికి చెందినవారిలో కంటి దృష్టితో పాటు తొడ వెనుక భాగపు నరాలకు దగ్గరి సంబంధం ఉంటుంది. ధనుస్సు రాశి వారికి కళ్ళకు సంబంధించిన సవాళ్లు ఎదురయే అవకావం ఉంది. వీరు అన్నివేళలా సరైన చికిత్సను తీసుకోవడం బెటర్. దృష్టి లోపం కూడా వారిని ప్రమాదాలకు గురిచేసే అవకాశం లేకపోలేదు. మరోవైపు ఈ రాశి వారికి తీవ్రమైన భయం ఉంటుంది. వీరు సహజంగానే అన్వేషకులు, ప్రయాణించడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

మకర రాశి : మకర రాశికి చెందిన వారిలో ఎక్కువగా ఎముకలు, చర్మం , మోకాలు, దంతాలతో పాటు కీళ్లతో సంబంధం ఉంటుంది. అందుకే ఈ రాశి వారు ఎక్కువగా కీళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. వీరు ఒకవేళ ఆటగాళ్లు అయితే ఎక్కువగా కీళ్ల నొప్పులకు గురయ్యే అవకాశాలున్నాయి. అందువల్ల ఈ రాశి వారు ఎక్కడైనా, ఏదైనా పనిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

కుంభ రాశి : కుంభ రాశి వారికి చీలమండలు, కాళ్లు, రక్త ప్రసరణతో డైరెక్ట్ సంబంధం కలిగి ఉంది. ఈ రాశి వారికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు తలెత్తవు. అందుచేత వీరి కాళ్లకు అప్పుడప్పుడు మంచి మసాజ్ చేయించుకోవాలి. వీరు చీలమండల్లో నొప్పిని కూడా భరించే అవకాశముంది. కుంభ రాశి వారు కాళ్లకు సంబంధించిన మసాజ్‌లు చేయించుకుంటే మంచిది. వీరి భవిష్య‌త్ లో కాళ్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాయి.

మీన రాశి : మీన రాశి వారికి పాదాలు, నాడీ వ్యవస్థతో సంబంధం కలిగి ఉంటుంది. వీరికి రోగనిరోధక వ్యవస్థ ఆందోళనకరంగా ఉండటమే కాకుండా శ్వాస వ్యవస్ధను రెగ్యులర్‌గా చెకప్ చేయించుకోవాలి. ఎందుకనగా అది వారి రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

మీనరాశికి చెందిన వారిలో ఎప్పుడూ ఊహాల్లో తేలియాడుతుంటారు. అదే తమ ప్రపంచంలో జీవిస్తుంటారు. అంతేకాకుండా, వీరు తమ క్రియేటివిటీపై అధికంగా ఆధారపడతారు. వీరు తాము నిర్వర్తించాల్సిన బాధ్యతల పట్ల ఎక్కువగా భయపడతారు.

Read Also : Yoga Belly Fat Fast : ఎంతటి బానపొట్టనైనా కరిగించే అద్భుతమైన యోగాసనాలు ఇవే!
Read Also : Ganesha idol : మీ ఇంట్లో వినాయడి విగ్రహం ఉందా? ఈ వాస్తు నియమాలు పాటించాలి.. లేదంటే సమస్యలు కొనితెచ్చుకున్నట్టే!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Live Longer : మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందట.. కొత్త అధ్యయనం వెల్లడి

Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More

7 days ago

Couple Marriage Life : లైంగిక జీవితంలో ముందుగా భావప్రాప్తి పొందేది వీరేనట..!

Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More

7 days ago

Dosakaya Thotakura Curry : ఇలా కొత్తగా దోసకాయ తోటకూర కలిపి కూర చేయండి అన్నంలోకి సూపర్ అంతే

Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More

7 days ago

Mughlai Chicken Curry Recipe : రెస్టారెంట్ దాబా స్టైల్లో చిక్కటి గ్రేవీతో మొగలాయ్ చికెన్ కర్రీ.. సూపర్ టేస్టీ గురూ..!

Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More

7 days ago

Onion chutney : కూరగాయలు లేనప్పుడు ఉల్లి వెల్లుల్లితో చట్నీలు చేశారంటే పెరుగన్నంలో కూడా నంచుకు తింటారు…

Onion chutney  : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More

7 days ago

Lakshmi Devi : లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ

Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More

7 days ago