Latest

Best Age for Pregnancy : ఏ వయస్సులో పిల్లలను కనాలి? 30ఏళ్ల తర్వాత సంతానం కలుగుతుందా? సైన్స్ ఏం చెబుతోంది!

Advertisement

best age to have a baby for woman : ఏ వయస్సులో ముచ్చట ఆ వయస్సులోనే తీర్చుకోవాలంటారు. ఆ వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యం సహకరించదు. వయస్సులో ఉన్నప్పుడే అవసరమైన విషయాలను నెరవేర్చుకోవాలంటుంటారు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో వయస్సుతో సంబంధం లేకుండా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా మహిళల్లో సంతానలేమి సమస్యలు అధికంగా ఉంటున్నాయి.

30ఏళ్ల వయస్సు దాటిన మహిళల్లో ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తే అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. నేచురల్ ప్రెగ్నెన్సీ రాకపోవడంతో IVF విధానాలను ఆశ్రయించాల్సి వస్తోంది. దంపతులు సంతానం కోసం ప్రయత్నించడానికి ముందు.. పెళ్లిన తొలినాళ్లలోనే ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. IVF వంటి విధానం లక్షల ఖర్చుతో కూడుకున్నది. అది సక్సెస్ అవుతుందా? కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.

జీవితకాలం పాటు 2 మిలియన్ల అండాలు :
మహిళలు పుట్టినప్పటి నుంచే వారిలో అండాలకు సంబంధించి వ్యవస్థ ఏర్పడి ఉంటుంది. మహిళల జీవితకాలంలో 2 మిలియన్ల అండాల వరకు ఉత్పత్తి అవుతాయని అంచనా. ఈ 2 మిలియన్ల అండాలు మాత్రమే జీవించినంత కాలం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది.
Remedy for Pimples Acne : మెటిమలను మాయం చేసే టెక్నిక్.. చర్మం క్షణాల్లో మెరిసిపోవాల్సిందే!

చిన్నతనం నుంచి కౌమారదశ వచ్చేనాటికి 3 లక్షల అండాలు మాత్రమే విడుదల అవుతాయి. అండాశయంలో 3 లక్షల అండాలు ఉంటే సంతానం కలిగే అవకాశం ఉంటుంది. మూడు లక్షల అండాల్లో కొన్ని అండాలు మాత్రమే ఆరోగ్యంగా ఉంటాయి. అన్ని అండాలు సంతానానికి పనికిరావు. అనారోగ్యంగా ఉండే అండాలతో సంతానం కలుగదు.

పెళ్లైన కొత్తలోనే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ బెటర్ :
భార్యా భర్తల కలయికతోనే ప్రెగ్నెన్సీకి అవకాశం ఉంటుంది. కలయికతో సంతానం కలుగుతుందనడంలో గ్యారంటీ లేదు. అది స్త్రీలు, పురుషుల్లో పునరుత్పత్తి వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. అది వయసు పెరిగే కొద్ది క్రమంగా తగ్గిపోతుంటుంది.

అందుకే పెళ్లైన కొత్తలోనే పిల్లల కోసం ప్లానింగ్ చేసుకోవడం చాలా ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. మహిళలు 50ఏళ్ల తర్వాత మోనోపాజ్ కావాలి. కొంత మంది మహిళలు 40ఏళ్ల వయసులోనే మెనోపాజ్ కావాలి. ఈలోపే ప్రెగ్నెన్సీ అయ్యేలా చూసుకోవాలి.

మహిళల్లో ​20 ఏళ్ల వయసులో పునరుత్పత్తి వ్యవస్థ చురకుగా ఉంటుంది. ఈ వయస్సులోనే ప్రెగ్నెన్సీ చాలా సులభంగా అవుతుంది. మహిళల అండాశయాల్లో ఉత్పత్తి అయ్యే 90 శాతం అండాలు మామూలుగానే కనిపిస్తుంటాయి. అప్పుడు ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
Oral Diabetes : నోటిలో ఇలాంటి లక్షణాలు ఉంటే.. డయాబెటిస్ వచ్చినట్టేనా?

24ఏళ్ల వయసులో స్త్రీలలో పునరుత్పత్తి వ్యవస్థ చురుకుగా ఉంటుందని చెబుతున్నారు. ఈ వయసులో స్త్రీలు నెలసరి వస్తే గర్భం దాల్చే అవకాశం అధికంగా ఉంటుంది. చాలామంది కెరీర్ ముందుగానే పిల్లల కోసం ప్లానింగ్ చేసుకుంటే కష్టమని భావిస్తుంటారు.

ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటుందని భావిస్తారు. వయస్సుపరంగా సంతాన సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. 25 సంవత్సరాల అనంతరం మహిళల్లో చాలామందిలో పునరుత్పత్తి వ్యవస్థ అనేది క్రమంగా క్షీణించిపోతుంది. 25ఏళ్ల వయస్సు నుంచి 34 ఏళ్ల వయసులో 24ఏళ్ల వయసులో పునరుత్పత్తి సామర్థ్యం పెరిగిపోతుంది.

best age to have a baby for woman

ఒక ఏడాదిలో పిల్లల కోసం ప్రయత్నిస్తే.. గర్భం దాల్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ వయస్సులో గర్భస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రసవ వైద్యుల సూచనల మేరకు భయపడాల్సిన పనిలేదని గుర్తించుకోవాలి.

​గర్భస్రావానికి అవకాశం ఎక్కువ :
సంతానం కోసం ప్రయత్నించే వారంతా 30 ఏళ్లలో కూడా పిల్లలను కనే ఛాన్స్ అధికంగానే ఉంటాయని చెబుతున్నారు. ఈ వయసులో గర్భస్రావానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిల్లలను కనే విషయంలో దంపతుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. సంతానం కోసం ప్రయత్నించినప్పుడు అప్పుడు వారిలో పునరుత్పత్తి వ్యవస్థ సరిగా పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలి.

యువ్వన దశలో స్త్రీలలో పునరుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఆ సమయంలోనే గర్భం దాల్చడం చాలా ఈజీ. అదే వయసు పెరిగే కొద్ది మహిళల్లో పునరుత్పత్తి వ్యవస్థ తగ్గుతుంటుంది. గర్భం దాల్చడం కష్టమంటున్నారు వైద్యులు. 30ఏళ్లు దాటిన వారిలో ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టమే. స్త్రీలల్లో అండాశయంలో అండాలు సరిగా విడుదల కావు. అండాశయంలో అండాల విడుదలైతేనే సంతానం అందుతుంది.
Biting Your Nails : గోళ్లు కొరికే అలవాటు ఉందా? ఈ జబ్బుల ముప్పు ఎక్కువ

మహిళలు ​35 ఏళ్లు దాటిన తర్వాత సంతానం అందడం చాలా తక్కువగా ఉంటుంది. 37ఏళ్లు దాటితే వారిలో కూడా సంతానలేమి సమస్య అధికంగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ సంతానం అందినా అనేక ఇబ్బందులు ఉండొచ్చు. అండాశయంలో కొందరికి అండాలు బాగానే విడుదల అవుతాయి. కానీ, సంతానం నిలిచే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

ఈ వయస్సులో నేచరుల్ ప్రెగ్నెన్సీ కంటే IVF పద్ధతిలో ప్రెగ్నెన్సీకి ప్రయత్నించడం మంచిది. 40ఏళ్ల నుంచి 50ఏళ్ల మధ్యలో సంతానం కోసం ప్రయత్నిస్తే. IVF ద్వారా మాత్రమే ఎక్కువగా అవకాశం ఉంటుంది. అండాలను ఫ్రీజు చేసి ఫలదీకరణ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

 30ఏళ్లలోపు ప్రెగ్నెన్సీ మంచిది :
పిల్లలు కనేందుకు వయస్సు కూడా చాలా ముఖ్యమే.. ఎందుకంటే.. ఏ వయస్సులో ముచ్చట ఆ వయస్సులోనే తీర్చుకోవాాలంటారు. పిల్లలను కనడం కూడా అంతే.. సరైన వయస్సులో పిల్లలను కనేందుకు ప్లాన్ చేసుకోవాలి. 30ఏళ్లలోపు ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తే చాలా మంచిది. ఆరోగ్యపరంగా మహిళలకు ప్రయోజనకరమైనదిగా ప్రసవ వైద్యులు చెబుతున్నారు.

సాధారణ పద్ధతిలో పిల్లలను కనడమే మంచిది. ఒకవేళ ఆ పరిస్థితి లేకపోతే.. కృత్రిమ పద్ధతి ద్వారా పిల్లలను కనేందుకు ప్లాన్ చేయాలి. సంతానం విషయంలో ఆరోగ్య పరిస్థితిని కూడా గమనించుకోవాలి. ఆరోగ్యంగా ఉండి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనప్పుడు మాత్రమే ప్రెగ్నెన్సీకి ప్రయత్నించాలి.

పిల్లలు పుట్టకుండా చాలామంది కొన్ని నియంత్రణ పద్ధతులను పాటిస్తుంటారు. ఒకసారి ప్రెగ్నెన్సీ సమయం దాటితే మళ్లీ పిల్లలు కనడం కష్టంగా మారొచ్చు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రసవ వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
Ayurvedic Remedies : వాస‌నను కోల్పోయారా ? ఈ ఆయుర్వేద చిట్కాలను ఓసారి ట్రై చేసి చూడండి

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Live Longer : మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందట.. కొత్త అధ్యయనం వెల్లడి

Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More

5 days ago

Couple Marriage Life : లైంగిక జీవితంలో ముందుగా భావప్రాప్తి పొందేది వీరేనట..!

Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More

5 days ago

Dosakaya Thotakura Curry : ఇలా కొత్తగా దోసకాయ తోటకూర కలిపి కూర చేయండి అన్నంలోకి సూపర్ అంతే

Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More

5 days ago

Mughlai Chicken Curry Recipe : రెస్టారెంట్ దాబా స్టైల్లో చిక్కటి గ్రేవీతో మొగలాయ్ చికెన్ కర్రీ.. సూపర్ టేస్టీ గురూ..!

Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More

5 days ago

Onion chutney : కూరగాయలు లేనప్పుడు ఉల్లి వెల్లుల్లితో చట్నీలు చేశారంటే పెరుగన్నంలో కూడా నంచుకు తింటారు…

Onion chutney  : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More

5 days ago

Lakshmi Devi : లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ

Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More

5 days ago