Farm Chicken Curry : ఫారం కోడి కూరను అచ్చం నాటుకోడి కూర అంత రుచిగా చేసుకోవచ్చు తెలుసా? తెలంగాణ పల్లెల్లో జుట్టు కోడిని బాగా కాల్చుకుని క్లీన్ చేసిన ఫారం కోడి మాంసాన్ని తెచ్చుకోవాలి. ఈ కోడిలో చిన్న చిన్న గుడ్లు ఉంటాయి. కూరలో ముందుగా వేయకుండా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్‌లో స్పూన్ ఉప్పు, రెండు స్పూన్ల కారం 1/4 స్పూన్ పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ గుడ్లు లివర్‌లో కొంచెం ఉప్పు, కారం పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. ఈ ఫారం కోళ్ళని గుడ్లు పెట్టడానికి పెంచుతారు.
ఫారం కోడిని లేయర్ కోడి అని అంటారు. ఈ చికెన్ కొంచెం గట్టిగా ఉండి దాదాపు నాటుకోడి మాదిరిగానే ఉంటుంది. మసాలా కోసం స్టవ్ వెలిగించి చిన్న ఎండు కొబ్బరి ముక్కని తీసుకోవాలి. కోడిని కాల్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని 3 స్పూన్ల ధనియాలు 1 స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ సోంపు, ఏడు ఎనిమిది యాలకులు, 5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, చిన్న అనాసపువ్వు వేసి మంటలో ఫ్లేమ్ లో ఉంచి రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి.

ఇందులో రెండు స్పూన్ల నువ్వులు ముందుగా కాల్చి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసి కొంచెం సేపు వేయించుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫారం కోడి కూర నీచు వాసన రాకుండా ఉండాలంటే.. మసాలా గట్టిగా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్‌లో ఐదారు స్పూన్ల వరకు నూనె వేసి సన్నగా కట్ చేసిన పుదీనా, కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలపాలి. చాలా సన్నగా కట్ చేసిన 2 ఉల్లిపాయల ముక్కలు, ఐదు ఆరు పచ్చిమిర్చిల ముక్కలు వేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఎర్రగా మంచి కలర్‌లోకి వచ్చేవరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పసుపు, రెండు స్పూన్ల కారం వేసి అంతా బాగా కలపాలి.
Farm Chicken Curry : నాటు కోడి రుచి రావాలంటే..
ఇందులో ఉప్పు కారం పట్టించిన చికెన్ కూడా వేసి మంట హై ఫ్లేమ్ లో ఉంచి 5 నిమిషాల పాటు కంటిన్యూగా కలుపుతూ వేగనివ్వాలి. చికెన్ ఎక్కువ సేపు నూనెలో వేయిస్తేనే టేస్ట్ బాగుంటుందని గుర్తుంచుకోవాలి. చికెన్ వేయిస్తున్నప్పుడు నీళ్లు మాంసంలో నుంచి నీళ్లు ఊరుతాయి. ఆ నీళ్ళని ఆవిరి అయిపోయిన తర్వాత మూత పెట్టి మంట లో ఫ్లేమ్ లో ఉంచి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇందులో ఉన్న నీళ్లన్నీ పోయి కూర డ్రైగా మారిన తర్వాత ముక్కలు మునిగే వరకు కూర ఉడకడానికి సరిపడినన్ని వేడి వేడి నీళ్లు పోసి ఒకసారి కలిపి మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్‌లో ఉంచి నాలుగైదు విజిల్స్ వచ్చేవరకు ఉడకనివ్వాలి.
ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. లేదంటే మరి కొంచెం సేపు ఉడికించుకోవచ్చు. ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసుకోవాలి. టెస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కారం లాంటివి మళ్లీ వేసుకోవచ్చు. ముందుగా పక్కన పెట్టుకున్న గుడ్లను కూడా ఇందులో వేసుకోవచ్చు. కూరలో గుడ్లు చితికినట్లయితే కూర నీచు వాసన వస్తుంది. ఏమాత్రం కదపకుండా మూతపెట్టి గుడ్లు గట్టి పడే వరకు 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చివరిగా కూరలో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా తినడమే.. అన్నం లేదా రోటి, రాగి ముద్ద ఇలా ఎందులోనైనా ఎంతో రుచిగా నాటుకోడి కూరలా ఫారం కోడి కూర తినవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఓసారి మీ ఇంట్లో ఫారం కోడి కూరను ట్రై చేయండి.